alampalli
-
రైల్వే ఆదాయం పెంచేందుకు స్పెషల్ డ్రైవ్
ఆలంపల్లి, న్యూస్‌లైన్: రైళ్లలో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే చర్యలు తీసుకుంటామని రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రఘునాథ్‌రెడ్డి ప్రయాణికులను హెచ్చరించారు. సోమవారం వికారాబాద్ రైల్వేస్టేషన్లో తనిఖీలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిక్కెట్ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని తనిఖీలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్, చిత్తాపూర్, వాడీ, వికారాబాద్, పర్లి సెక్షన్ల పరిధిలో ప్రత్యేకంగా 44 మంది టీసీలు, పది మంది ఆర్పీఎఫ్ పోలీసులతో తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్లో తని ఖీలు కొనసాగుతున్నట్లు రఘునాథ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నుంచి తనిఖీలు చేస్తూ టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 144 మంది ప్రయాణికులపై కేసులు నమోదు చేసి రూ. 70 వేల జరిమానా వసూలు చేశామన్నా రు. రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించడం సరికదని ఆయన చెప్పారు. ప్రయాణికులంతా విధిగా టికెట్ తీసుకొని ప్రయాణించాలన్నారు. 10 టెటరింగ్ కేసులు(ఉమ్మివేత) నమోదు చేసి రూ. 2 వేల జరిమానా విధించినట్లు రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రఘునాథ్‌రెడ్డి చెప్పా రు. రైళ్లలో, రైల్వేస్టేషన్లలో గుట్కాలు, పాన్‌మసాలాలు ఉమ్మివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సీట్లపై ఆహారం, ఇతర ప దార్ధాలు వేసి అపరిశుభ్రం చేయడం తగదన్నారు. రైల్వే ఆదాయం పెం చేందుకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ స్టేషన్ మేనేజర్ మోహన్, తనిఖీ సిబ్బంది ఉన్నారు. -
‘సబ్ రిజిస్ట్రార్’ అవినీతి బాగోతంపై రహస్య విచారణ..?
ఆలంపల్లి, న్యూస్‌లైన్: వికారాబాద్‌లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గత శనివారం జరిగిన లంచాల బాగోతంపై ఆశాఖ ఉన్నతాధికారులు గోప్యంగా విచారణ చేపట్టినట్లు తెలిసింది. విచారణ జరుగుతున్న విషయం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నతాధికారులు విచారణకు వచ్చిన సమయంలో కూడా మధ్యవర్తులు తమ దందాను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించడం గమనార్హం. వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో మధ్యవర్తులు తమ దందా కొనసాగించారు. ఈ తీరును గమనించిన స్థానికులు ఈ అవినీతి బాగోతంలో ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సంఘటన జరిగి వారం కావస్తున్న సబ్ రిజిస్టర్‌పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. -
ప్రశాంతంగా ఎంసెట్
ఆలంపల్లి, న్యూస్‌లైన్: వికారాబాద్‌లోని రెండు సెంటర్లలో గురువారం నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు నిబంధన పెట్టడంతో విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. కొందరు ఐదు పది నిమిషాలు ఆలస్యంగా రావడంతో వారిని పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో వారు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. వికారాబాద్ ఎంసెట్ రీజనల్ కో-ఆర్డినేటర్, ఎస్ఏపీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రకాష్ పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. రెండు సెంటర్లలో మెడికల్, ఇంజినీరింగ్ పరీక్ష ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను ఉదయం 10గంటలకు వికారాబాద్‌లోని రెండు సెంటర్లలో నిర్వహించారు. మొత్తం 1,012 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 963 మంది హాజరయ్యారు. రెండు సెంటర్లలో కలిసి 49 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ధన్నారం అన్వర్ ఉలూమ్ కళాశాల పట్టణానికి దూరంగా ఉండడంతో విద్యార్థులు ప్రైవేటు వాహనాలను, ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎస్ఏపీ కళాశాలలో, అన్వర్ ఉలూం కాలేజీలో మెడిసిన్ విభాగం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 694మంది విద్యార్థులకు 655 మంది హాజరయ్యారు. 39 మంది గైర్హాజరయ్యారు. ఆలస్యంగా వచ్చి పరీక్ష రాయలేకపోయిన విద్యార్ధులు అన్వర్ ఉలూమ్ కళాశాలలో నిర్వహించిన ఇంజినీరింగ్ పరీక్షకు జ్యోతి అనే విద్యార్థినితోపాటు మరో ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు వారిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. టెంటు కూడా వేయలేదు.. వికారాబాద్ అన్వర్ ఉలూమ్ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద కనీసం షామియానా కూడా ఏర్పాటు చేయలేదు. ముందుగానే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎండలోనే నిరీక్షించాల్సి వచ్చింది. కళాశాలకు దూరంగా పంటపొలాల్లో ఉన్న చెట్ల కింద గడిపారు. సీఎంఆర్‌లో పరీక్ష రాసిన 3,250 మంది.. మేడ్చల్: మండలంలోని కండ్లకోయ సీఎంఆర్ గ్రూపు కళాశాలలోని నాలుగు సెంటర్లలో నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సీఎంఆర్‌ఐటిలో ఒకటి, సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలో ఒకటి, సీఎంఆర్ సెట్లో రెండు సెంటర్లను ఏర్పాటు చేశారు. సెట్ కళాశాలలోని రెండు సెంటర్లలో 500 మంది విద్యార్థుల చొప్పున, మిగతా సెంటర్లలో 450 మంది విద్యార్థుల చొప్పున 3,250 విద్యార్థులు పరీక్ష రాశారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
తూప్రాన్, న్యూస్‌లైన్: గజ్వేల్ నియోకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఐకేపీ ద్వారా ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జేసీ శరత్ తెలిపారు. తూప్రాన్ మండలం యావపూర్‌లో గురువారం రాత్రి ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీఎ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని కేసీఆర్ అడిగినట్లు జేసీ తెలిపారు. అయితే గత ఏడాది గజ్వేల్ కొనుగోలు కేంద్రంలో సేకరించిన ధాన్యం విషయంలో కొంత గొడవ జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. ఇందుకోసం ప్రస్తుత సీజన్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సమైక్య సంఘాల వారు ముందుకు రాని కారణంగా జాప్యం నెలకొందని తెలిపారు. వెంటనే నియోజకవర్గంలో ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 94 కొనుగోలు కేంద్రాల ద్వారా 23 వేల మేట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యాన్ని నాణ్యమైనదిగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వల్ల మిల్లర్లకు చెక్ పెట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.1345 ధర కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు 72 గంటల్లో తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందన్నారు. అయితే బ్యాంకుల్లో జమ అయిన డబ్బులను బ్యాంకు అధికారులు రైతుల రుణాలకు మళ్లించినట్లయితే బ్యాంకు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐకేపీ మహిళలకు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించినందుకు వందకు రూ.2.5 శాతం కమిషన్ వస్తోందన్నారు. ఇందుకోసం మహిళలు జాగ్రత్తగా ధాన్యాన్ని సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ స్వామి, డిప్యూటీ తహశీల్దార్ కిషన్, ఐకేపీ ఏపీఎం యాదగిరి, ఆర్ఐలు సంతోష్‌కుమార్, నర్పింహారెడ్డి, సర్పంచ్ గోరీబీ, గ్రామ సమైక్య సంఘం మహిళలు నర్మద, రేణుక, తదితరులు పాల్గొన్నారు. -
ఊరేగింపులు, ర్యాలీలు నిషేధం
ఆలంపల్లి, న్యూస్‌లైన్: ఈనెల 16 వరకు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు లేవని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. సోమవారం ఎస్పీ వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌం టింగ్‌ను పర్యవేక్షించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ పట్టణంలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై 10:30 గంటలకు ముగిసిందని ఎస్పీ పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అప్రమత్తమై బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించేందుకు అనుమతి లేదని ఆమె చెప్పారు. ఈనెల 16 తర్వాత అనుమతులు పొంది ర్యాలీలు నిర్వహించుకోవచ్చని ఎస్పీ తెలిపారు. వికారాబాద్ ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ అమ్రపాలి మాట్లాడుతూ.. వికారాబాద్‌లోని 27 వార్డులకు కౌం టింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. కౌం టింగ్‌కు సహకరించిన అధికారులకు, నాయకులకు ఆమె అభినందనలు తెలిపారు. నెలకు పైగా ఉత్కం ఠతో ఎదురు చూసిన మున్సిపల్ ఫలితాలు వెలువడడంతో టెన్షన్‌కు తెరపడింది. అంతా సవ్యంగా జరగడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
బాల్య వివాహానికి ఏర్పాట్లు.. అడ్డుకున్న అధికారులు
ఆలంపల్లి, న్యూస్‌లైన్: అధికారులు ఓ బాల్య వివాహ ఏర్పాట్లను అడ్డుకొని బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్య వివాహం చేస్తే జైలు ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరిం చారు. ఈ సంఘటన గురువారం వికారాబాద్ మండలం మదన్‌పల్లిలో చో టుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కిష్టయ్య, కిష్టమ్మ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కూతురు(15) స్థానికంగా ఆరో తరగతి చదువుతోంది. బాలికకు మర్పల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయించారు. శుక్రవారం ఉదయం వివాహం చేసేందుకు ఇరువర్గాల వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో గురువారం ఉదయం వికారాబాద్ తహసీల్దార్ గౌతంకుమార్, ఎస్ఐ హన్మ్యా నాయక్, అధికారులు మదన్‌పల్లికి చేరుకొని వివాహ ఏర్పాట్లను అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలని, లేదంటే జైలుపాలవుతారని హెచ్చరించారు. చిన్నతనంలో పెళిళ్ల్లు చేస్తే జరిగే పరిణామాలను వివరించి వారికి కౌన్సెలింగ్ చేశారు. బాల్య వివాహాల గురించి తమకు సమాచారం అందించాలని అధికారులు స్థానికులకు చెప్పారు. ఎస్ఐ హన్మ్యానాయక్ మాట్లాడుతూ.. అం టరానితనం రూపుమాపాలని చెప్పా రు. అమ్మాయిలకు మైనారిటీ తీరిన తర్వాతే వివాహం చేయాలని సూచిం చారు. మద్యం మత్తులో వాహనాలు నడపరాదని చెప్పారు. గ్రామ సర్పంచ్ మాణెమ్మ, వీఆర్ఓ నర్సింహారెడ్డి, వీఏఓ రమాదేవి తదితరులు ఉన్నారు.