కెపాసిటీ ఉన్న వారికి మధ్యంతర భరణం ఎందుకు : ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు | Capable women shouldt seek interim alimony : Delhi High Court | Sakshi
Sakshi News home page

కెపాసిటీ ఉన్న వారికి మధ్యంతర భరణం ఎందుకు : ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Published Thu, Mar 20 2025 5:00 PM | Last Updated on Thu, Mar 20 2025 6:23 PM

Capable women shouldt seek interim alimony : Delhi High Court

సంపాదనా సామర్థ్యమున్న మహిళలకు మధ్యంతర భరణం అడగకూడదు : కోర్టు

పనీ పాటాలేకుండా కూర్చునే  వాళ్లను కోర్టు సమర్ధించదు 

విద్యార్హతకు తగిన  ఉద్యోగం వెదుక్కోవాలి

భార్యాభర్తల విభేదాలు, మధ్యంతర భరణం  విషయంలోఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సామర్థ్యం ఉన్న మహిళలు మధ్యంతర భరణం కోరకూడదంటూ భర్త నుండి తాత్కాలిక భరణం నిరాకరించిన చర్చకు తావిచ్చింది. సంపాదనా సామర్థ్యం ఉన్న అర్హత కలిగిన మహిళలు తమ భర్తల నుండి మధ్యంతర భరణం కోరకూడదని,  పనిలేకుండా ఉండటానికి చట్టం ప్రోత్సహించదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు ట్రయల్ కోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉన్నత విద్యావంతురాలైనప్పటికీ నిరుద్యోగిగా ఉన్న ఒక మహిళకు మధ్యంతర భరణం తిరస్కరించడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 125 [ఇప్పుడు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023 (BNSS) సెక్షన్ 528] కింద మధ్యంతర భరణాన్ని నిరాకరించిన కుటుంబ కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను జస్టిస్ చంద్ర ధరి సింగ్ తోసిపుచ్చారు.

చదవండి: సునీతా విలియమ్స్‌ మీద సింపతీలేదు : యూఎస్‌ ఖగోళ శాస్త్రవేత్త


 

మార్చి 19న జస్టిస్ చంద్ర ధరి సింగ్ మాట్లాడుతూ, CrPCలోని సెక్షన్ 125 (భార్యలు, పిల్లలు మరియు తల్లిదండ్రుల భరణం కోసం ఆర్డర్) జీవిత భాగస్వాముల మధ్య సమానత్వాన్ని కొనసాగించడానికి  భార్యలు, పిల్లలు ,తల్లిదండ్రులకు రక్షణ కల్పించడానికి  చట్టం ఉంది కానీ, ఈ పేరుతో వారు పనీ పాటా లేకుండా ఉండడాన్ని  కోర్టు ఆమోదించదన్నారు.  బాగా చదువుకున్న భార్య, చక్కటి ఉద్యోగంలో ఉన్న భర్త నుండి భరణం పొందడానికి మాత్రమే ఖాళీగా ఉండకూడదన్నారాయన. అంతేకాదు  తన చదువుకు తగిన ఉద్యోగాన్ని వెదుక్కోవాలని పిటిషనర్‌కు సూచించింది. ప్రాథమిక అవసరాలకోసం భర్తలపై ​​పూర్తిగా ఆధారడే, ఇతర చదువురాని మహిళల మాదిరిగా ఉండకూదని హితవు పలికింది.

కేసు నేపథ్యం
ఈ కేసులోని జంట 2019 డిసెంబర్ 11 వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ జంట త్వరలోనే విదేశాలకు మకాం మార్చారు. అయితే, వైవాహిక విభేదాలు కారణంగా  రెండేళ్లకు (ఫిబ్రవరి 20, 2021) ఇండియాకు తిరిగి వచ్చేసింది.భర్త తనను క్రూరంగా హింసించాడని, జీవిత భాగస్వామి వీసా చేశాడని ఆరోపించింది. ఇంటికి తిరిగి రావడానికి తన నగలను అమ్మమని బలవంతం చేశారని ఆమె ఆరోపించింది. తదనంతరం, ఆమె CrPC సెక్షన్ 125 కింద తాత్కాలిక ఉపశమనం కోసం దరఖాస్తుతో పాటు భరణం కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, కుటుంబ న్యాయస్థానం మధ్యంతర భరణం పిటిషన్‌ను  2022 నవంబరులో తిరస్కరించింది.దీనిపై దాఖలైన రివిజన్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. 

చదవండి: ఒక్క ఐడియా రూ. 8 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది!

పెళ్లికి ముందు కూడా తాను ఆర్థికంగా స్వతంత్రంగా లేనదిభార్య వాదన. భారతదేశానికి తిరిగి వచ్చినప్పటి నుండి నిరుద్యోగిగా ఉన్నాననీ, భర్త నెలకు  రూ. సుమారు 27.22 లక్షలు సంపాదిస్తున్నాడు కాబట్టి నెలకు రూ.3.25 లక్షలు  భరణం చెల్లించాలని డిమాండ్‌ చేసింది.   అయితే తన భార్య ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ వ్యాపారంలో మాస్టర్స్ పట్టా పొందింది. గతంలో టాప్‌ కంపెనీలో పనిచేసింది. సొంత కృత్రిమ ఆభరణాల వ్యాపారాన్ని నడిపింది. పైగా ప్రస్తుతం తాను ఉద్యోగం లేదు. కనుక అంత భరణం చెల్లించ లేనని భర్త వాదన
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement