Minister sidda Raghava Rao
-
మంత్రికి తెలీకుండానే పోస్టింగ్
► కేడర్ పోస్టులో నాన్ కేడర్ అధికారి నియామకం ► అటవీ శాఖలో ఉన్నతాధికారుల విస్మయం సాక్షి, అమరావతి: బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన నిబంధనలను అటవీశాఖ గాలికొదిలేసింది. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, ముఖ్య కార్యదర్శి అనంతరాములకు తెలియకుండా కీలకమైన బదిలీలు జరిగిపోతున్నాయి. మంత్రికి, సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి ఫైలు పంపకుండా రాష్ట్ర అటవీ దళాల అధిపతి పీకే సారంగి బైపాస్ చేసి నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కు పంపించి డీఎఫ్ఓలను బదిలీ చేస్తున్న తీరుపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ఓ) షేక్ సలాంను నియమిస్తూ ఈనెల 18న జారీ చేసిన జీవో 161 ఇందుకు నిదర్శనం. ఇదీ విధానం: అటవీ శాఖ డీఎఫ్ఓల బదిలీలు, నియామకాలకు సంబంధించిన ప్రతిపాదన ఫైలు ఆమోదానికి ముందుగా రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యదర్శికి రాష్ట్ర అటవీ దళాల అధిపతి పంపాలి. అనంతరం ముఖ్య కార్యదర్శి ఈ ఫైలును సంబంధిత మంత్రికి పంపుతారు. మంత్రి అనుమతితో సీఎస్‌కు పంపించి ఉత్తర్వులు జారీచేస్తారు. కానీ, రాష్ట్ర అటవీ అధికారుల నియామకాలకు సంబంధించిన ఫైళ్లను సీఎస్‌కు పంపాల్సిన అవసరంలేదు. మంత్రి అనుమతి తీసుకుని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి నేరుగా బదిలీ ఉత్తర్వులు జారీ చేయవచ్చు. అలాగే, కేడర్ పోస్టుల్లో అఖిల భారత అటవీ అధికారులనే నియమించాలనే నిబంధన ఉంది. ఇందుకు భిన్నంగా.. రాష్ట్ర రోడ్డు రహదారుల అభివృద్ధి సంస్థలో పర్యావరణ అధికారిగా పనిచేస్తున్న షేక్ సలాం అటవీశాఖలో తనకు పోస్టింగ్ ఇవ్వాలని అటవీ దళాల అధిపతికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆ ఫైలును అటవీ దళాల అధిపతి బైపాస్ చేసి మంత్రికి, ఆ శాఖ కార్యదర్శికి పంపకుండా సీఎస్‌కు పంపి బదిలీ ఉత్తర్వులిచ్చారు. -
శ్రీశైలం మల్లన్నకు చీరాల తలపాగా సిద్ధం
చీరాల: శ్రీశైలం మల్లన్న పెళ్లికి తలపాగ సిద్ధమైంది. మహాశివరాత్రి రోజున ఈ తలపాగా చుట్టిన తర్వాతే మల్లికార్జున స్వామికి భ్రమరాంబతో పెళ్లి తంతు మొదలవుతుంది. పరమశివుణ్ని పెళ్లి కుమారుడిగా అలంకరించే వస్త్రాన్ని ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవాంగపురి హస్తినాపురంలోని ఓ చేనేత కుటుంబం నేస్తుంది. ఇక్కడి పృథ్వీ వంశస్థులు వందేళ్లకు ముందు నుంచి ఈ ఆచారం కొనసాగిస్తున్నారు. ఏటా మహా శివరాత్రిన జరిగే శ్రీశైలం మల్లన్న కల్యాణోత్సవంలో శివుణ్ని వరుడిగా అలంకరణ చేస్తారు. 150 గజాలు ఉండే ఈ వస్త్రాన్ని ఆలయ శిఖరం నుంచి నవనందులను కలుపుతూ చుడతారు. కల్యాణం అనంతరం ఈ వస్త్రాన్ని వేలంలో దక్కిం చుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు సైతం పోటీపడతారు. ఈ తలపాగాతో మం గళవారం ఉదయం పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం ఊరేగింపుగా శ్రీశైలం బయల్దేరింది. తాను నేసిన బట్టతో పరమశివుణ్ని వరుడిగా అలంకరించడం తన అదృష్టమని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కాగా, మహా శివ రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కల్యాణోత్సవానికి ఏపీ ప్రభుత్వం తరపున ఆర్అండ్ బి, రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు దంపతు లు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. -
నగదు కష్టాలపై ప్రత్యామ్నాయ చర్యలు
ఇన్చార్జి మంత్రి శిద్ధా రాఘవరావు నెల్లూరు (వేదాయపాళెం) : జిల్లాలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద నెలకొన్న నగదు కష్టాల నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి శిద్ధా రాఘవరావు బ్యాంకర్లను ఆదేశించారు. నగరంలోని గోల్డెన్ జూబ్లీహాల్లో బుధవారం బ్యాంకర్లతో పాటు పలుశాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద సామాన్య ప్రజలు పడే ఇబ్బందులను గమనించామన్నారు. దీనిపై ఏం చర్యలు చేపట్టారని లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట్రావును మంత్రి ప్రశ్నించారు. లీడ్ బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకు జిల్లాలో రూ.2,380 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయిందన్నారు. అయితే రిజర్వు బ్యాంకు నుంచి కొత్త నోట్లు రూ.930 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. వీటిని అన్ని బ్యాంకులకు పంపామన్నారు. నగదు రహిత ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కలెక్టర్ ఆదేశాల ప్రకారం తగిన ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయశాఖ తీరు పట్ల మంత్రి శిద్ధా రాఘవరావు చర్చించారు. రైతులకు రుణాలను రీ షెడ్యూల్ చేయటంతో పాటు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఆన్లైన్ విధానం ద్వారా రైతులకు అందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువుల డీలర్ల వద్ద స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తామని వ్యవసాయశాఖ జేడీ హేమామహేశ్వరరావు సమాధానమిచ్చారు. తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సంబంధితశాఖ అధికారులకు సూచించారు. కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ సామాజిక పింఛన్‌దారులకు నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. చౌకదుకాణాలు, ఎరువుల దుకాణాల్లో ప్రజలు, రైతులకు ఇబ్బంది కలుగకుండా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు గ్రామాల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. వ్యవసాయశాఖకు సంబంధిత అధికారులతో ప్రతి రోజూ ఆయా మండలాల వారీగా సమీక్షిస్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, జేసీ–2 సాల్మన్ రాజ్‌కుమార్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ మంత్రి పరసా రత్నం, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చిరుధాన్యాలతో రోగాలు దూరం
- మంత్రి శిద్దా రాఘవరావు ఒంగోలు టౌన్ : చిరుధాన్యాలతో రోగాలు దూరమవుతాయని రాష్ట్ర రవాణశాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ప్రతి ఒక్కరూ తాము తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. పౌష్టికాహార వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం స్థానిక మహిళా శిశు సంక్షేమశాఖ కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాత రోజుల్లో ఆస్పత్రులు ఎక్కువగా ఉండేవి కావని, ఆనాటి ప్రజలు చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేవారని గుర్తు చేశారు. ప్రస్తుత తరంలో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోవడంతో రోగాల బారిన పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. వయసుతో సంబంధం లేకుండా బీపీ, షుగర్, ఒబెసిటీ (అధిక బరువు), మోకాళ్ల నొప్పులతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందన్నారు. ప్రొటీన్లు, కాల్షీయం, ఇనుము, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న చిరుధాన్యాల వాడకంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగేలా చూడలని కోరారు. పౌష్టికాహార వారోత్సవాలను వారం రోజులకు పరిమితం చేయకుండా నిరంతరం కొనసాగించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కలిగించాలని సూచించారు. చిరు ధాన్యాల వాడకం గురించి గ్రామ స్థాయి నుంచి క్లస్టర్ స్థాయి వరకు ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. ప్రజల్లో అవగాహన వస్తే వారి ఆహారపు అలవాట్లలో దానంతట మార్పు అదే వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండటంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలని మంత్రి సూచించారు. విలన్లా కనిపిస్తున్న రైస్ : కలెక్టర్ రైస్ విలన్లా కనిపిస్తోందని కలెక్టర్ సుజాతశర్మ వ్యాఖ్యానించారు. రైస్‌ను పాలిష్ చేసిన తర్వాత ఆహారంగా తీసుకోవడం వల్ల మినరల్స్, విటమిన్స్ పోతున్నాయన్నారు. కార్బోహైడ్రేట్ మాత్రమే మిగులుతోందన్నారు. ఫలితంగా బీపీ, షుగర్, వంటి రోగాలు వస్తున్నాయన్నారు. ఫ్యాట్ ఉండే ఫుడ్ ఎక్కువ ఖర్చు అయినా మంచి ఫుడ్‌గా భావించి ఎక్కువ మంది తింటూ రోగాల బారిన పడుతున్నారన్నారు. సమతుల ఆహారమే మంచి పౌష్టికాహారమని, తక్కువ ఖర్చుతో దాన్ని పొందొచ్చన్నారు. బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా మహిళల చేతుల్లోనే ఉందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు పేర్కొన్నారు. ఆరోగ్యం కాపాడుకోవడంలో మహిళల పాత్ర చాలా కీలకమన్నారు. ప్రతి ఇంటిలో వండిపెట్టేవారు మహిళలే అయినందున వారికి ఆరోగ్య సూత్రాలపై అవగాహన కలిగిస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నూకసాని బాలాజీ, మహిళా కమిషన్ సభ్యురాలు టి.రమాదేవి, మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ టీవీ శ్రీనివాస్, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జి.విశాలాక్షి పాల్గొన్నారు. ఆహా ఏమి రుచి! పౌష్టికాహార వారోత్సవాల ముగింపు సందర్భంగా ఒంగోలు అర్బన్, ఒంగోలు రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంటకాల ప్రదర్శనను మంత్రి శిద్దా రాఘవరావు, కలెక్టర్ సుజాతశర్మ సందర్శించారు. చిరుధాన్యాలతో అం గన్వాడీలు తయారు చేసిన రకరకాల వంటకాలు అదిరిపోయాయి. చిరుధాన్యాలతో తయారు చేసిన కేక్‌ను కలెక్టర్ సుజాతశర్మ కట్ చేశారు. కేక్‌ను పక్కనే ఉన్న మంత్రి శిద్దా రాఘవరావుకు అందించారు. ఆ కేక్‌ను రుచి చూసిన కలెక్టర్ ‘ఆహా ఏమి రుచి’ అంటూ దాన్ని తయారు చేసిన అంగన్వాడీ కార్యకర్త జయశ్రీని అభినందించారు. -
ఆరు నెలల్లో అన్ని బస్సులకు జీపీఎస్
విజయవాడ : ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన అన్ని బస్సులకు జీపీఎస్‌ను అమర్చుతామని రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక కంపార్ట్మెంట్లను విజయవాడ సిటీ టెర్మినల్‌లో శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 వేల ఆర్టీసీ బస్సుల్లోను ఆరు నెలల్లో జీపీఎస్ సిస్టమ్ అమలులోకి తెస్తామన్నారు. పాత బస్సులను సరుకు (గూడ్స్) రవాణాకు ఉపయోగించి ఆర్టీసీకి కమర్షియల్ ఆదాయాన్ని పెంచుతామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని సిటీ పరిధిలో తిరిగే ప్రతీ బస్సులోను ప్రత్యేక కంపార్టుమెంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విజయవాడ నగరంలో 350, విశాఖలో 350 సిటీ బస్సులు తిరుగుతున్నాయని, ఆ బస్సుల్లోను వారం రోజుల్లో మహిళలకు ప్రత్యేక కంపార్టుమెంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేటు బస్సుల కంటే ఆర్టీసీ బస్సులను మరింత సౌకర్యవంతంగాను, సురక్షితంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ప్రతీ బస్సు స్టేషన్‌ను ఎయిర్‌పోర్టు తరహాలో తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో అన్ని బస్స్టేషన్లను తీర్చిదిద్దుతున్నామని, రెండవ దశలో 1200 మండల కేంద్రాల్లో బస్స్టాండ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతీ బస్ డిపో, ఆర్టీసీ గ్యారేజీల్లో ఇంకుడు గుంతలు తవ్వాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. విలేకరుల సమావేశంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) జి.జయరావు, విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎన్.వెంకటేశ్వరరావు, కృష్ణా రీజినల్ మేనేజర్ పీవీ రామారావు, అధికారులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. -
‘శిద్ధా’ ప్రకటనలు శుద్ధ దండగ
‘‘ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ప్రైవేటు ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తప్పవు. ఆర్టీసీలో వసూలు చేస్తున్న ఛార్జీలనే ప్రైవేటు ఆపరేటర్లు వసూలు చేయాలని చెప్పాం. ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీపై రవాణా శాఖ అధికారులతో ఆకస్మిక దాడులు జరిపించి బస్సు పర్మిట్లు రద్దు చేస్తాం.’’ - మూడు రోజుల క్రితం రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పిన మాటలివి. గతేడాది పండగ సీజన్లలోనూ ప్రైవేటు దోపిడీపై మంత్రి ఈ తరహా ప్రకటనలు చేసినా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు బేఖాతరు చేశారు. ఈ ఏడాదీ అంతే. దీంతో మంత్రి శిద్ధా రాఘవరావు ప్రకటనలన్నీ శుద్ధ దండగని తేలిపోయింది. * యథేచ్ఛగా దోచుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు * నిర్భయంగా ఆన్లైన్లో అధిక ధరలతో టిక్కెట్లు * ఒక్కరిపైనా దాడులు చేయని రవాణాశాఖ * ఇరువురు ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు * మంత్రి ఆదేశాలు బేఖాతరు.. సంక్రాంతి ప్రయాణం భారం సాక్షి, హైదరాబాద్: ఏపీ నుంచి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేందుకు హైదరాబాద్ వచ్చిన మధ్యతరగతి వర్గాలు దాచుకున్న డబ్బంతా కరిగించేసింది ఈ సంక్రాంతి ప్రయాణం. హైదరాబాద్ నుంచి ఏపీలోని ఏ ప్రాంతానికి వెళదామన్నా రూ.వేలల్లోనే ఛార్జీలు ఉండటం.. ప్రభుత్వం తమ ప్రయాణానికి తగ్గట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఇక్కట్లు తప్పలేదు. సొంతూరులో పండగ చేసుకునే సెంటిమెంట్‌కు ప్రైవేటు ట్రావెల్స్ సొమ్ము చేసుకున్నాయి. ఈ నెల 18 వరకు ప్రైవేటు ఆపరేటర్ల దూకుడు తగ్గేట్లుగా లేదు. ప్రయాణికుల అవసరాలను గరిష్టంగా దోపిడీ చేస్తూ ప్రైవేటు ఆపరేటర్లు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఆన్లైన్లో టిక్కెట్లు ధరలు పెట్టి మరీ బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సుల్ని తిప్పుతున్నా చోద్యం చూస్తున్న ప్రభుత్వం ఈ దోపిడీకి వత్తాసు పలుకుతోంది. రూ.వేలు పెట్టి టిక్కెట్లు కొని సొంత ఊళ్లకు చేరినవారు తిరిగి ఎలా చేరుకోవాలోనని మథనపడుతున్నారు. కడప, కర్నూలు, విశాఖలకు రూ.2 నుంచి రూ.3 వేల వరకు టిక్కెట్లు రేట్లు పెట్టి ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల జేబులు కొల్లగొట్టారు. మళ్లీ తిరుగు ప్రయాణంలోనూ ప్రైవేటు ఆపరేటర్లు ఇదే తరహా బాదుడుకి సిద్ధం కావడం గమనార్హం. ప్రైవేటు ఆపరేటర్లు అధిక శాతం అధికారపార్టీకి చెందినవారే కావడంతో ప్రభుత్వం కూడా యధోచితంగా సహకరిస్తోంది. రవాణా శాఖ ఈ పది రోజుల్లో రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్‌పై ఒక్క కేసైనా నమోదు కూడా చేయలేదంటే ఆపరేటర్లకు ఎంతటి సహకారం ఉందో తెలుసుకోవచ్చు. ముందస్తు ఏర్పాట్లలో ప్రభుత్వ వైఫల్యం ఏపీ ప్రభుత్వం సంక్రాంతి ప్రయాణానికి ముందస్తు ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం చెందింది. ఆర్టీసీ ఈ సీజన్లో 2,700 బస్సుల్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఆ మేరకు నడపడంలో విఫలమైంది. ఆన్లైన్ రిజర్వేషన్లో సాంకేతిక లోపాలు తలెత్తి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోలేదు. సిటీ బస్సుల్ని ప్రత్యేక బస్సులుగా నడపడం, అందులోనూ ప్రత్యేకమైన బోర్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం రైల్వేతో సంప్రదించి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కోరలేదు. రైల్వే కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికుల వెతలు అన్నీ ఇన్నీ కావు. సరిపడా బోగీలు లేక కాలుమోపే పరిస్థితి కానరాక ఊళ్లకు చేరడానికి నానా తంటాలు పడ్డారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జంటనగరాల్లో తిరిగే సిటీ బస్సులను కూడా సంక్రాంతి పండుగ కోసం ఆంధ్రా ప్రాంతానికి నడిపేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి ఆంధ్రా ప్రాంతానికి అదనపు బస్సులు నడపాల్సిందిగా తెలంగాణ సర్కారును కనీసం కోరలేదు. ఇద్దరు ఉన్నతాధికారులకు భారీ ముడుపులు అడ్డగోలుగా ప్రైవేటు ఆపరేటర్లు బస్సులు తిప్పుతున్నా.. అందిన కాడికి దోచుకుంటున్నా.. రవాణా శాఖ చేష్టలుడిగి చూడటం వెనుక రూ.కోట్లు చేతులు మారిన ట్లు ఆరోపణలున్నాయి. రవాణా శాఖలో ఇరువురు ఉన్నతాధికారులకు ప్రైవేటు ఆపరేటర్లు భారీగా ముట్టజెప్పడంతోనే ప్రైవేటు బస్సుల జోలికెళ్లవద్దని రవాణా వర్గాలకు అంతర్గత ఆదేశాలు జారీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు షిర్డీలో ఘోర ప్రమాదానికి గురై పదుల సంఖ్యలో మరణించినప్పుడు రవాణా శాఖ ప్రైవేటు ట్రావెల్స్‌పై వరుస దాడులు నిర్వహించి కట్టడి చేసింది. అప్పట్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రోడ్డెక్కాలంటే భయపడే పరిస్థితి నెల కొంది. ఇప్పుడు మాత్రం రవాణా అధికారులు తామేం చేయలేమని చెప్పడం పరిశీలనాంశం. ఇటీవలే మంత్రి శిద్ధా రాఘవరావు రవాణా శాఖ అధికారులతో సమావేశమై కఠిన చర్యలు చేపట్టాలని సూచించినా ట్రావెల్స్ దోపిడీకి అడ్డుకట్ట పడలేదు. భారీగా పెంచిన టిక్కెట్ల ధరలను నిర్భయంగా ఆన్లైన్లో ఉంచారు. అయితే వెయిటింగ్ లిస్ట్ అని పేర్కొని ఆన్లైన్లో ఉంచిన రేట్ల కంటే రెట్టింపు ఛార్జీలు వసూలు చేయడం గమనార్హం. -
అభివృద్ధి దిశగా అడుగులు
మంత్రి శిద్దా రాఘవరావు తాళ్లూరు : ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నట్లుమంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. తాళ్లూరు మండలంలో శుక్రవారం పలు ప్రారంభోత్సవాల్లో కలెక్టర్ సుజాత శర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో కందుకూరు సబ్ కలెక్టర్ మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో ఇప్పటికే రూ.100 కోట్లతో రోడ్లు వేశామని, మరో రూ.70 కోట్లతో ప్రతిపాదనలు పంపామని చెప్పారు. కలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ రైతులు ‘మీ ఇంటికి మీ భూమి’ కార్యక్రమాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని కోరారు. డీఆర్డీఏ పీడీ మురళి మాట్లాడుతూ మహిళలు పొదుపు సంఘ నిధిని ఉపయోగించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. ఎంపీపీ గోళ్లపాటి మోషే, జెడ్పీటీసీ సభ్యుడు మారం వెంకటరెడ్డి, తాళ్లూరు సర్పంచి ఐ. పెద్దిరెడ్డిలు మండల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పొదుపు సంఘాలకు రూ.2.15 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేష్‌బాబు, తహశీల్దార్ సరోజిని, వైస్ ఎంపీపీ రమావెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
ముప్పేట దాడి
శుక్రవారం జరిగిన జెడ్పీ సమావేశం గరంగరంగా సాగింది. గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుధ్య విభాగం (ఆర్‌డబ్ల్యుఎస్ ) అధికారుల తీరుపై ముప్పేట దాడి జరిగింది. ప్రొటోకాల్ వివాదం వేడెక్కించింది. నలుగురు ఎంపీడీవోలపై విచారణకు కలెక్టర్ ఆదేశించారు. నిధులు పుష్కలంగా ఉన్నా పనులు చేయకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారంటూ మంత్రి శిద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు: గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుధ్య విభాగం( ఆర్‌డబ్ల్యుయస్ ) అధికారుల తీరుపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముప్పేట దాడి జరిగింది. స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిధులు పుష్కలంగా ఉన్నా పనులు చేయకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారంటూ అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. వ్యవసాయశాఖ కార్యక్రమాలు చేపడుతున్నా వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో అధికారులు విఫలమవుతున్నారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు డోలాశ్రీ బాలావీరాంజనేయస్వామి, లంకా సాంబశివరావులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 2010 నుంచి ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్ట పరిహారం రూ.35 కోట్లు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదో సమాధానం చెప్పాలంటూ వ్యవసాయశాఖ జేడీఏ మురళీకృష్ణను గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుమల అశోక్‌రెడ్డి నిలదీశారు. కందుకూరు జెడ్పీటీసీ కంచర్ల శ్రీకాంత్ చౌదరి మాట్లాడుతూ దళారుల దెబ్బకు లారీ వరి గడ్డిని రూ.25 నుంచి రూ.30 వేలు చెల్లించాల్సి వస్తుందన్నారు. పశుసంవర్థకశాఖ చొరవ తీసుకొని గడ్డిని రవాణా చేయించగలిగితే పశుపోషకులకు ఉపయోగంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. పొదిలి ప్రాంతంలో పశువులను బలవంతంగా సంతలకు తరలిస్తున్నారంటూ పొదిలి ఎంపీపీ నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఒక తీర్మానం చేసి కేంద్ర వాణిజ్యశాఖా మంత్రి దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని, దానిపై తీర్మానం చేయాలంటూ కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు సభ దృష్టికి తీసుకువెళ్లగా జెడ్పీ చైర్మన్‌తోపాటు సభ్యులు అంగీకరించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి డబ్బులు పుష్కలంగా ఉన్నా సమస్య ఏమిటో చెప్పాలంటూ మంత్రి శిద్దా రాఘవరావు ఆర్డబ్ల్య్యుస్ అధికారులను నిలదీశారు. పథకాలు బాగుపడేందుకు ఏ మేరకు నిధులు అవసరమవుతాయో చెప్పండి...నిధులు నేను తెప్పిస్తా అంతే గాని మీ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తే మాత్రం సహించేదిలేదంటూ మండిపడ్డారు. ప్రతిపాదనలు తయారుచేసి పంపామని, జెడ్పీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ఆర్‌డబ్ల్యుయస్ అధికారులు చెప్పడంతో జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ జోక్యం చేసుకొని నిధులన్నీ ఒకే పథకానికి ఖర్చుచేస్తే మిగితా అభివృద్ధి పనులు కుంటుపడతాయని, దాంతోపాటు బోర్లు వేస్తే తప్పనిసరిగా నీరు పడుతుందో లేదో అనే అనుమానంతో ఆపినట్లు ప్రకటించారు. నలుగురు ఎంపీడీవోలపై విచారణ ఉలవపాడు, త్రిపురాంతకం, తర్లుబాడు, కొనకనమిట్ల ఎంపీడీవోలు అవినీతికి పాల్పడుతున్నారని చర్యలు చేపట్టాలంటూ జడ్పీటీసీ, ఎంపీపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు ఇవ్వాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, పాసుపుస్తకానికి వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారు, చివరకు జెడ్పీటీసీ సభ్యులకు ఇవ్వాల్సిన గౌరవ వేతనానికి, ట్రావెల్ అలవెన్స్‌లకు వాటా అడుగుతున్నారంటూ ధజమెత్తారు. దీంతో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ఆర్డీవో స్థాయి అధికారితో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. మంత్రి శిద్దా జోక్యం చేసుకొని తక్షణమే ఉలవపాడు ఎంపీడీవోను సస్పెండ్ చేయాలంటూ కలెక్టర్‌ను ఆదేశించారు. ఆర్డీవో స్థాయి అధికారితో విచారణకు కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ శ్రీరాం మాల్యాద్రి, ఎమ్మెల్సీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, విఠపు బాలసుబ్రహ్మణ్యం, యండపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి, ముత్తుమల అశోక్‌రెడ్డి, పోతులరామారావు, డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి, లంకా సాంబశివరావు, కదిరి బాబూరావులు హాజరుకాగా వేదికపై చైర్మన్ నూకసాని బాలాజీ, జిల్లా కలెక్టర్ సుజాతాశర్మ, జేసీ హరిజవహర్‌లాల్, సీఈవో ఎ.ప్రసాద్, డిప్యూటీ సీఈవో నరసింహారావు, ఏవో ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాగుంటకు సన్మానం ఒంగోలు: స్థానిక సంస్థల ప్రతినిధిగా ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించిన మాగుంట శ్రీనివాసులరెడ్డిని శుక్రవారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ, కంచర్ల శ్రీకాంత్‌చౌదరి, జెడ్పీ సీఈవో ప్రసాద్ తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రతినిధిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. -
నేడు టీడీపీ మినీ మహానాడు
♦ ముఖ్య అతిథులుగా మంత్రులు శిద్దా, నారాయణ ♦ అనిల్‌గార్డెన్స్‌లో ఏర్పాట్లు నెల్లూరు (రవాణా) : తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడును సోమవారం ఘనంగా నిర్వహించనున్నారు. స్థానిక మినీబైపాస్‌లోని అనిల్‌గార్డెన్స్‌లో ఉదయం 10 గంటలకు మహానాడు కార్యక్రమం ప్రారంభం కానుంది.. ఈ మహానాడుకు ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి మంత్రి శిద్దా రాఘవరావు, పురపాలకశాఖ మంత్రి నారాయణ హాజరుకానున్నారు. జిల్లాలోని ముఖ్య నాయకులు, పార్టీ అనుబంధసంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, మండల, నియోజకవర్గ నాయకులుకు మహానాడుకు సంబంధించి ఆహ్వానం పంపారు. మహానాడుకు సుమారు మూడు వేల మంది హాజరుకానున్నారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అనిల్‌గార్డెన్స్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. మహానాడుకు వచ్చిన నాయకులకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. మహానాడుకు వచ్చే వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షడు బీద రవిచంద్రతో పాటు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, జెడ్.శివప్రసాద్ మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మంత్రి శిద్దా రాఘవరావు నెల్లూరు (రవాణా) : రాష్ట్రప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ జిల్లా కమిటీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన శిద్దా రాఘవరావు, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు హాజరయ్యారు. తొలుత పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళలర్పించారు. ఈ సందర్భంగా శిద్దా మాట్లాడుతూ ప్రస్తుతం వృద్ధులకు రూ.1000 పింఛన్ ఇస్తున్నా ప్రచారం రావడం లేదని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీరు-చెట్టు కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని అధిగమించి, వచ్చే ఎన్నికల్లో 10 సీట్లు గెలిచేందుకు కృషిచేయాలన్నారు. నెల్లూరు నియోజకవర్గంలో ఏర్పాటుకానున్న టోల్గేట్ విషయాన్ని సోమిరెడ్డి తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. టోల్గేట్ వ్యవహారాన్ని కేంద్రమంత్రులు గడ్కారి, వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటుకాకుండా తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో రోడ్ల అభివృద్ధికి అవసరమైన నిధులును సేకరించి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నా ఇచ్చిన హామీలను చంద్రబాబు నేరవేర్చారన్నారు. జిల్లాలో ఎయిర్‌పోర్టును వీలైనంత త్వరగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జపాన్ కేవలం 13 కోట్లు జనభా మాత్రమే కలిగిఉందని, అక్కడ 1154 పోర్టులు ఉన్నట్లు చెప్పారు. రాష్ర్టంలో మరో 24 పోర్టులు ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వ విప్, ఎన్నికల పరిశీలకుడు మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. మరో పరిశీలకుడు, ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రా, రాయలసీమ తెలుగు తమ్ముళ్లును ఎందుకు పోగట్టుకున్నామా అని తెలంగాణ ప్రజలు బాధపడే రోజు త్వరలో వస్తుందన్నారు. కార్యకర్తలకు అందుబాటులో బీద రవిచంద్ర ఉండాలని సూచించారు. ఫోన్ చేసినా తీయడం లేదంటూ చురకలు అంటించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర అధ్యక్షత వహించగా మాజీ మంత్రులు ఆదాల ప్రభాకరరెడ్డి, రమేష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యేలు బల్లి దుర్గాప్రసాద్, పరసావెంకటరత్నం, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, గూడూరు ఇన్చార్జి జ్యోత్స్నలత, వెంకటగిరి ఇన్చార్జి కన్నబాబు, డీసీసీబీ చైర్మన్ ధనుంజయరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీద మస్తానరావు, నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కార్పొరేటర్ జెడ్.శివప్రసాద్, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనూరాధ తదితరులు పాల్గొన్నారు. -
ఎంతకీ కుదర్లే..
► టీడీపీ జిల్లా కమిటీ ఎన్నిక వాయిదా ► అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వరకే పరిమితం ► చివరి క్షణంలో ప్రధాన కార్యదర్శి మార్పు ► నేతలపై తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి ► కమిటీ ఎంపిక కోసం మంత్రులు, ఎమ్మెల్యేల సుదీర్ఘ చర్చ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ జిల్లా కమిటీ ఎంపికపై ముఖ్యనేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వరకే పరిమితం చేశారు. మిగిలిన కమిటీ సభ్యుల ఎంపికకు మరో రెండు రోజులు పడుతుందని పార్టీ నాయకులు ప్రకటించారు. ఎంతో ఆశతో సమావేశానికి వచ్చిన తమ్ముళ్లు తీవ్ర నిరాశతో వెనుదిరిగి వెళ్లటం కనిపించింది. అయితే దాదాపు అనుబంధ సంఘాల అధ్యక్షులను ఖరారు చేసినట్లు తెలిసింది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జిల్లా కమిటీ, అనుబంధ సంఘాల్లో మిగిలిన సభ్యుల కూర్పు సరిగా లేకపోవటంతో ప్రస్తుతానికి ఎంపికను వాయిదా వేసినట్లు తెలిసింది. అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ.. ఆయా అనుబంధ సంఘాల అధ్యక్షుల ఎంపికపై తెలుగుతమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. పార్టీ కోసం జెండాలు మోసిన వారిని పక్కనపెట్టి కొత్తగా చేరిన వారికి పదవులు ఇవ్వటంపై తమ్ముళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే జిల్లా కమిటీ, అనుబంధ సంఘాల ఎన్నికల కోసం శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇన్చార్జ్ మంత్రి శిద్దా రాఘవరావు, మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. పదవులు వస్తాయని ఎంతో ఆశతో సమావేశానికి వచ్చిన కొందరు నాయకులకు నిరాశ ఎదురైంది. పదేళ్లు జెండా మోసినందుకు ప్రతిఫలం దక్కుతుందని భావించారు. పార్టీ అధికారంలోకి వచ్చింది.. పదవులు తప్పక లభిస్తాయని ఆశించిన తమ్ముళ్లు కొందరికి కమిటీలో చోటు లేదని తెలుసుకుని సమావేశం మధ్యలోనే వెళ్లిపోవటం కనిపించింది. మరికొందరు చివరి దాకా ఉండి నిరుత్సాహంతో తిరిగి వెళ్లారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పేరు శనివారం ఉదయం 10 గంటలకు కమిటీ జాబితాలో ఉంది. అయితే కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నివాసంలో జరిగిన సమావేశం తరువాత అనూహ్యంగా చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డినే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. పట్టాభి పేరును ఎమ్మెల్యే, కోవూరు నియోజకవర్గ నాయకులు, జిల్లా నేతలు కొందరు వ్యతిరేకించటంతో మంత్రి నారాయణ చేజర్లనే తిరిగి కొనసాగించాలని నిర్ణయించారు. అదేవిధంగా తెలుగుయువత జిల్లా అధ్యక్షుడుగా ఎంపికైన శింగంశెట్టి రవిచంద్రను ఆ పదవిని ఆశిస్తున్న కొందరు వ్యతిరేకించారు. శింగంశెట్టి 2011లో పార్టీలో చేరారని, అయితే తాము అంతకంటే ముందు నుంచి పనిచేస్తున్నా తమకు గుర్తింపు ఇవ్వరెందుకని ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే జిల్లా అధ్యక్షుడు బీద శింగంశెట్టికే కట్టబెట్టేందుకు పట్టుబట్టినట్లు తెలిసింది. అదేవిధంగా ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన పొత్తూరు శైలజకు తెలుగు మహిళా అధ్యక్షురాలి పదవిని కట్టబెట్టుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే పొత్తూరుకు అధ్యక్ష పదవిని ఇవ్వటాన్ని కొందరు మహిళలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కోసం తాము మొదటి నుంచి పనిచేస్తున్నా.. తమను కాదని కొత్తవారికి ఇవ్వటాన్ని వ్యతిరేకించి కొందరు మహిళలు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులుగా జన్ని రమణయ్య పేరు దాదాపు ఖరారైంది. అయితే ఇతను ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ఆదాల ప్రభాకరరెడ్డితో పార్టీలో చేరారు. పార్టీలో సీనియర్లను కాదని రమణయ్యకు అధ్యక్షపదవి కట్టబెట్టటంపై కొందరు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే కోవలో మరి కొన్ని అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శ పదవులపై గందరగోళం నెలకొంది. కమిటీ ఎంపిక కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు అర్థరాత్రి వరకు పార్టీ కార్యాలయంలోనూ తిష్టవేసి కసరత్తు చేశారు. అయితే ఏకాభిప్రాయం కుదురకపోవటంతో కమిటీ ఎంపికను వాయిదా వేయటం గమనార్హం. -
బాబు హామీ ఇచ్చారా?: మంత్రి శిద్ధా
‘ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలిస్తామని. సంస్థని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీ వేస్తామని.. ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారా? ఆ విషయం నాకు తెలీదు’ అని ఏపీ రవాణా శాఖా మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ఆర్టీసీ ఎండీ సాంబశివరావుతో కలసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం నాటికి 50 శాతం బస్సుల్ని(4,934) తిప్పామన్నారు. సమ్మెపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. మొండివైఖరి వీడి వారంతట వారే చర్చలకు రావాలన్నారు. చిత్తూరులో లాఠీఛార్జీపై బాధపడుతున్నామని, బస్సులను అడ్డుకుంటే కఠినంగానే వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రైవేటు వాహనాల నియంత్రణ అంశాన్ని దాటవేశారు. -
రూటు మారిందా.. గోవిందా..!
► జిల్లా చేజారిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ? ► వంద కోట్ల ప్రాజెక్ట్‌ను దారి మళ్లించిన మంత్రి శిద్దా... ► పట్టించుకోని జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు సాక్షి, గుంటూరు : రాష్ట్రంలోనే మొట్టమొదట ఏర్పాటు కానున్న అతి పెద్ద ప్రాజెక్ట్ అయిన ‘డ్రైవింగ్ శిక్షణ కేంద్రం’ను నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం జరగనున్న గుంటూరు జిల్లాలో ఏర్పాటుకు రవాణాశాఖ ఉన్నతాధికారులు ఆరు నెలల క్రితమే ప్రతిపాదనలు పంపారు. ఇందుకోసం గుంటూరులోని అడవితక్కెళ్లపాడు వద్ద ఐదెకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులతో కలసి అప్పటి డీటీసీ సుందర్ పరిశీలించారు. సుమారు రూ. వంద కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ కేంద్రాన్ని రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేస్తే రూ. వంద కోట్ల వ్యయంతో గుంటూరులో ఏర్పాటు కానున్న భారీ ప్రాజెక్టు ‘డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్’ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు దారి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు....ఇందులో ఆయన సఫలీకృతులవుతున్నట్టు ఆ శాఖ ఉన్నతాధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. ఆయన సొంత జిల్లా ప్రకాశంలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం నిర్మాణానికి మార్గం సుగమం అయినట్టేనని చెపుతున్నారు. ఆంధ్రాలోని 13 జిల్లాలకు సౌకర్యంగా ఉంటుందనేది ఉన్నతాధికారుల ఉద్దేశం. దీనికి సంబంధించి నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. గుంటూరులో నెలకొల్పడం దాదాపు ఖాయమనుకుంటున్న తరుణంలో రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు మంత్రాంగం నడిపి తన సొంత జిల్లా అయిన ప్రకాశంకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం స్థలాన్ని సైతం సిద్ధం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. మంత్రి స్వయంగా ప్రతిపాదనలు పంపించిన తరువాత ఉన్నతాధికారులు సైతం ఆయన మాట కాదనలేక గుంటూరు ఊసు ఎత్తడం లేదని తెలుస్తోంది. గుంటూరులో ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళ్లిన తరువాత మంత్రి దీనిని ప్రకాశం జిల్లాకు తరలిస్తున్నట్లు తె లిసి కూడా గుంటూరు జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు మిన్న కుండటం విమర్శలకు తావిస్తోంది. గుంటూరు జిల్లాలో రాజధానికి భూములు సమీకరించి ప్రాజెక్ట్‌లను మాత్రం లేకుండా చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తమ సొంత పనులు చూసుకోవడమే సరిపోతుందని, ఉపాధి కల్పించే ప్రాజెక్ట్‌లను జిల్లాకు తేవడంలో విఫలమౌతున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఇప్పటికైనా మంత్రులు స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి శిక్షణ కేంద్రం ప్రకాశం జిల్లాకు తరలిపోకుండా చూడాలని కోరుతున్నారు. డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగాలు .... రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్మించే డ్రైవింగ్ శిక్షణ కేంద్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే ఉంటుంది. అత్యాధునిక హంగులతో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఐదు నుంచి పదెకరాల స్థలంలో సువిశాలంగా నిర్మించే ఈ కేంద్రంలో ఐదు హెవీ డ్రైవింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తారు. రోజుకు సుమారు 20 మందికి పైగా శిక్షణ పొందే విధంగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్కరికీ వారం నుంచి పది రోజుల పాటు శిక్షణ ఇస్తారు. కేంద్రంలో ఇన్‌బుల్ట్ కెమెరాలు ఏర్పాటు చేసి డ్రైవింగ్ నైపుణ్యాన్ని కంప్యూటర్లో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇక్కడ శిక్షణ పొందే వారికి వైద్య సేవలు అందించడంతోపాటు బీమా కూడా వర్తింపజేస్తారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అన్ని హంగులతో రూ. వంద కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న శిక్షణ కేంద్రం గుంటూరు నుంచి తరలివెళ్లనుందన్న వార్త జిల్లా ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. -
హవ్వ.. మంత్రిపై ఫిర్యాదా?
యర్రగొండపాలెం : మంత్రి మంత్రి శిద్దా రాఘవరావుపై సీఎం చంద్రబాబుకు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బూదాల అజితారావు ఫిర్యాదు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ మన్నె రవీంద్ర అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు పలువురు టీడీపీ నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా అజితారావుపై అవినీతి ఆరోపణలు చేశారు. ఈ నెల 2వ తేదీన స్థానికి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన అజితారావు.. రేషన్ షాపులు మంత్రి చెప్పినవారికి ఇవ్వడం ఏమిటని, తాను చెప్పిన వారికి ఇవ్వాలని తహశీల్దార్‌ను ప్రశ్నించడం విడ్డూరమన్నారు. నియోజకవర్గంలో పార్టీని అభాసుపాలు చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆమెపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆది నుంచి పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. రేషన్ షాపుల కోసం డబ్బులు వసూలు చేస్తూ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పుల్లలచెరువు మండల పరిషత్ ఓటమికి కారణమైన వ్యక్తి సోదరుడిని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నియమించుకోవడం టీడీపీని, కార్యకర్తలను దెబ్బ తీయడమేనని విమర్శించారు. నియోజకవర్గంలో విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు 16 ఉండగా 22 పోస్టులకు ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు చొప్పున అజితారావు వసూలు చేసింది నిజం కాదా.. అని ప్రశ్నించారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సమావేశంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కామేపల్లి వెంకటేశ్వర్లు, పార్టీ పుల్లలచెరువు మండల అధ్యక్షుడు శనగ నారాయణరెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా కోశాధికారి గోళ్ల వెంకటసుబ్బారావు, నాయకులు వడ్లమూడి లింగయ్య, మేడికొండ లక్ష్మీనారాయణ, తోట మహేష్, కొత్తమాసు సుబ్రహ్మణ్యం, షేక్ మహ్మద్ఫ్రీ, వై.లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు. -
ఆర్అండ్బీ రోడ్లను అభివృద్ధి చేస్తాం - మంత్రి శిద్దా
ఒంగోలు సెంట్రల్ : రాష్ట్రంలోని అన్ని ఆర్అండ్బీ రోడ్లను అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్దారాఘవరావు అన్నారు. ఒంగోలు లాయర్ పేటలోని మంత్రి నివాసంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ డబుల్ లైన్ల రహదారులను, నాలుగు లైన్ల రహదారులుగా, నాలుగు లైన్ల రహదారులను 6, 8 లైన్ల రహదారులుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఆర్టీసీకి నూతనంగా 1200 బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. నెలకు 400 బస్సులను రోడ్ల మీదకు తెస్తామన్నారు. మొత్తం మార్చిలోపు పాత బస్సుల స్థానం లో నూతన బస్సులను ప్రవేశపెడతామన్నారు. ప్రయివేట్ బస్ ఆపరేటర్లతో తిరుపతిలో సమావేశం నిర్వహిం చి బస్సు టికెట్ రేట్ల విషయంలో హెచ్చరించినట్లు తెలిపారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నగరాల బస్సు స్టాండ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. తిరుపతి బస్సు స్టాప్‌లో సెంట్రల్ ఏసీని, అండర్ గ్రౌండ్ ప్లాట్‌ఫారాలను రూ.350 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. దొనకొండలో ఇండస్ట్రియల్కారిడార్ను నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో వెటర్నరీ యూనివర్శిటీ, మినరల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.