►ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరిన గవర్నర్.. ఆ సంస్థ ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించారు. ఆర్టీసీ యూనియన్ నాయకులతో పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆర్టీసీ యూనియన్ సభ్యుల బృందం గవర్నర్‌తో గంటపాటు చర్చించారు. గవర్నర్ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని ఆ సంఘం నేత థామస్‌రెడ్డి తెలిపారు.
►గవర్నర్ లేవనెత్తిన ఐదు అభ్యంతరాలపై తెలంగాణ సర్కార్ వివరణ ఇచ్చింది. ఈనేపథ్యంలో ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమిళిసై ఏం నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది.
►రాజ్‌భవన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ రాజ్‌భవన్ ముట్టడికి ర్యాలీగా ఆర్టీసీ ఉద్యోగులు బయలుదేరారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్టీసీ యూనియన్ నేతలను చర్చలకు గవర్నర్ ఆహ్వానించారు.
►ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. గవర్నర్ తీరును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు. రెండు గంటలపాటు బస్సులను బంద్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసే బిల్లును వెంటనే గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా డిపోల్లో బస్సులన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు బంద్ పాటించారు. రెండు గంటల పాటు ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పీవీ మార్గ్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల అందోళనతో బస్సులు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ ,ఉట్నూరు, బైంసా, నిర్మల్, అసిపాబాద్, మంచిర్యాల డిపోల ముందు ఆందోళన కొనసాగుతుంది.
రెండు గంటల బంద్‌లో భాగంగా నల్లగొండ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. మరోవైపు డిపో వద్ద గురుకుల అభ్యర్థులు నిరసనకు దిగారు. పరీక్ష కోసం వెళ్లేందుకు బస్సులు లేవంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు సర్వీసులు నిలిపివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment