J.PURNACHANDRA RAO
-
'జై ఆర్టీసీ, జై కిసాన్'
-
'జై ఆర్టీసీ, జై కిసాన్'
విజయవాడ: ఆర్టీసీ, రైతుల పరిస్థితి ఒకేవిధంగా ఉందని ఆర్టీసీ ఎండీ డాక్టర్ జె. పూర్ణచంద్రరావు అన్నారు. జై ఆర్టీసీ, జై కిసాన్ అనాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రోజు రోజుకు ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాల్లో ఆర్టీసీని ఒడ్డున పడేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. డీజిల్ ధర పెరుగుతున్నా టిక్కెట్లు పెంచలేని పరిస్థితివుందన్నారు. సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఆయన సూచించారు. ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకపోతే వచ్చే నెల 11 నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) నిర్ణయించింది. ప్రభు త్వ లోపభూయిష్ట విధానాలే ఆర్టీసీ నష్టాలకు కారణమని, సంస్థను ఆదుకోవాలనే డిమాండ్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో సమ్మె చేస్తామని ఈయూ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
దిల్సుఖ్నగర్ డిపోను మూసేయం: ఆర్టీసీ ఎండీ
చైతన్యపురి, న్యూస్‌లైన్: ప్రయాణికులకు మెరుగైన సేవలందించి ఆక్యుపెన్సీ రేషియో ద్వారా సంస్థను లాభాల బాటలో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ఎండీ జె. పూర్ణచందర్రావు పేర్కొన్నారు. మంగళవారం దిల్సుఖ్నగర్ సిటీ డిపోను సంద ర్శించి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిపో సిబ్బంది బస్సుల నిర్వాహణ, జీత భత్యాలు, ఆదాయం తదితర అంశాలపై ఎండీ ఆరా తీశారు. దిల్సుఖ్నగర్ డిపో నష్టాల్లో నడుస్తున్నందున మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించినట్లు వార్తాలు రావడం, కార్మిక వర్గాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో స్వయాన సంస్థ ఎండీ పర్యటించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా టీఎన్‌ఎంయూ నాయకులు మల్లేష్, ఎస్‌కేజే పాషా, ఇతర కార్మిక సంఘాలు, డిపో సిబ్బంది ఎండీని ఘనంగా సత్కరించారు. అనంతరం ఎండి పూర్ణచందర్రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదాయం పెంచే మార్గాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామే తప్పా ఈ డిపోను మూసివేసే ఆలోచన లేదన్నారు. -
ఆర్టీసీలో తాత్కాలిక కొలువులు
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్ట్ పద్ధతిలో కండక్టర్ల, డ్రైవర్ల నియామకాలకు ఆర్టీసీ ముగింపు పలికి, దానికి బదులుగా టెంపరరీ(తాత్కాలిక) విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సంస్థ సిద్ధమవుతోంది. ఈమేరకు శుక్రవారం జరగనున్న పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఆలోచనను కార్మిక సంఘాలు స్వాగతించాయి. అయితే రెగ్యులర్ విధానంలో కాకుండా తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవడానికి అనుమతి ఇవ్వడం పట్ల కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. నియామకాలన్నీ రెగ్యులర్ పద్ధతిలోనే చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఐఆర్‌పై 17న ప్రకటన: ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర భృతి(ఐఆర్) ఇవ్వడానికి అభ్యంతరం లేదని, కానీ ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఈనెల 17న నిర్ణయం వెలువరిస్తామని ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాలకు తెలిపింది. సంస్థ ఎండీ జె.పూర్ణచంద్రరావు గురువారం ఈయూ, టీఎంయూ ప్రతినిధిబృందంతో చర్చలు జరిపారు. సంస్థ ప్రకటించే ఐఆర్ సంతృప్తికరంగా లేకుంటే.. అదే రోజు సమ్మె తేదీని ప్రకటిస్తామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.