అక్బరుద్దీన్‌కు హైకోర్టు నోటీసులు | High Court Notice To Akbaruddin Owaisi | Sakshi

అక్బరుద్దీన్‌కు హైకోర్టు నోటీసులు

Dec 14 2019 1:16 AM | Updated on Dec 14 2019 1:16 AM

High Court Notice To Akbaruddin Owaisi - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: బెయిల్‌ షరతులను ఉల్లంఘించారనే ఆరోపణల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2012లో నిజామాబాద్‌లోని ఓ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన హైకోర్టు నుంచి గతంలో బెయిల్‌ పొందారు. బెయిల్‌ షరతులకు విరుద్ధంగా అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన బెయిల్‌ రద్దు చేయాలని హిందూ సంఘటన్‌ అధ్యక్షుడు, న్యాయవాది కరుణ సాగర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్‌ బెయిల్‌ను రద్దు చేయాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను కింది కోర్టు కొట్టేయడంతో హైకోర్టులో రిట్‌ దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement