Dec15th: తెలంగాణ అసెంబ్లీ లైవ్‌ అప్‌డేట్స్‌ | Telangana Assembly Live Updates | Sakshi
Sakshi News home page

Dec15th: తెలంగాణ అసెంబ్లీ లైవ్‌ అప్‌డేట్స్‌

Published Fri, Dec 15 2023 6:46 AM | Last Updated on Fri, Dec 15 2023 1:24 PM

Telangana Assembly Live Updates  - Sakshi

మంత్రులు, ఎంఐఎం ఎమ్మెల్యేలతో  సీఎం భేటీ

  • తన ఛాంబర్‌లో మంత్రులతో సీఎం రేవంత్‌ ప్రత్యేక భేటీ
  • హాజరైన మంత్రులు శ్రీధర్‌బాబు, మల్లు భట్టి విక్రమార్క

మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్‌

  • మల్కాజ్‌గిరి ఎంపీగా  నేను పోటీ చేయను...
  • మా కుటుంబం నుంచి ఇద్దరం ఎమ్మెల్యేలం అయ్యాం ఇక చాలు
  • కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మా సహకారం ఉంటుంది 

గవర్నర్‌ స్పీచ్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కామెంట్స్‌ 

  • గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదు
  • కొత్త ప్రభుత్వం చేసే పనిపై స్పష్టత ఇవ్వలేదు
  • మేనిఫెస్టో చదవటానికి మాత్రమే జాయింట్ సెషన్ పెట్టినట్టు కనిపిస్తోంది
  • గత  ప్రభుత్వం  దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిపింది 
  • పంటల విస్తీర్ణం పెరిగింది అనేది వాస్తవం
  • 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది
  • తలసరి ఆదాయం, ఐటీ ఎగుమతులు వృద్ధి చెందాయి
  • ఇవన్నీ చూసిన గవర్నర్ ఇప్పుడు అప్పుడు ఏం మాట్లాడారో సమీక్ష చేసుకోవాలి
  • ప్రజలు స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నారని గవర్నర్ చెప్పటం హాస్యాస్పదం
  • గవర్నర్ ఏదో చెప్తారని ఆశ పడ్డాం

గవర్నర్‌ ప్రసంగంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భేటీ

  • బీఆర్‌ఎస్‌ఎల్పీ ఆఫీసులో భేటీ అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
  • గవర్నర్‌ ప్రసంగపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
  • దిశానిర్దేశం చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌

ముగిసిన గవర్నర్‌ ప్రసంగం.. ముఖ్యాంశాలివే..

  • ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం 
  • కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరిపిస్తాం
  • తొమ్మిదేళ్లలో ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు 
  • వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతాం
  • దివాళా తీసిన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే మా లక్ష్యం
  • తెలంగాణలో మార్పును ప్రజలు గమనిస్తున్నారు 
  • ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగాలని కోరుకుంటున్నారు
  • ప్రజా దర్భార్‌లో ప్రజాసమస్యలు పరిష్కారం అవుతున్నాయి
  • ఇది మా ప్రభుత్వం అనే భావన ప్రజల్లో కలుగుతోంది 
  • యూపీఏ ప్రభుత్వమే తెలంగాణను ఏర్పాటు చేసింది
  • సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం రోజే తన లక్ష్యాలను స్పష్టంగా చెప్పారు
  • ఇది నిజమైన ప్రజా పాలన 
  • ఆరు గ్యారెంటీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేశాం 
  • నిరుద్యోగుల కలను మా ప్రభుత్వం నెరవేరుస్తుంది 
  • అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షల మేరకే పాలన
  • తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు 
  • లక్ష్యాలను సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం
  • డ్రగ్స్‌ పై మా ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది 
  • ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో పూర్తి చేస్తాం 
  • మహాలక్ష్మి స్కీమ్‌లోని మిగిలిన పథకాలను త్వరలో అమలు చేస్తాం 
  • మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం 
  • పాలకులు సేవకులే తప్ప పెత్తందారులు కాదు  
  • 10 ఏళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకున్నారు
  • మా పాలన పౌరహక్కులు, ప్రజాపాలనకు నాంది పలికింది
  • వైద్య ఖర్చులు పెరగడంతో ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచాం
  • త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం

ప్రారంభమైన గవర్నర్‌ ప్రసంగం

  • కాళోజి కవితతో స్పీచ్‌ ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై 
  • సమావేశమైన ఉభయ సభలు
  • హాజరైన స్పీకర్‌, శాసన మండలి చైర్మన్‌ 
  • కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ 

కాసేపట్లో అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం..

  • తెలంగాణలో ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో ప్రసంగించనున్న గవర్నర్‌ తమిళిసై
  • 11.30కు  ప్రారంభమవనున్న సభ
  • ప్రసంగం ముగిసిన తర్వాత వాయిదా పడనున్న సభ
  • రేపటి నుంచి గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ 
  • గ్యారెంటీలన్నీ ఎప్పటి నుంచి అమలు చేస్తారనేదానిపై గవర్నర్‌ ప్రసంగంలో క్లారిటీ ఇచ్చే ఛాన్స్‌ 
  • గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తర్వాత బీఏసీ మీటింగ్‌ 
  • సభ ఎన్నిరోజులు నడపాలనేదానిపై నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement