KTM brand
-
మోస్ట్ ఎవైటెడ్ బైక్ వచ్చేసింది, ధర ఎంతంటే..
సాక్షి, ముంబై: ప్రీమియం ద్విచక్ర వాహనాల సంస్థ కేటీఎం సోమవారం 2022 కేటీఎం ఆర్సీ 390 మోటర్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 3,13,922 (ఎక్స్ షోరూం ఢిల్లీ). వీటి తమ షోరూమ్‌లలో బుకింగ్స్ ప్రారంభించినట్లు సంస్థ వివరించింది. 2014 నుంచి ఆర్సీ 390 అత్యంత ప్రాచుర్యం పొందిన సూపర్ స్పోర్ట్స్ మోడల్స్‌లో ఒకటి. అవుట్గోయింగ్ మోడల్లో పోలిస్తే ఈ కొత్త-తరం ఆర్సీ 390 బైక్‌లో ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABS, సూపర్మోటో మోడ్‌తో కూడిన డ్యూయల్-ఛానల్ ABS ,పవర్-అసిస్టెడ్ యాంటీ-హాపింగ్ స్లిప్పర్ క్లచ్, టీఎఫ్టీ మల్టీకలర్ డిస్ప్లే సహా ఇతర ఎలక్ట్రానిక్ అప్గ్రేడ్లతో వస్తుంది. అలాగే క్విక్‌షిఫ్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. లేటెస్ట్ మోడల్లో అధునాతన 373 సీసీ ఇంజిన్, 13.7 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మొదలైన ఫీచర్లు ఉంటాయి. 4వాల్వ్, లిక్విడ్-కూల్డ్, DOHC ఇంజిన్‌తో వస్తుంది. ఇది 42.9బీహెచ్పీ గరిష్ట శక్తిని, 37ఎన్ఎం వద్దగరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను పొందుపర్చారు. రేసింగ్ బ్లూ , ఆరెంజ్ రెండు రంగుల్లో లభ్యం. -
దేశీ రోడ్లపై కేటీఎం ప్రీమియం సైకిళ్లు!
ముంబై, సాక్షి: దేశీ మార్కెట్లో యూరోపియన్ తయారీ ప్రీమియం సైకిళ్లను ప్రవేశపెట్టనున్నట్లు స్టార్టప్ అల్ఫావెక్టర్ తాజాగా వెల్లడించింది. ఇందుకు వీలుగా యూరోపియన్ దిగ్గజం కేటీఎంతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. తద్వారా దేశీయంగా ఖరీదైన యూరోపియన్ సైకిళ్లను అందించనున్నట్లు తెలియజేసింది. ఒప్పందంలో భాగంగా వీటికి ప్రత్యేక పంపిణీదారుగా నిలవనున్నట్లు వివరించింది. కేటీఎం తయారీ ప్రీమియం సైకిళ్లు రూ. 30,000 ప్రారంభ ధర నుంచి లభించనున్నట్లు తెలియజేసింది. దేశీ మార్కెట్లో రూ. 10 లక్షల వరకూ గరిష్ట విలువగల పలు మోడళ్ల సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. చదవండి: (హెల్మెట్ వాయిస్ కమాండ్స్‌తో ఇక బైకులు!) మెరాకీసహా.. అల్ఫావెక్టర్ ఇటీవల మెరాకీ పేరుతో ఈబైసికిల్ను దేశీ మార్కెట్లో ఆవిష్కరించింది. కంపెనీ ఇప్పటికే చౌక- ప్రీమియం విభాగాల్లో మౌంటెయిన్, ఆల్‌టెరైన్, హైబ్రిడ్, ఫ్యాట్ టైర్ బైకులను ప్రవేశపెట్టింది. దేశీయంగా సైక్లింగ్‌కు ఆదరణ పెరుగుతున్నట్లు ఈ సందర్భంగా అల్ఫావెక్టర్ సీఈవో సచిన్ చోప్రా పేర్కొన్నారు. ప్రధానంగా ప్రీమియం విభాగంలో అధిక వృద్ధికి వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. మెట్రో నగరాలలో ప్రజలు సైక్లింగ్ తదితర ఆరోగ్యకర జీవన విధానాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. వెరసి ప్రీమియం సైక్లింగ్ విభాగంలో భారీ అవకాశాలున్నట్లు అంచనా వేశారు. భారత్ మార్కెట్లో కేటీఎం బైసికిల్స్ను ప్రవేశపెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. 2015లో.. డిమాండుకు అనుగుణంగా అత్యంత నాణ్యమైన, పటిష్ట పనితీరును చూపగల సైకిళ్లను అందించనున్నట్లు చోప్రా తెలియజేశారు. మిలీనియల్స్, జెన్-జెడ్ విభాగాలపై ప్రత్యేక దృష్టితో సైకిళ్లను అందించనున్నట్లు వివరించారు. ఐదు దశాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన కంపెనీగా గరిష్ట ప్రమాణాలతో సైకిళ్లను తయారు చేస్తున్నట్లు అల్ఫావెక్టర్తో ఒప్పందం సందర్భంగా కేటీఎం బైక్ ఇండస్ట్రీస్ ఎండీలు జోహనా ఉర్కాఫ్, స్టెఫాన్ లింబ్రన్నర్ పేర్కొన్నారు. తమ సైకిళ్లకు ప్రధానంగా మెట్రో నగరాల నుంచి అధిక డిమాండ్ కనిపించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. 2015లో ప్రారంభమైన అల్ఫావెక్టర్లో ఇప్పటికే ఫైర్‌సైడ్ వెంచర్స్, అవానా క్యాపిటల్, టైటన్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశాయి. -
బజాజ్ కేటీఎం 200డ్యూక్..సరికొత్తగా
ప్రముఖ ద్విచక్ర తయారీదారు బజాజ్ ఆటో బజాజ్ బైక్స్‌లో కొత్త వెర్షనను లాంచ్ చేసింది. బజాజ్ ఆటోలో 49శాతం వాటావున్న ఆస్ట్రియన్ బైక్ బ్రాండ్ కేటీఎంలో కొత్త బైక్‌ను విడుదల చేసింది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం (ఏబీఎస్) ఫీచర్‌తో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2019, ఏప్రిల్ 1 కొత్త ఏబీఎస్ చట్టానికి అనుగుణంగా ఈ మార్పులు చేపట్టింది. కెటిఎమ్ 200 డ్యూక్ పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త వెర్షన్ 125 సి.సి బైక్ ధర రూ. 1.60 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా ఉండనుంది. కొత్తగా జోడించిన ఏబీఎస్ ఫీచర్ మెరుగైన, నియంత్రిత శక్తిని కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అలాగే నాన్ఏబీఎస్ కేటీఎం200డ్యూక్ వేరియంట్ కూడా రూ.1.51 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర వద్ద అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా 450ప్రత్యేకమైన కేటీఎం దుకాణాల్లో ఈ రెండు వేరియంట్స్ కస్టమర్లకు అందుబాటులోఉన్నాయని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ అమిత్ నంది వెల్లడించారు. -
ఎనిమిదేళ్ల బంధానికి తెగదెంపులు
కవసాకి, బజాజ్ తమ ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్నాయి. సేల్స్, మార్కెటింగ్ పొత్తులో ఏడేళ్లుగా సేవలందిస్తున్న కవసాకి, బజాజ్ ల బంధాన్ని 2017 ఏప్రిల్ 1 నుంచి ఆపివేయాలని కీలకనిర్ణయం తీసుకున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. ఏప్రిల్ 1 అనంతరం నుంచి కవసాకి మోటార్ సైకిళ్లు విక్రయాలు, సేల్స్ సర్వీసు కూడా ఇండియా కవసాకి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచే అందిస్తారని తెలిసింది. కవసాకి హెవీ ఇండస్ట్రీస్ జపాన్‌కు ఇది సబ్సిడరీ. 2009లో విక్రయాలు, విక్రయనాంతరం సర్వీసుల కోసం బజాజ్ ఆటో, కవసాకిలు పొత్తు ఏర్పరుచుకున్నాయి. అప్పటి నుంచి పొత్తులో ఇవి సేవలందిస్తున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా బజాజ్, కవసాకిల సహకార బంధాన్ని అలానే కొనసాగిస్తామని కంపెనీలు చెప్పాయి. ఇండియన్ సిటీల్లో విస్తరిస్తున్న కవసాకి ప్రస్తుతం 12 షోరూంలని కలిగిఉంది. 14 కవసాకి ఉత్పత్తులను విక్రయిస్తోంది. పరస్పర అంగీకారంతోనే తాము ఈ నిర్ణయానికి వచ్చామని బజాజ్ ఆటో తెలిపింది. 2017 ఏప్రిల్ 1కి ముందు, తర్వాత కవసాకి మోటార్ సైకిళ్లను కొన్నవారు ఇక నుంచి సేల్స్ సర్వీసు కూడా కవసాకిలోనే అందించనున్నారు. అయితే కేటీఎం బ్రాండుపై బజాజ్ ఎక్కువగా ఫోకస్ చేస్తుందని తెలిసింది. కేటీఎం బ్రాండులో బజాజ్ కి 48 శాతం స్టాక్ ఉంది.