Additional interest
-
ఆర్బీఐ కీలక ఆదేశాలు - డిఫాల్ట్ కస్టమర్లకు గుడ్ న్యూస్
ముంబై: రుణాలు డిఫాల్ట్ అయిన కస్టమర్లపై బ్యాంకులు అదనపు వడ్డీ, చార్జీలు విధించి దాన్ని అసలుకు కలిపే విధానానికి చెక్ పెట్టేలా రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదనలు చేసింది. జరిమానాగా వడ్డించే చార్జీల పరిమాణం అనేది డిఫాల్ట్ అయిన మొత్తానికి అనుగుణంగా మాత్రమే ఉండాలని సహేతుక రుణ విధానాలపై విడుదల చేసిన ఒక సర్క్యులర్ ముసాయిదాలో పేర్కొంది. తీసుకున్న రుణాన్ని రుణగ్రహీత సక్రమంగా తిరిగి చెల్లించేలా చూడటమే జరిమానాల ప్రధాన ఉద్దేశ్యమని, వాటిని ఆదాయ వనరుగా బ్యాంకులు భావించరాదని సూచించింది. -
ఆర్టీసీ కార్మికులపై అదనపు వడ్డీ భారం
1 శాతం అదనపు వడ్డీ వసూలుకు సర్క్యులర్ 289 జారీ కదిరి: ఆర్టీసీ కార్మికులు క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ(సీసీఎస్) ద్వారా తీసుకున్న రుణాలపై ఒక శాతం అదనపు వడ్డీ వసూలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు గతనెల 23న సర్క్యులర్ నంబర్ 289ను విడుదల చేసింది. ఇప్పటిదాకా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సీసీఎస్ ద్వారా పొదుపు చేసుకున్న మొత్తానికి పది శాతం వడ్డీ ఇచ్చేవారు. అదేవిధంగా సీసీఎస్ ద్వారా పొందిన స్వల్పకాలిక, విద్యా, గృహ రుణాలపై 11 శాతం వడ్డీ వసూలు చేసేవారు. తాజా సర్క్యులర్ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 1 శాతం అంటే ఇకపై 12 శాతం వడ్డీ వసూలు చేయనున్నారు. సుమారు రూ.32 లక్షలకుపైగా అదనపు భారం కార్మికులపై పడనుంది.