ఈ చిన్నారి ఘటన మీకు కనిపించలేదా? | Punganur Girl Incident: YSRCP MLA Peddireddy Slams AP Government | Sakshi
Sakshi News home page

ఈ చిన్నారి ఘటన మీకు కనిపించలేదా?

Published Sat, Oct 5 2024 12:09 PM | Last Updated on Sat, Oct 5 2024 4:45 PM

Punganur Girl Incident: YSRCP MLA Peddireddy Slams AP Government

పుంగనూరు((చిత్తూరు జిల్లా): కిడ్నాప్‌కు గురై ఆపై హత్య గావించబడ్డ పుంగనూరుకు చెందిన అశ్వియా కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలు పరామర్శించారు. శనివారం పుంగనూరుకు వెళ్లిన పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిలు.. అశ్వియా కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు.   కుమార్తె అశ్వియా హత్యకు గురి కావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తండ్రి హజ్మతుల్లాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిలు ఓదార్చి ధైర్యం చెప్పారు.

అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘పుంగనూరులో ఇలాంటి దారుణ ఘటన ఎప్పుడూ జరగలేదు. ఇంటి ముందు ఆడుకుంటున్న రెండవ తరగతి చదువుతున్న చిన్నారి కిడ్నాప్ , హత్య జరిగితే ప్రభుత్వం​ పట్టించుకోలేదు. దీనిపై దోషులను శిక్షించకపోతే అందుకు తగిన విధంగా స్పందిస్తాం. ఈ ఘటనలో పోలీసుల అసమర్థత కనిపిస్తోంది. మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ ఘటనలో డీజీపీ, సీఐడీ అధికారులను ప్రత్యేక ఫ్లైట్‌, హెలికాప్టర్‌ ఇచ్చి పంపించి దర్యాప్తు చేశారు. 

మరి ఈ చిన్నారి ఘటన పోలీస్‌ ఉన్నతాధికారులకు కనిపించడం లేదా?, ఈ నెల9వ తేదీన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుంగనూరుకు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ ఆందోళన చేపట్టనుంది. బాధిత కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. 

‘కానరాని లోకాలకు చిట్టితల్లి’

9న పుంగనూరుకు వైఎస్‌ జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement