Sub-registrars office
-
‘గూడు’కట్టుకున్న ఆశలు
అప్పన్న భూవివాద పరిష్కారానికి కసరత్తు 1998 నుంచి నేటి వరకు ధరల మార్పులపై ప్రభుత్వం ఆరా దేవస్థానం భూముల ధరలపై నివేదిక {పభుత్వానికి సమర్పించిన కలెక్టర్ గోపాలపట్నం : సింహాచల దేవస్థానం భూవివాద పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా భూముల ధరల నివేదిక కోరడంతో జిల్లా అధికారులు నివేదిక సమర్పించారు. దీంతో దేవస్థానం భూ బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దేవస్థాన భూముల పరిధిలో ఉన్న వెంకటాపురం, వేపగుంట, చీమలాపల్లి, పురుషోత్తపురం, అడివివరం గ్రామాల్లో వేలాది ఇళ్లు, స్థలాలు, ఎకరాల కొద్దీ భూములు ఉన్నాయి. 1999లో దేవస్థానం భూముల్లో నివాసాలుంటున్న వారి స్థలాల క్రమబద్ధీకరణకు నాటి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇందుకోసం 578 జీఓ విడుదల చేసింది. కానీ అప్పట్లో ఆ భూముల ధరలు భారంగా ఉన్నాయంటూ ఇళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవోను రద్దు చేసి ధరలు మార్పు చేయాలని ఉద్యమాలు చేశారు. అదే సమయంలో దేవస్థానం భూములు అన్యాక్రాంతమవుతున్నాయంటూ పీఠాధిపదులు రాష్ట్ర న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఏకంగా లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ గ్రామాలు, గోపాలపట్నంతో పాటు నగరమంతటా ఉన్న కొండప్రాంతం సర్వే నంబరు 275 వివాదంలో ఉంది. ఈ భూములు కూడా దేవస్థానానివేనని, వీటి నిర్మాణాలను, క్రయ విక్రయాలను అధికారులు అడ్డుకుంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గోపాలపట్నం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో లావాదేవీలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రభుత్వం ఏటా పది కోట్ల రూపాయలకు పైగా ఆదాయం కోల్పోతోంది. మరో వైపు సొంతిళ్లు ఉన్నా అవి తమ భూముల్లోనే ఉన్నాయని దేవస్థానం అధికారులు పెత్తనం చేస్తుండడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన రెండుమూడు నెలల్లో దేవస్థానం భూ సమస్య పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో దేవస్థానం భూముల ధర రికార్డు సమర్పించాలని కలెక్టర్ యువరాజ్ నుంచి గోపాలపట్నం సబ్‌రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణకు ఆదేశాలు వచ్చాయి. దీంతో 1998 నుంచి ఇప్పటి వరకు పెరిగిన భూముల ధరల వివరాలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం కోరడంతో పీఠాధిపతులు సానుకూలంగా ఉన్నందున న్యాయస్థానం నుంచి ప్రజలకు అనుకూల తీర్పు వెలువడుతుందని... 578 జీవో ప్రకారమే ధరల నిర్ణయం ఉంటుందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పుడున్న భూముల ధరలు గోపాలపట్నం మెయిన్‌రోడ్డు కమర్షియల్ చదరపు గజం రూ25 వేలు ...గోపాలపట్నాన్ని అనుకొని ఉన్న కాలనీల్లో చదరపు గజం రూ. 6 వేల నుంచి రూ.16వేలు బుచ్చిరాజుపాలెం మెయిన్‌రోడ్డు కమర్షియల్ రూ. 28వేలు, ఆనుకొని వున్న కాలనీల్లో చదరపుగజం రూ.12 వేల నుంచి రూ.16 వేలు వేపగుంట మెయిన్‌రోడ్డు చదరపు గజం రూ.12 వేలు... ఆనుకొని ఉన్న కాలనీల్లో రూ.5800 నుంచి రూ.12 వేలు వరకూ {పహ్లాదపురం ఏరియా రూ.11వేలు అడవివరం ఏరియా రూ.11వేలు పురుషోత్తపురం ఏరియా రూ.6 వేల నుంచి రూ.11 వేలు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం దేవస్థానం భూ సమస్య పరిష్కారం కోసమే మేమూ ఎదురు చూస్తున్నాం. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి భూముల ధరలు నివేదించాం. భూ సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇది జరిగితే ప్రజలకు మేలు జరగడంతో పాటు రిజిస్ట్రేషన్ల రూపేణా ప్రభుత్వానికీ భారీగా ఆదాయం వస్తుంది. మాకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక లక్ష్యాలూ నెరవేర్చగలం. - లక్ష్మీనారాయణ, సబ్‌రిజిస్ట్రార్, గోపాలపట్నం గడిచిన ఐదేళ్లలో రిజిస్ట్రేషన్ల తీరిదీ సంవత్సరం {పభుత్వ టార్గెట్ వచ్చింది 2009-2010 రూ.14 కోట్లు రూ.9.23 కోట్లు 2010-11 రూ.15.63 కోట్లు రూ.22.70 కోట్లు 2011-12 రూ.27.24 కోట్లు రూ.16.6 కోట్లు 2012-13 రూ.27.25 కోటు రూ.19.92 కోట్లు 2013-14 రూ.24.85 కోట్లు రూ.12.36 కోట్లు 2014-15 రూ27 కోట్లు రూ.10 కోట్లు(ఇప్పటి వరకు) -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
- నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు! - సెలవులో ఉన్నా కార్యాలయూనికి వచ్చిన సబ్ రిజిస్ట్రార్ - రూ.52 వేలు స్వాధీనం తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం రాత్రి ఆకస్మిక దాడి చేశారు. నిబంధనలకు విరుద్దంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న సమాచారం మేరకు కార్యాల యంలో తనిఖీలు నిర్వహించారు. రికార్డులలో నమో దు చేయకుండా కార్యాలయంలో ఉన్న రూ.52 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడి ఆస్తినైనా.. ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అయినా రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో ఏలూరు సమీపంలోని వట్లూరు గ్రామంలో గల 30 ఎకరాల భూమిని ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సంబంధిత వ్యక్తులు వచ్చా రు. ఆ భూమికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు ఫిర్యాదు అందటంతో ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఇక్కడ సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్త్ను ఆర్.శ్రీనివాసరావు సెలవులో ఉండగా, కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పి.శేఖర్ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన వద్ద రూ.80 మాత్రమే ఉన్నట్టు రికార్డుల్లో నమోదు కాగా, రూ.52 వేల నగదు అదనంగా ఉండటంతో ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో సెలవులో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆర్.శ్రీనివాసరావు కార్యాల యంలో ఉండటం విశేషం. వట్లూరు భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సెలవులో ఉన్న రిజిస్ట్రార్ పాత్రపై ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయూలంటే ఆర్వోఆర్, అడంగల్, టైటిల్ డీడ్ ఉండాలని, వట్లూరు భూములకు ఎలాంటి దస్తావేజులు లేకుండానే రిజిస్ట్రేషన్ చేశారని ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు విలేకరులకు తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయూల్సి ఉందన్నారు. ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న శేఖర్‌కు, సిబ్బందికి మధ్య అంతరాలు ఉన్నట్టు తమకు సమాచారం అందిందని ఆయన చెప్పారు. రిజి స్ట్రేషన్ చేయించుకునే వారినుంచి మామూళ్ల రూపంలో తీసుకునే మొత్తాలను కిందిస్థారుు సిబ్బందికి పంచని కారణంగా విభేదాలు పెరిగినట్టు తెలుస్తోందన్నారు. సోమవారం 30 రిజిస్ట్రేషన్లు జరిగాయని, వీటి నిమిత్తం రూ.52 వేల రూపాయలు అనామతుగా వచ్చినట్టుగా భావిస్తున్నామన్నారు. మొత్తం సమాచారాన్ని నివేదిక రూపంలో ఏసీబీ డెరైక్టర్ జనరల్‌కు పంపిస్తామని, అక్కడ నుంచి వచ్చే ఆదేశాలు, ప్రభుత్వ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని డీఎస్పీ పేర్కొన్నారు. తనిఖీల్లో ఏసీబీ సీఐ యూజె విల్సన్ సిబ్బంది పాల్గొన్నారు. సొమ్ములు లేకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు సరైన పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సి ఉంటుందని, ఇందుకోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లో సొమ్ము చెల్లించాల్సిన పనిలేదని డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల విషయంలో ఎవరైనా సొమ్ము అడిగితే తమను సంప్రదించాలని కోరారు. ఇలాంటి సమాచారం ఉంటే తన నంబర్ 94404 46157 లేదా 94404 46158, సీఐ నంబర్ 94404 46159కు ఫోన్ చేయూలని సూచించారు. -
రిజిస్ట్రేషన్ శాఖలో కుంభకోణం
ఆదిలాబాద్ : నిర్మల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోటు చేసుకున్న నకిలీ చలాన్ల కుంభకోణంలో ఐదుగురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ కరీంనగర్ డీఐజీ వీవీ నాయుడు నుంచి సోమవారం ఆదేశాలు వెలువడ్డాయి. సస్పెన్షన్‌కు గురైన వారిలో ప్రస్తుతం ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ జయవంత్‌రావు, నిర్మల్ సబ్ రిజిస్ట్రార్ మహేందర్‌రెడ్డి, ఖానాపూర్ సబ్ రిజిస్ట్రార్ శ్రీరామరాజు, నిర్మల్ ఎస్ఆర్వో సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌రాజు, జూనియర్ అసిస్టెంట్ అలిమొద్దీన్లు ఉన్నారు. కాగా నకిలీ చలాన్ల స్కాం రూ.60 లక్షలుగా నిర్ధారించారు. అయితే కేవలం ఏడాది చలాన్లను మాత్రమే పరిశీలించారు. స్కాం కొన్నేళ్లుగా సాగిందని ప్రచారం జరుగుతుండడంతో దీని విలువ కోట్లలో ఉండే అవకాశం ఉంది. ‘సాక్షి’ కథనాలతో వెలుగులోకి.. నిర్మల్ ఎస్ఆర్వోలో గత ఏప్రిల్‌లో ఈ కుంభకోణాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. 2014 ఏప్రిల్ 13న ‘రిజిస్ట్రేషన్ శాఖలో కుంభకోణం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కరీంనగర్ డీఐజీ వీవీ నాయుడు, జిల్లా ఇన్చార్జి రిజిస్ట్రార్ రమణరావు విచారణకు ఆదేశించారు. ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, మరో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను విచారణ అధికారులుగా నియమించారు. ఏప్రిల్ 16న ‘రిజిస్ట్రేషన్ కుంభకోణంపై విచారణ’ అనే శీర్షికన మరో కథనం సాక్షిలో ప్రచురితమైంది. దీనిపై నివేదికను తయారు చేసి విచారణ అధికారులు డీఐజీకి అందజేశారు. ఈ విచారణలో ఫోర్జరీ, బోగస్ చలాన్ల వ్యవహారం జరిగిందని నిరూపితం కావడంతో ఐదుగురు ఉద్యోగులపై వేటు వేశారు. కాగా ఈ వ్యవహారంలో నిర్మల్ పోలీసుస్టేషన్లో అప్పట్లోనే కేసు నమోదైంది. వ్యవహారం జరిగిందిలా.. నిర్మల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి తన సోదరునితో కలిసి ఈ బోగస్ చలాన్ల వ్యవహారం సాగించినట్లు అప్పట్లో ఆరోపణలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా రిజిస్ట్రేషన్ పార్టీ స్థిరాస్తి, భూమి కొనుగోళు చేయాలంటే బ్రోకర్లను సంప్రదిస్తారు. ఆయా పార్టీల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ ఫీజును వసూలు చేసి బ్యాంక్ చలాన్ తీసిన పక్షంలో ఆ సొమ్ము సర్కారు ఖజానాకు చేరుతుంది. చలాన్లను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పత్రాలకు జత చేసి దాని ఆధారంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుంది. బ్యాంక్‌లో చలాన్ తీసినప్పుడు మూడు స్క్రాలు జారీ చేస్తారు. అందులో ఒకటి పార్టీకి, మరొకటి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి అందిస్తారు. ఈ వ్యవహారంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి తన సోదరునితో కలిసి అక్రమ బాగోతానికి తెరలేపాడు. చలాన్ తీయాల్సిందానికంటే తక్కువ మొత్తంలో తీసి పార్టీలకు ఇచ్చే స్క్రాలలో ఫోర్జరీ చేసి దాన్ని ఎక్కువ మొత్తానికి మార్చేవారు. కొన్ని సార్లు చలాన్ తీయకుండానే రబ్బర్స్టాంప్లతో ముద్రలు, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి బోగస్ చలాన్లను సృష్టించి సాఫీగా నడిపారు. సబ్‌రిజిస్ట్రర్ కార్యాలయానికి వచ్చే స్క్రాలను సూక్ష్మంగా పరిశీలిస్తే చలాన్ మొత్తం, ట్రెజరీలో జమ అయ్యేదాన్ని సరిపోల్చుకుంటే వ్యవహారం ఎప్పుడో బయటపడేది. సబ్ రిజిస్ట్రార్లు, ఇతర అధికారులు నిర్లక్ష ్యం చేయడంతో కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాఫీగా సాగింది. ఓ బాధితుడు అనుమానంతో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. దీని ఆధారంగా ‘సాక్షి’ అప్పట్లో కథనం ప్రచురించి వెలుగులోకి తీసుకొచ్చింది. సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగులు అప్పట్లో నిర్మల్ ఎస్ఆర్వోలో పనిచేశారు. కాగా కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగినప్పటికి కేవలం 2013-14కు సంబంధించిన చలాన్లను మాత్రమే అధికారులు పరిశీలించారు. దాని విలువే రూ.60 లక్షలుగా నిర్ధారించారు. కొన్నేళ్లుగా జరిగిన ఈ వ్యవహారాన్ని పూర్తిగా బయటకు తీస్తే కోట్లలో ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో కరీంనగర్ డీఐజీ వీవీ నాయుడుని ‘సాక్షి’ వివరణ కోరగా ఐదుగురు ఉద్యోగులను బాధ్యులుగా చేస్తూ సస్పెన్షన్ చేసినట్లు తెలిపారు. ఇందులో బయట వ్యక్తుల ప్రమేయం విషయంలో పోలీసులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. మంచిర్యాల సబ్‌రిజిస్ట్రార్ పరిధిలో జరిగిన అవకతవకలపై త్వరలో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. -
రిజిస్ట్రేషన్ల రాబడి ఢమాల్
- పెరిగిన భూముల ధరలు - తగ్గిన రిజిస్ట్రేషన్ల సంఖ్య - భారీగా పడిపోయిన ఆదాయం - రాజధాని ప్రకటన కోసం ఎదురు చూపులు ఏలూరు : రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసినప్పటి నుంచి జిల్లాలో భూముల ధరలు పెరుగుతూ వచ్చాయి. రాష్ట్ర విభజన పూర్తి కావటంతో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. దానికి తోడు జిల్లాకు సమీపంలో రాజధాని ఏర్పాటు కానుందనే ఊహాగానాలు భూముల ధరల బూమ్‌కు కారణమయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచే వ్యవసాయ, ఇతర భూముల ధరలు పెరుగుతూ వచ్చాయి. జిల్లా సరిహద్దులోని హనుమాన్ జంక్షన్లో ఎకరం భూమి విలువ రూ. కోటి పై మాటే. వట్లూర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో గ్రామాల్లోను ఎకరం రూ.75 లక్షలు పలుకుతోంది. ధరలు విపరీతంగా పెరగటంతో భూములు కొనేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. జిల్లాలో భూములకు సంబంధించి నెలకు సగటున 12 వేల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఆ సంఖ్య ఏడు వేలు కూడా దాటటం లేదు. రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోవడంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్(ఏప్రిల్, మే, జూన్ నెలలు)కు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ భీమవరం జిల్లా పరిధిలో రూ.42 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా కేవలం రూ.27 కోట్లే సమకూరింది. ఏలూరు జిల్లా కార్యాలయం పరిధిలో రూ.27 కోట్లు లక్ష్యం కాగా రూ.16 కోట్లు మాత్రమే వచ్చింది. గత ఏడాది లక్ష్యంలో 57 శాతమే ఆదాయం 2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లా మొత్తం సుమారు 1.20 లక్షల భూముల క్రయవిక్రయాల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతాయని అంచనా కాగా 80 వేలు మాత్రం జరిగాయి. మొత్తం రూ.333 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా కేవలం రూ.190 కోట్లు సమకూరాయి. లక్ష్యంలో 57 శాతం మాత్రమే ఆదాయం వచ్చింది. ఈ పరిస్థితికి రాష్ట్ర విభజనే కారణమని అధికారులు పేర్కొంటున్నారు. వారంలో భూముల ప్రభుత్వ విలువ పెంపు వచ్చే నెలలో పట్టణాల్లో భూముల ప్రభుత్వ విలువను రిజిస్ట్రేషన్‌శాఖ సవరించాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వ విలువ , బహిరంగ మార్కెట్ల్లో వాస్తవ విలువను పరిగణనలోకి తీసుకుని భూముల విలువను 30 శాతం పెంచనున్నారు. దీనిపై రిజిస్ట్రేషన్‌శాఖ సేకరించిన వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపింది. వారం రోజుల్లో విలువ పెంపు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవ కాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాజధాని వ్యవహారం తేలితేనే రిజిస్ట్రేషన్లు ఊపందుకుంటాయని రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు భావిస్తున్నారు. -
‘సబ్ రిజిస్ట్రార్’ అవినీతి బాగోతంపై రహస్య విచారణ..?
ఆలంపల్లి, న్యూస్‌లైన్: వికారాబాద్‌లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గత శనివారం జరిగిన లంచాల బాగోతంపై ఆశాఖ ఉన్నతాధికారులు గోప్యంగా విచారణ చేపట్టినట్లు తెలిసింది. విచారణ జరుగుతున్న విషయం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నతాధికారులు విచారణకు వచ్చిన సమయంలో కూడా మధ్యవర్తులు తమ దందాను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించడం గమనార్హం. వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో మధ్యవర్తులు తమ దందా కొనసాగించారు. ఈ తీరును గమనించిన స్థానికులు ఈ అవినీతి బాగోతంలో ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సంఘటన జరిగి వారం కావస్తున్న సబ్ రిజిస్టర్‌పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. -
యథేచ్ఛగా దొంగ రిజిస్ట్రేషన్లు
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : బెజవాడ కేంద్రంగా రియల్ ఎస్టేట్ మాఫియా మోసాలకు పాల్పడుతోంది. దొంగ డాక్యుమెంట్ల తయారీ ముఠాలు తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. విజయవాడలో రెండు బ్యాచ్‌లు యథేచ్ఛగా దొంగ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నాయి. నకిలీ డాక్యుమెంట్లు, బినామీ ఆసాములను సృష్టించి, బోగస్ సాక్ష్యాధారాలతో ఇతరుల ఆస్తులను విక్రయించేసి సొమ్ము తీసుకుని బ్రోకర్లు పరారవుతున్నారు. గన్నవరంలో ఓ ముఠా ఇతరుల ఆస్తి తమదని నకిలీ డాక్యుమెంట్లతో ఓ ఫైనాన్షియర్‌ను మోసగించే ప్రయత్నం చేశారు. అధికారులు అప్రమత్తం కావటంతో ఆగంతకులు పరారయ్యారు. ఇదే తరహాలో గన్నవరంలో గత ఏడాది కాలంలో ఈ ముఠాలు నాలుగైదు బోగస్ రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుస్తోంది. వారి బారినపడివారు లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు సమాచారం. గత ఏడాది విజయవాడ గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ డాక్యుమెంట్లతో ఒకరికి రిజిస్ట్రేషన్ కూడా చేసేశారు. పోయిన సంవత్సరం నున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని ఓ ఆస్తిని దొంగ కాగితాలతో రిజిస్ట్రేషన్ చేశారు. రెండేళ్ల క్రితం ఆత్కూరుకు చెందిన ఓ రైతు పాలాన్ని విజయవాడలో ఓ పారిశ్రామికవేత్తకు గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ డాక్యుమెంటుతో సేల్ డీడ్ రాసి రూ.10 లక్షలతో ఉడాయించారు. రైతు తన భూమిని విక్రయించాలని కోరుతూ రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు పొలం డాక్యుమెంట్ ఫొటోస్టాట్ కాపీ ఇచ్చారు. దాని ఆధారంగానే బినామీ వ్యక్తులు పొలాన్ని విక్రయించేశారు. గన్నవరం పరిధిలో అధికంగా మోసాలు.. గన్నవరం ప్రాంతంలో ఐటీ పార్కు, విమానాశ్రయం కారణంగా రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భూముల ధరలకు రెక్కలు రావటంతో ఇక్కడి ఆస్తులపై మోసాలు అధికంగా జరుగుతున్నాయి. విజయవాడలో పలువురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు నకిలీ డాక్యుమెంట్ల తయారీలో సిద్ధహస్తులైన వ్యక్తులను అడ్డం పెట్టుకుని నకిలీ స్టాంపులు తయారుచేయిస్తున్నారు. వాటిద్వారా డాక్యుమెంట్లు రాయించి జనాన్ని మోసం చేస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో, గన్నవరం, నున్న, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, కంకిపాడు తదితర ప్రాంతాలలో వందలాది వెంచర్లు ఉండటంతో ఈ తరహా మోసాలు అధికమవుతున్నాయి. మోసపోయినవారు కేసులు కూడా పెట్టడం లేదు. ఆన్‌లైన్‌తో చెక్.. మరోపక్క రిజిస్ట్రేషన్స్ శాఖలో ఆన్లైన్ విధానం అమలులోకి వచ్చింది. ఈ విధానం పూర్తిస్థాయిలో వాడుకలోకి వస్తే బోగస్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టవచ్చని అధికారులు అంటున్నారు. వేలిముద్రలు, ఫొటోలు కూడా ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లో రావటం వల్ల భవిష్యత్తులో నకిలీల బెడద తగ్గుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు రియల్ మాఫియా విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.