
కార్మిక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు విఫలం
బస్ భవన్లో కార్మిక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం శనివారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
హైదరాబాద్: బస్ భవన్లో కార్మిక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం శనివారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 22న కార్మిక శాఖ కమిషనర్తో కార్మిక సంఘాలు తుది చర్చలు జరపనుంది. వేతన సవరణపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలనే డిమాండ్‌తో ఈయూ-టీఎంయూ నేతలు ఇటీవల ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.