ఆలంపల్లి, న్యూస్‌లైన్: వికారాబాద్‌లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గత శనివారం జరిగిన లంచాల బాగోతంపై ఆశాఖ ఉన్నతాధికారులు గోప్యంగా విచారణ చేపట్టినట్లు తెలిసింది. విచారణ జరుగుతున్న విషయం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నతాధికారులు విచారణకు వచ్చిన సమయంలో కూడా మధ్యవర్తులు తమ దందాను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించడం గమనార్హం. వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో మధ్యవర్తులు తమ దందా కొనసాగించారు. ఈ తీరును గమనించిన స్థానికులు ఈ అవినీతి బాగోతంలో ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సంఘటన జరిగి వారం కావస్తున్న సబ్ రిజిస్టర్‌పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది.
‘సబ్ రిజిస్ట్రార్’ అవినీతి బాగోతంపై రహస్య విచారణ..?
Published Sun, May 25 2014 11:55 PM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement