ఆలంపల్లి, న్యూస్‌లైన్: రైళ్లలో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే చర్యలు తీసుకుంటామని రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రఘునాథ్‌రెడ్డి ప్రయాణికులను హెచ్చరించారు. సోమవారం వికారాబాద్ రైల్వేస్టేషన్‌లో తనిఖీలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిక్కెట్ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని తనిఖీలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్, చిత్తాపూర్, వాడీ, వికారాబాద్, పర్లి సెక్షన్ల పరిధిలో ప్రత్యేకంగా 44 మంది టీసీలు, పది మంది ఆర్పీఎఫ్ పోలీసులతో తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్‌లో తని ఖీలు కొనసాగుతున్నట్లు రఘునాథ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నుంచి తనిఖీలు చేస్తూ టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 144 మంది ప్రయాణికులపై కేసులు నమోదు చేసి రూ. 70 వేల జరిమానా వసూలు చేశామన్నా రు. రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించడం సరికదని ఆయన చెప్పారు. ప్రయాణికులంతా విధిగా టికెట్ తీసుకొని ప్రయాణించాలన్నారు. 10 టెటరింగ్ కేసులు(ఉమ్మివేత) నమోదు చేసి రూ. 2 వేల జరిమానా విధించినట్లు రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రఘునాథ్‌రెడ్డి చెప్పా రు. రైళ్లలో, రైల్వేస్టేషన్‌లలో గుట్కాలు, పాన్‌మసాలాలు ఉమ్మివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సీట్లపై ఆహారం, ఇతర ప దార్ధాలు వేసి అపరిశుభ్రం చేయడం తగదన్నారు. రైల్వే ఆదాయం పెం చేందుకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ స్టేషన్ మేనేజర్ మోహన్, తనిఖీ సిబ్బంది ఉన్నారు.
రైల్వే ఆదాయం పెంచేందుకు స్పెషల్ డ్రైవ్
Published Mon, Jun 2 2014 11:25 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement