బాబు హామీ ఇచ్చారా?: మంత్రి శిద్ధా | Babu guaranteed ? Minister siddha ? | Sakshi
Sakshi News home page

బాబు హామీ ఇచ్చారా?: మంత్రి శిద్ధా

Published Sat, May 9 2015 1:51 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

బాబు హామీ ఇచ్చారా?: మంత్రి శిద్ధా - Sakshi

బాబు హామీ ఇచ్చారా?: మంత్రి శిద్ధా

‘ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలిస్తామని. సంస్థని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీ వేస్తామని.. ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారా? ఆ విషయం నాకు తెలీదు’ అని ఏపీ రవాణా శాఖా మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ఆర్టీసీ ఎండీ సాంబశివరావుతో కలసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

శుక్రవారం మధ్యాహ్నం నాటికి 50 శాతం బస్సుల్ని(4,934) తిప్పామన్నారు. సమ్మెపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. మొండివైఖరి వీడి వారంతట వారే చర్చలకు రావాలన్నారు. చిత్తూరులో లాఠీఛార్జీపై బాధపడుతున్నామని, బస్సులను అడ్డుకుంటే కఠినంగానే వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రైవేటు వాహనాల నియంత్రణ అంశాన్ని దాటవేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement