చైతన్యపురి, న్యూస్‌లైన్: ప్రయాణికులకు మెరుగైన సేవలందించి ఆక్యుపెన్సీ రేషియో ద్వారా సంస్థను లాభాల బాటలో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ఎండీ జె. పూర్ణచందర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం దిల్‌సుఖ్‌నగర్ సిటీ డిపోను సంద ర్శించి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
డిపో సిబ్బంది బస్సుల నిర్వాహణ, జీత భత్యాలు, ఆదాయం తదితర అంశాలపై ఎండీ ఆరా తీశారు. దిల్‌సుఖ్‌నగర్ డిపో నష్టాల్లో నడుస్తున్నందున మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించినట్లు వార్తాలు రావడం, కార్మిక వర్గాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో స్వయాన సంస్థ ఎండీ పర్యటించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా టీఎన్‌ఎంయూ నాయకులు మల్లేష్, ఎస్‌కేజే పాషా, ఇతర కార్మిక సంఘాలు, డిపో సిబ్బంది ఎండీని ఘనంగా సత్కరించారు. అనంతరం ఎండి పూర్ణచందర్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదాయం పెంచే మార్గాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామే తప్పా ఈ డిపోను మూసివేసే ఆలోచన లేదన్నారు.
దిల్‌సుఖ్‌నగర్ డిపోను మూసేయం: ఆర్టీసీ ఎండీ
Published Wed, Mar 19 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM
Advertisement
Advertisement