
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. గురువారంతో 41వ రోజుకు చేరింది. జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో జేఏసీ పిలుపు మేరకు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. హుస్నాబాద్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపి, వారికి మద్దతుగా భిక్షాటన చేశారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మతిస్థిమితం కోల్పోయి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కండక్టర్ నాగేశ్వర్(43) బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన నాగేశ్వర్ నారాయణఖేడ్ డిపోలో విధులు నిర్వర్తించేవాడు. ఆయన మృతితో జోగిపేటలో ఉద్రిక్తత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment