సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సహకార పరిపతి సంఘం (సీసీఎస్)లో అలజడి నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సొసైటీ కార్యదర్శిని వెంటనే తొలగిం చాలని కొందరు కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే హైకోర్టు తలుపు తట్టిన ఆ కార్మిక వర్గం.. ఇటీవల సహకార శాఖ విచారణ జరిపి చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. పదవీ విరమణ పొందినా నిబంధనలకు విరుద్ధంగా కార్యదర్శిగా నాగరాజు కొనసాగు తున్నారని, ఆంధ్రా ప్రాంతంలో ఆరు నుంచి పదో తరగతి వరకు చదివినందున తెలంగాణలో కొనసాగే అవకాశం లేనప్పటికీ కొనసాగు తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.
స్థాయికి మించి అక్రమంగా అధిక వేతనం పొందుతున్నందున ఇప్పటివరకు పొందిన మొత్తాన్ని తిరిగి సంఘానికి చెల్లించాలని విచారణాధికారులు తేల్చారని పేర్కొంటున్నారు. ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఆయనను తొలగించాలని సహకార శాఖ సిఫార్సు చేసిందని ఆర్టీసీ బహుజన కార్మిక సంఘం అధ్యక్షుడు ప్రేమ్‌నాథ్ సహా పలువురు కార్మికులు చెబుతన్నారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో సహకార పరపతి సంఘం మంగళవారం అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసింది. అయితే కార్యదర్శిని కాపాడుకునేందుకు కొందరు కుట్రపన్నారని, సమావేశంలో ఆయనకు అనుకూల తీర్మానం చేయబోతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మరోవైపు సహకార శాఖ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీసీఎస్ చైర్మన్, ఆర్టీసీ ఎండీ రమణరావు పేర్కొన్నారు.
నిరాధార ఆరోపణలు: కార్యదర్శి నాగరాజు
కార్మిక సంఘాల మధ్య ఉన్న విభేదాల వల్లే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని సీసీఎస్ కార్యదర్శి నాగరాజు అన్నారు. సహకార శాఖ విచారణ జరిపి తనకు క్లీన్‌చీట్ ఇచ్చిందని, బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకునేందుకు నిబంధనలకు విరుద్ధంగా తాను రుణం పొందినట్లు తేలలేదన్నారు.
ఆర్టీసీ సీసీఎస్ కార్యదర్శిని తొలగించండి
Published Mon, Jun 5 2017 1:52 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM
Advertisement
Advertisement