ఇళ్ల స్థలాల పేరుతో భారీ స్కామ్
పీలేరు: చిత్తూరు జిల్లాలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇళ్ల స్థలాల పేరుతో డబ్బులు వసూలు చేసి, ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంతో పీలేరులో ఆర్టీసీ కార్మికులు ఆదివారం ఆందోళనకు దిగారు.
ఆర్టీసీ డిపో పక్కనే ఉన్న హౌసింగ్ సొసైటీ కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సుమారు 480 మంది కార్మికుల నుంచి రూ.2 కోట్ల మేర వసూళ్లు చేసినట్టు ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. రెండేళ్లయినా ఇంతవరకూ ఇంటి స్థలాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిటీలోని సీఐ రామచంద్రంనాయుడుతోపాటు మిగిలిన వారు వేధింపులకు పాల్పడుతున్నారని బాధితులు చెప్పుతున్నారు.