
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఊరు మన బడి పథకంలో పెద్ద స్కాం జరిగిందని ఎంఐఎం ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. అది కాళేశ్వరం కంటే పెద్ద స్కామ్ అని పేర్కొన్నారు. ఈరోజు(మంగళవారం) అసెంబ్లీ వేదికగా మన ఊరు మన బడి అంశానికి సంబంధించి మాట్లాడారు. ‘ మన ఊరు మన బడి పథకంలో పెద్ద స్కాం జరిగింది.
మన ఊరు మన బడి లో ఏమి పని జరగలేదు...జరిగిన దానికి నిదులు విడుదల కాలేదు. మన ఊరు మన బడి పథకంలో బెంచీల కొనుగోళ్లలో స్కాం జరిగింది. ఈ స్కాం పై ప్రశ్న వేద్దాం అనుకుంటే ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నారు. రూ. 14, రూ. 18, రూ. 20వేల ఒక్కో బెంచ్ కొన్నారు. రూ. 5వేలకు ఒక బెంచ్ వస్తది...20వేల పెట్టీ కొన్నారు.
బెంచీల కొనుగోళ్ల పై ఈ ప్రభుత్వం విచారణ చేయించాలి.నేను పేర్లు చెప్పలేని...కాళేశ్వరం కంటే పెద్ద స్కాం. నిధులను లూటీ చేశారు.. 32లక్షల బెంచీలను కొనుగోలు చేశారు. పెద్ద స్కాం చేశారు. దానికి సంబంధించి ఒకరు అప్పుడు BRS తో ఉన్నారు...ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు’ అని అక్బరుద్దీన్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment