♦ ముఖ్య అతిథులుగా మంత్రులు శిద్దా, నారాయణ
♦ అనిల్‌గార్డెన్స్‌లో ఏర్పాట్లు
నెల్లూరు (రవాణా) : తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడును సోమవారం ఘనంగా నిర్వహించనున్నారు. స్థానిక మినీబైపాస్‌లోని అనిల్‌గార్డెన్స్‌లో ఉదయం 10 గంటలకు మహానాడు కార్యక్రమం ప్రారంభం కానుంది.. ఈ మహానాడుకు ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్దా రాఘవరావు, పురపాలకశాఖ మంత్రి నారాయణ హాజరుకానున్నారు. జిల్లాలోని ముఖ్య నాయకులు, పార్టీ అనుబంధసంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, మండల, నియోజకవర్గ నాయకులుకు మహానాడుకు సంబంధించి ఆహ్వానం పంపారు.
మహానాడుకు సుమారు మూడు వేల మంది హాజరుకానున్నారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అనిల్‌గార్డెన్స్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. మహానాడుకు వచ్చిన నాయకులకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. మహానాడుకు వచ్చే వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షడు బీద రవిచంద్రతో పాటు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, జెడ్.శివప్రసాద్ మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
నేడు టీడీపీ మినీ మహానాడు
Published Mon, May 25 2015 1:05 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement