capable
-
మోస్ట్ ఎవైటెడ్ బైక్ వచ్చేసింది, ధర ఎంతంటే..
సాక్షి, ముంబై: ప్రీమియం ద్విచక్ర వాహనాల సంస్థ కేటీఎం సోమవారం 2022 కేటీఎం ఆర్సీ 390 మోటర్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 3,13,922 (ఎక్స్ షోరూం ఢిల్లీ). వీటి తమ షోరూమ్‌లలో బుకింగ్స్ ప్రారంభించినట్లు సంస్థ వివరించింది. 2014 నుంచి ఆర్సీ 390 అత్యంత ప్రాచుర్యం పొందిన సూపర్ స్పోర్ట్స్ మోడల్స్‌లో ఒకటి. అవుట్గోయింగ్ మోడల్లో పోలిస్తే ఈ కొత్త-తరం ఆర్సీ 390 బైక్‌లో ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABS, సూపర్మోటో మోడ్‌తో కూడిన డ్యూయల్-ఛానల్ ABS ,పవర్-అసిస్టెడ్ యాంటీ-హాపింగ్ స్లిప్పర్ క్లచ్, టీఎఫ్టీ మల్టీకలర్ డిస్ప్లే సహా ఇతర ఎలక్ట్రానిక్ అప్గ్రేడ్లతో వస్తుంది. అలాగే క్విక్‌షిఫ్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. లేటెస్ట్ మోడల్లో అధునాతన 373 సీసీ ఇంజిన్, 13.7 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మొదలైన ఫీచర్లు ఉంటాయి. 4వాల్వ్, లిక్విడ్-కూల్డ్, DOHC ఇంజిన్‌తో వస్తుంది. ఇది 42.9బీహెచ్పీ గరిష్ట శక్తిని, 37ఎన్ఎం వద్దగరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను పొందుపర్చారు. రేసింగ్ బ్లూ , ఆరెంజ్ రెండు రంగుల్లో లభ్యం. -
ఎన్నికలు సమర్థంగా నిర్వహించాం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: సార్వత్రికం సహా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు ప్రతిష్టను పెంచినట్టు డీజీపీ ప్రసాదరావు చెప్పారు. ఇందుకు కిందిస్థాయి కానిస్టేబుల్ మొదలుకుని ఐపీఎస్ అధికారుల వరకు చేసిన సమష్టి కృషే కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీలో ఆదివారం జరిగిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో ప్రసాదరావు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీలు మొదలుకుని సీనియర్ ఐపీఎస్ వరకు వివిధ స్థాయిల అధికారులు పాల్గొన్నారు. డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరుసగా జరిగిన ఎన్నికలు, మధ్యలో ఇతర ఉద్యమాలు, పండుగలకు పోలీసులు అలుపెరగకుండా కష్టపడి బందోబస్తు నిర్వహించారని కొనియాడారు. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజనకు సంబంధించిన పనులతో పోలీసు అధికారులు విరామం లేకుండా పనిచేశారన్నారు. గెట్ టుగెదర్‌లో రాష్ట్ర ఆపరేషన్స్ విభాగం డీజీపీ జేవీ రాముడు, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ కౌముది, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఎం. మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా సీనియర్ ఐపీఎస్‌లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.