HYD: భారత్‌ విక్టరీపై ఫ్యాన్స్‌ సంబురాలు.. పోలీసుల లాఠీచార్జ్‌ | Telangana Police Lathi Charge On Indian fans Celebrations AT Dilsukhnagar | Sakshi
Sakshi News home page

HYD: భారత్‌ విక్టరీపై ఫ్యాన్స్‌ సంబురాలు.. పోలీసుల లాఠీచార్జ్‌

Published Mon, Mar 10 2025 7:41 AM | Last Updated on Mon, Mar 10 2025 7:41 AM

Telangana Police Lathi Charge On Indian fans Celebrations AT Dilsukhnagar

సాక్షి, హైదరాబాద్‌: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్‌ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో భారత్‌ జట్టు విజయాన్ని అందుకుంది. టీమిండియా విజయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానాలు సంబురాలు జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్‌ సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చిన అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు.

వివరాల ప్రకారం.. భారత జట్టు విజయం అనంతరం హైదరాబాద్‌లో అభిమానులు బాణాసంచా పేల్చి డ్యాన్స్‌లు చేస్తూ రోడ్లకు మీదకు వచ్చారు. ఈ క్రమంలో దిల్‌సుఖ్‌నగర్‌లో ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు బయటకు రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అభిమానులు గట్టిగా కేకలు వేస్తూ డ్యాన్స్‌ చేశారు. దీంతో, పోలీసులు రోడ్ల మీదకు వచ్చిన వారిపై లాఠీచార్జ్‌ చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

 Video Credit: TeluguScribe

టీమిండియా విజయం సందర్బంగా ట్యాంక్‌ బండ్‌ మీదకు భారీగా అభిమానులు చేరుకుని సంబురాలు జరుపుకున్నారు. ఐటీ కారిడార్‌, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. విజయంపై తమ అభిమానం చాటుకున్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement