తెలంగాణ ఆర్టీసీని కాపాడుకుందాం
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
హన్మకొండ: ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వాన్ని బలపరచాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం హన్మకొండలో జరిగిన ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ విజయోత్సవ సభలో కడియం శ్రీహరి మాట్లాడారు. కార్మికులు ఊహించని విధంగా సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారని చెప్పారు. ఇది కేసీఆర్ అందించిన తెలంగాణ కానుక అని అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ఆర్టీసీ కార్మికులు భాగస్వాములు కావాలని సూచించారు.
తెలంగాణ ఆర్టీసీని కాపాడుకుందామన్నారు. తెలంగాణను అడ్డుకొన్న శక్తులే.. ఏర్పాటైన రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు జేయాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు.
పాలమూరు బంద్‌కు టీఎంయూ మద్దతు..
పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడాన్ని నిరసిస్తూ మహబూబ్‌నగర్ జిల్లాలో ఈనెల 10వ తేదీన చేపట్టనున్న బంద్‌కు ఆర్టీసీ టీఎంయూ సంపూర్ణ మద్దతు ఇస్తోందని టీంఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి చెప్పారు. బంద్‌లో ఆర్టీసీ కార్మికులు పాల్గొంటారన్నారు. టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డికి.. టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను, టీఎంయూను విమర్శించే హక్కు లేదన్నారు. రాజిరెడ్డీ నువ్వెంత, నీ సెజైంత? నీ దమ్మెంత.. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి నీది కాదు.. అని మండిపడ్డారు.