సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్ట్ పద్ధతిలో కండక్టర్ల, డ్రైవర్ల నియామకాలకు ఆర్టీసీ ముగింపు పలికి, దానికి బదులుగా టెంపరరీ(తాత్కాలిక) విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సంస్థ సిద్ధమవుతోంది. ఈమేరకు శుక్రవారం జరగనున్న పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఆలోచనను కార్మిక సంఘాలు స్వాగతించాయి. అయితే రెగ్యులర్ విధానంలో కాకుండా తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవడానికి అనుమతి ఇవ్వడం పట్ల కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. నియామకాలన్నీ రెగ్యులర్ పద్ధతిలోనే చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఐఆర్‌పై 17న ప్రకటన: ఆర్టీసీ యాజమాన్యం
ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర భృతి(ఐఆర్) ఇవ్వడానికి అభ్యంతరం లేదని, కానీ ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఈనెల 17న నిర్ణయం వెలువరిస్తామని ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాలకు తెలిపింది. సంస్థ ఎండీ జె.పూర్ణచంద్రరావు గురువారం ఈయూ, టీఎంయూ ప్రతినిధిబృందంతో చర్చలు జరిపారు. సంస్థ ప్రకటించే ఐఆర్ సంతృప్తికరంగా లేకుంటే.. అదే రోజు సమ్మె తేదీని ప్రకటిస్తామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.
ఆర్టీసీలో తాత్కాలిక కొలువులు
Published Fri, Jan 10 2014 4:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement