ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చేసిన ఏర్పాట్లను అడ్డుకోవడానికి ఆర్టీసీ కార్మిక సంఘాలు యత్నిస్తున్నాయి.
కరీనంగర్: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చేసిన ఏర్పాట్లను అడ్డుకోవడానికి ఆర్టీసీ కార్మిక సంఘాలు యత్నిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని ఆర్టీసీ డిపోలో కార్మికుల సమ్మెతో నిలిచిపోయిన బస్సులను ప్రైవేటు వ్యక్తులతో నడపడానికి అధికారులు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దీంతో ఆగ్రహించిన ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట ధర్నా నిర్వహించారు.
ప్రైవేటు డ్రైవర్లు నడుపుతున్న వాహనాలను అడ్డుకునే యత్నం చేశారు. డిపో నుంచి బస్సును బయటకు తీస్తున్న ప్రైవేటు డ్రైవర్‌పై దాడికి దిగి అతన్ని గాయపర్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.