ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం అమరావతిలో వేసిన శిలాఫలకాలు ఇప్పుడు వెక్కిరిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. ఏడాదవుతున్న రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పేర్చలేదని మండిపడ్డారు. సోమవారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శంకుస్థాపన కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 100 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.