
సాక్షి, తిరుపతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న జ్ఞానభేరి సభ రసాభాసంగా మారింది. విద్యార్థులు ప్రత్యేక హోదా నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. దీంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఊహించని ఈ పరిమాణాలతో సభ అంతా గందరగోళంగా మారింది. పోలీసులు అప్రమత్తమై విద్యార్థి నాయకుడు నాగరాజును అరెస్ట్ చేశారు. సీఎం డౌన్ డౌన్ అనే నినాదంతో అక్కడి ప్రాంగణం అంతా హోరెత్తింది.
Comments
Please login to add a commentAdd a comment