2022 KTM RC 390: launched India at above 3 lakhs Details Here - Sakshi
Sakshi News home page

2022 KTM RC 390:మోస్ట్‌ ఎవైటెడ్‌ బైక్‌ వచ్చేసింది, ధర తెలిస్తే

Published Tue, May 24 2022 10:52 AM | Last Updated on Tue, May 24 2022 12:15 PM

2022 KTM RC390 launched at above 3lakhs - Sakshi

సాక్షి, ముంబై: ప్రీమియం ద్విచక్ర వాహనాల సంస్థ కేటీఎం సోమవారం 2022 కేటీఎం ఆర్‌సీ 390 మోటర్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 3,13,922 (ఎక్స్‌ షోరూం ఢిల్లీ). వీటి తమ షోరూమ్‌లలో బుకింగ్స్‌ ప్రారంభించినట్లు సంస్థ వివరించింది. 2014 నుంచి ఆర్‌సీ 390 అత్యంత ప్రాచుర్యం పొందిన సూపర్‌ స్పోర్ట్స్‌ మోడల్స్‌లో ఒకటి.


 
అవుట్‌గోయింగ్ మోడల్‌లో  పోలిస్తే ఈ కొత్త-తరం ఆర్‌సీ 390  బైక్‌లో ట్రాక్షన్ కంట్రోల్,  కార్నరింగ్ ABS, సూపర్‌మోటో మోడ్‌తో కూడిన డ్యూయల్-ఛానల్ ABS ,పవర్-అసిస్టెడ్ యాంటీ-హాపింగ్ స్లిప్పర్ క్లచ్‌, టీఎఫ్‌టీ మల్టీకలర్ డిస్‌ప్లే సహా ఇతర ఎలక్ట్రానిక్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది.  అలాగే క్విక్‌షిఫ్టర్‌,  బ్లూటూత్ కనెక్టివిటీ  కూడా ఉంది.

లేటెస్ట్‌ మోడల్‌లో అధునాతన 373 సీసీ ఇంజిన్, 13.7 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్, ఎలక్ట్రానిక్‌ ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ మొదలైన ఫీచర్లు ఉంటాయి. 4వాల్వ్, లిక్విడ్-కూల్డ్, DOHC ఇంజిన్‌తో వస్తుంది. ఇది 42.9బీహెచ్‌పీ గరిష్ట శక్తిని,  37ఎన్‌ఎం వద్దగరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్ అండ్‌ అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను పొందుపర్చారు. రేసింగ్ బ్లూ , ఆరెంజ్ రెండు రంగుల్లో లభ్యం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement