Adhi narayana reddy
-
కమలం గూటికి..
సాక్షి, కడప : అధికారం ఎక్కడ ఉంటే మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి అక్కడే ఉంటారన్న ప్రచారం మరోసారి నిజమైంది. ఆయన సోమవారం ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ జాతీయ నాయకుల చేతుల మీదుగా ఆది ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. టీడీపీ అధికారం కోల్పోయిన వెంటనే ఆది బీజేపీలో చేరుతారన్న ప్రచారం సాగినా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అడ్డుకోవడంతో ఆలస్యమైంది. నైతిక విలువలను ఏమాత్రం పట్టించుకోరని ఆది రా జకీయ శైలి చెబుతుంది. దివంగత నేత వైఎస్ అధికారంలో ఉన్నంతకాలం ఆయనవద్దే ఉన్నారు. తరువాత టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసిన వైఎస్ జగన్‌ను కాదని చంద్రబాబు పంచన చేరారు. అధికారం పోయాక ఇప్పుడు బాబును వదిలేశారు. జగన్ పార్టీ ఎలాగూ పార్టీలో చేర్చుకోరని తెలియడంతో బీజేపీలో చేరిపోయారు. ఆలస్యం.. టీడీపీలో చేరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతతోపాటు ఆ పార్టీ నేతలపై అవాకులు చెవాకులు పేలారు. అవికాస్తా వికటించాయి. జమ్మల మడుగుతోపాటు కడప పార్లమెంటరీ ఓటర్లు గట్టిగా సమాధానం చెప్పారు. కొంతకాలంగా టీడీపీ అధినేత సూచనలతో బీజేపీలో చేరేందుకు మాజీ మంత్రి సిద్ధమయ్యారు. అయితే పరిణామాలు అనుకూలించలేదు. వివిధ చర్చల నేపథ్యంలో ఎట్టకేలకు ఆలస్యంగా బీజేపీలో చేరగలిగారు. అనుచరగణమెవరూ బీజేపీలో చేరేందుకు సుముఖంగా లేరు. ముఖ్య అనుచరులు, సమీప బంధువులుకూడా ఆయనతో కలిసి నడిచేందుకు ఇష్టపడడంలేదు. అధికారం లేకపోతే ఆయన ఉండలేరని ఆయన ధోరణి తెలిసినవారంతా చెబుతారు. ఫ్యాక్షన్ రాజకీయాలను నడిపేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్వార్ధం కోసం కింద క్యాడర్ ఏమైపోయినా పట్టించుకోరు. ఇప్పుడు ఆది మరోమారు తన సహజ రాజకీయ స్వభావాన్ని చాటుకున్నారు. దివంగత నేత వైఎస్ అనుచరుడిగా 2004,2009లో జమ్మలమడుగునుండి ఎన్నికయ్యారు. తరువాత జగన్మోహన్రెడ్డి టీంలో 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ కుటుంబానికి జమ్మల మడుగు నియోజకవర్గంతో బలమైన అనుబంధం ఉంది. గెలుపోటములు నిర్దేశించేది వైఎస్ కుటుంబ అభిమానులే. గెలిచాక పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన జనం ఆయనకు గుణపాటం నేర్పారు. జమ్మలమడుగులో ఆయన బలపర్చిన సుబ్బారెడ్డిని ఓడించారు. కడప ఎంపీగా పోటీచేసి పరాజయం మూటగట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్ దగ్గరకు రానిచ్చే అవకాశం లేకపోవడంతో టీడీపీ షెల్టర్ జోన్‌గా సెలక్ట్ చేసిన బీజేపీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మనుగడకోసం తంటాలు పడుతున్న టీడీపీ నేతలకు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారింది. చంద్రబాబే కీలక నేతలందరినీ బీజేపీలోకి పంపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఇదే పంథాలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆదినారాయణరెడ్డి వంతయింది. ఇన్నాళ్లు పార్టీలో అన్నిరకాల పదవులు అనుభవించి నేతలు పార్టీని వీడి వెళుతున్నా టీడీపీ నేతలెవరూ విమర్శిస్తున్న దాఖలాలు లేవు. దీన్నిబట్టి మ్యాచ్ పిక్సింగ్ వ్యవహారం ఇప్పుడు జనంలో హాట్ టాపిక్ గా మారింది. బాబు మ్యాచ్ పిక్సింగ్ -
పార్టీ మారినా.. ఆగని నాయకుల వర్గపోరు
సాక్షి, కడప : టీడీపీని వీడి బీజేపీలో చేరాలనుకున్న మాజీమంత్రి ఆదినారాయణరెడ్డికి భంగపాటు ఎదురవుతోంది. ఆయన చేరికయత్నాలను రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వ్యతిరేకిస్తున్నారు. టీడీపీకి గుడ్‌బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరిన సీఎం రమేష్ మాజీ మంత్రి రాకుండా అడ్డుపడుతున్నట్లు తెలిసింది. రమేష్ ధోరణి వల్లే బీజేపీలో ఆది చేరిక వాయిదా పడుతున్నట్లు సమాచారం. పార్టీలో చేరక ముందే మొదలైన ఈ రచ్చ జిల్లా బీజేపీ నేతలకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. సీఎం రమేష్‌ను కాదని ఆదిని పార్టీలో చేర్చుకున్నా ఇరువురి ఆధిపత్య పోరు కమలం పార్టీకి ఇబ్బందులు తేవడం ఖాయమని ఆ పార్టీనేతలు భావిస్తున్నారు. ఇదే జరిగితే టీడీపీ తరహాలో బీజేపీ జనంలో పలచన అవుతుందని ఆందోళన చెందుతున్నారు. తొలినాళ్లనుంచే ప్రత్యర్థులే.. టీడీపీలో ఉంటున్నప్పుడు సీఎం రమేష్‌కు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డితో సత్సంబంధాలు లేవు. జిల్లాలో ఆదిపత్యం కోసం ఇరువురు సై అంటే సై అనేవరకూ వచ్చింది. దీంతో టీడీపీ పరువు బజారుకెక్కింది. సీఎం రమేష్‌ను టీడీపీలో అడ్డుకునేందుకు ఆది శతవిధాల ప్రయత్నించారు. కొత్తగా చేరిన ఆది పెత్తనాన్ని వ్యతిరేకించిన రమేష్ అడుగడుగునా అడ్డుపడ్డారు. కాంట్రాక్ట్ పనులు ..ఉపాధి నిధుల పంపిణి, నీరు చెట్టు పనుల కేటాయింపుతో మొదలు గత ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల కేటాయింపు వరకూ ఇరువురి మద్య పోరు నడిచింది. చంద్రబాబు స్థాయిలో చక్రం తిప్పిన సీఎం రమేష్ ఆదికి దాదాపు అడ్డకట్ట వేశారని టీడీపీ శ్రేణులు చెబుతాయి. గత ఎన్నికల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ తనకే కావాలంటూ ఆది పట్టుబట్టగా సీఎం రమేష్ అడ్డుపడ్డారు. రామసుబ్బారెడ్డి పేరును ఖరారు చేసేందుకు పావులు కదిపారు. తరువాత ఆదిని పార్లమెంట్ నుండి పోటీచేయించేందుకు సిద్దపడేలా చేశారు. తాను కడప పార్లమెంట్‌కు పోటీ చేయాలంటే అసెంబ్లీ స్థానాలు తాను చెప్పిన అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని ఆది పట్టుబట్టారు. ప్రధానంగా ప్రొద్దుటూరు,కమలాపురం,మైదుకూరు,కడప తదితర స్థానాలు తాను సూచించినవారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీకోసం పనిచేసిన వారికే టికెట్ ఇవ్వాలని రమేష్ ఆది ప్రతిపాదనకు అడ్డుపడ్డారు. గతంలో ఇరువురి మధ్య వివాదాలు పతాక స్థాయికి చేరాయి గత ఎన్నికల్లో టీడీపీఘోర పరాభవం పొందిన నేపథ్యంలో అధికారం లేకుండా మనుగడ సాగించలేమని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ భావించారు. టీడీపీకి గుడ్‌బై చెప్పి ఇటీవలే బీజేపీలో చేరారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిదీ ఇదే పరిస్థితి. వైఎస్సార్సీపీ లో చేర్చుకునే పరిస్థితి లేకపోవడంతో బీజేపీ మినహా మరోమార్గం లేదని ఆయన భావించారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆశీస్సులతో బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు. పలుమార్లు బీజేపీ నేతలను కలిశారు. తాజాగా గురువారం ఢిల్లీకి వెళ్లి పార్టీ ముఖ్యనేత సమక్షంలో ఆది పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఆది బీజేపీలో చేరలేపోయారని చర్చ నడుస్తోంది. ఆయన్ను బీజేపీ లోకి రాకుండా సీఎం రమేష్ అడ్డు పడుతున్నారని ప్రచారం గుప్పుమంది. ఆది వస్తే మళ్లీ ఆదిపత్య పోరాటం తప్పదని.. ముందే. అడ్డుకోవడం మేలని భావించిన సీఎం రమేష్ అందుకు అనుగుణంగా పావులు కదిపినట్లు భోగట్టా. ఆది కడపలో శనివారం బీజేపీలో చేరేఅ వకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆది చేరికపై సీఎం రమేష్ అభ్యంతరం చెబుతున్న నేపథ్యంలో బీజేపీకి తలనొప్పులు ఖాయమని ఆ పార్టీ నాయకులు కలవరపడుతున్నట్లు తెలిసింది. ఇలాంటి నేతలను పార్టీలోకి తెచ్చుకొని పార్టీని బలోపేతం చేసుకోవడం అటుంచితే ముక్కలు చేసుకున్నట్లు అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అడ్డు తొలగించుకోవాలనే హత్య
‘ఎన్నికల్లో గెలవడానికి ఆదినారాయణరెడ్డికి మా నాన్న అడ్డంకిగా కనిపించారు. అడ్డు తొలగిస్తే తప్ప గెలవలేమని ఆదినారాయణరెడ్డి భావించారు. ఈ విషయాన్ని సిట్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా.. ఇప్పటివరకూ ఆదినారాయణరెడ్డిని మాత్రం విచారణ చేయలేదు. మా కుటుంబ సభ్యులను మాత్రం పదేపదే విచారిస్తున్నారు. మా నాన్న వైఎస్ వివేకా హత్యతో పరమేశ్వరరెడ్డి పాత్ర ఉంది. నాన్న చనిపోయి ఇన్నిరోజులైనా.. వాస్తవాలను ఎందుకు బయటపెట్టడం లేదు. మా బంధువులను అదుపులోకి తీసుకుని పది రోజులైంది. మాకున్న అనుమానాలపై అధికారులకు వివరాలు ఇచ్చినా.. ఆ దిశగా విచారణ చేయడం లేదు. పోయింది మా మనిషే. పైగా మా మీదే నింద పడింది. నాన్న చనిపోయాడని నేను, చిన్నాన్న చనిపోయాడని జగన్ అన్న బాధలో ఉంటే సానుభూతి వదిలేసి నిందలు వేయడం న్యాయమా?. నిజంగా నాన్న హత్యకేసులో మా కుటుంబంలోని వ్యక్తికే సంబంధం ఉంటే.. చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు బయట పెట్టకుండా ఆగేవారా?’ –హైదరాబాద్‌లో మీడియాతో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి చంద్రబాబు చేతిలో నిలువునా మోసపోయా మాయమాటలు నమ్మి.. టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో నిలువునా మోసపోయా. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని.. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని నమ్మించి నన్ను టీడీపీలో చేర్చుకున్నారు. చివరకు మోసగించారు. అన్నదమ్ముల్లా ఉండే మాల–మాదిగల మధ్య చిచ్చుపెట్టిన చరిత్ర చంద్రబాబుది. ఈ రాష్ట్రంలో మాదిగలు సభలు జరుపుకోకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. ఎంఆర్పీఎస్ సభకు అనుమతివ్వాలని స్వయంగా నేనే వెళ్లి చంద్రబాబును అడిగా. ఇచ్చే ప్రసక్తే లేదని నాపై సీరియస్ అయ్యారు. నా దగ్గర డబ్బులేదనే టీడీపీ టికెట్ ఇవ్వలేదు. సామాన్యులకు టికెట్ ఇచ్చే గొప్ప వ్యక్తి వైఎస్ జగన్. అందుకు నిదర్శనం బాపట్ల పార్లమెంట్ సీటు పేదవాడైన నందిగం సురేశ్‌కు టికెట్ ఇవ్వడమే. ఎమ్మెల్యేను చేసిన పార్టీని కాదని టీడీపీలో చేరి పెద్ద తప్పు చేశా.’ –ఒంగోలులో మీడియాతో యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు -
జయరాములు, ఆదిలకు మొండి చేయి
సాక్షి ప్రతినిధి కడప: అధికారపార్టీ ప్రోత్సాహంతో జిల్లాలో బద్వేల్, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు జయరాములు, ఆదినారాయణరెడ్డిలు గతంలో పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారు. ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారు టీడీపీ సైకిల్ ఎక్కారు. ఆపై వారిచేత ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వంపై విమర్శల దాడి చేయించారు. నిస్సిగ్గుగా ఫిరాయింపులకు పాల్పడి నైతికతను విస్మరించి ఆదరించిన పార్టీకి ద్రోహం తలపెట్టారు. యూజ్ అండ్ త్రో పాలసీ బాగా వంటబట్టిన టీడీపీ అధినేత ఇప్పుడు వారిని దూరం పెడుతున్నారు. దీంతో వారి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా ఉత్పన్నమైంది.ఇంటికూడు...దోవ కూడు లేకుండా పోతున్న పరిస్థితితలెత్తింది. పరిగణలోనే లేని జయరాములు.... బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు పేరును పరిగణలోకి తీసుకోకుండానే టీడీడీ అధినేత అభ్యర్థిత్వాల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి విజయం సాధించినా 2019లో నాటికి ఆయన్ను డమ్మీగా మార్చేశారు. జయరాములు టీడీపీలో చేరాక బద్వేల్ ఇన్‌ఛార్జి మాజీ ఎమ్మెల్యే విజయమ్మతో సఖ్యత లోపించింది. తనతో తలపడి ఓటమిచెందిన ఎన్డీ విజయజ్యోతితో జట్టుకట్టారు. ఇరువురు కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. విజయమ్మతో నిమిత్తం లేకుండా ఇరువురిలో ఒకరికి టికెట్ కేటాయించాలని వారు సంయుక్తంగా కోరారు. దాంతో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఈ ఇద్దరిపై వ్యతిరేకత పెంచుకున్నారు. ఇరువుర్నీ సమానదూరంలో పెట్టినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఎంపిక జయరాములు పేరు కనీసం పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పటి వరకూ విజయజ్యోతి, లాజరస్, డాక్టర్ రాజశేఖర్ పేర్లను పరిశీలించారు. విజయజ్యోతికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆశీస్సులు లేవు. డాక్టర్ రాజశేఖర్, లాజరస్‌లను మాజీ ఎమ్మెల్యే ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. విజయజ్యోతికి విజయమ్మ ఆశీస్సులు లేకుండా టికెట్ ఇవ్వడం కష్టమని తేల్చి చెప్పినట్లు సమాచారం. గుడ్డిలో మెల్లలా మంత్రి ఆది.... ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్లు కేటాయించేందుకు చంద్రబాబు నిరాకరించారు. మరో ఫిరాయింపు ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు అభ్యర్థిత్వం ఆశించి భంగపడ్డారు. కడప పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. 1989 నుంచి ఇప్పటివరకూ వరుసగా టీడీపీ ఓటమి చవిచూస్తోంది. కడప ఎంపీగా వైఎస్ కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఓడిపోయే సీటును ఫిరాయింపు ఎమ్మెల్యేగా చరిత్రకెక్కిన ఆదినారాయణరెడ్డిని ఎంపిక చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే మంత్రి ఆదిని రాజకీయంగా బలి చేయడమేనని విశ్లేషకులంటున్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థిత్వం దక్కిందనే చెప్పుకోవడం మినహా ఆదిలో నిస్సత్తువ ఆవహించిందని తెలిసింది. సొంత పార్టీలో కాలర్ ఎరగేసుకొని సహచర ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన హీన చరిత్ర మూటగట్టుకున్న ఇద్దరూ ఇప్పుడు చంద్రబాబు వంచనతో రాజకీయంగా బలవుతున్న దుస్థితి నెలకొంది. -
‘ఇసుక, మట్టితో సహా అన్నీ తినేశారు’
సాక్షి, హైదరాబాద్ : కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడే అర్హత మంత్రి ఆది నారాయణరెడ్డికి లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. కడప స్టీల్ ప్లాంట్‌పై ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ నేతలు నాలుగేళ్లుగా ఇసుక, మట్టితో సహా అన్ని తినేశారని, తిన్నది అరగక దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు వెన్నుపోట్లు, బ్లాక్మెయిల్ రాజకీయలు తప్ప మరొకటి తెలియదని ఆరోపించారు. నాలుగేళ్లలో విభజన హామీలపై ఎప్పుడైనా మాట్లాడారా అని శ్రీనివాసులు ప్రశ్నించారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, హోదా కోసం వైఎస్సార్సీపీ నిరంతర పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. -
న్యాయం గెలిచింది
ఎమ్మెల్యే ఆది జమ్మలమడుగు: జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికలో చివరకు ధర్మం పలకడంతో న్యాయం గెలిచిందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మున్సిపల్ ైఛైర్పర్సన్ ఎన్నిక అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కై ఎన్నికను రెండు సార్లు వాయిదా వేయించారన్నారు. టీడీపీ నాయకులు పట్టణంలో బీభత్సం సృష్టించారన్నారు. గత రెండు నెలలనుంచి మున్సిపల్ కౌన్సిలర్లకు భద్రత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. చివరకు న్యాయం గెలిచి తమ సోదరి టి. తులసి ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం కూడా ప్రతిపక్ష పార్టీలు గెలుపొందిన మున్సిపాలిటీలకు నిష్పక్షపాతంగా నిధులు విడుదల చేయాలని కోరారు. అలా కాకుండా ఉంటే అసెంబ్లీలో తమ వాణిని గట్టిగా వినిపించి పోరాటం చేస్తామన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీల చైర్మన్ పదవులతో పాటు, ఐదు మండలాలు, ఆరు జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకోవడాన్ని బట్టి ప్రజలందరూ తమవైపే ఉన్నారని వివరించారు. భయాందోళనకు గురిచేశారు- ఎంపీ అవినాష్‌రెడ్డి మున్సిపల్ ైఛైర్పర్సన్ ఎన్నిక కోసం ఈనెల 3వతేదీన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన తనపై కూడా టీడీపీ కార్యకర్తలు ,నాయకులు రాళ్లదాడి చేశారని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. అలాగే కౌన్సిల్ హాల్లో కారం పొడి చల్లి భయోత్పాతం సృష్టించారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో వైఎస్సార్సీపీ అత్యధికంగా జెడ్పీటీసీ స్థానాలతోపాటు, మండలాలు, మున్సిపాలిటీల్లో విజయం సాధించిందని చెప్పారు. అయితే ఎర్రగుంట్లలో తమ పార్టీకి చెందిన 8 మంది కౌన్సిలర్లను అధికార పార్టీ నాయకులు బలవంతంగాతీసుకెళ్లారన్నారు. అయినప్పటికీ ఛైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులను తామే గెలుచుకున్నామన్నారు. రాష్ట్రంలో టీడీపీ అరాచకాలు ఎక్కువయ్యాయని, దీనిపై కలిసికట్టుగా పోరాడుతామని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులపై జరుగుతున్న దాడులను రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. -
అ‘టెన్షన్’!
అధికార పార్టీనేతల నిర్వాకంకారణంగా రెండు పర్యాయాలువాయిదా పడిన జమ్మలమడుగుమున్సిపల్ ఛైర్మన్ ఎన్నికనుమూడోసారి నిర్వహించేందుకుఅధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ దఫానిర్వహిస్తున్న ఎన్నిక ఏమలుపు తిరుగుతుందోననిసర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జమ్మలమడుగు: జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఈ ఎన్నిక ఏక్షణాన ఏ మలుపు తిరుగుతుందోనని ప్రతి ఒక్కరూఆసక్తిగా గమనిస్తున్నారు. మే నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 9 స్థానాల్లో, టీడీపీ 11స్థానాల్లో విజయం సాధించింది. అయితే స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ ఓటునుఇక్కడే వినియోగించుకుంటుండటంతో రెండు పార్టీలకు సమానంగా 11 మంది సభ్యులున్నట్లయింది. దీంతో ఈనెల 3వతేదీన లాటరీ పద్ధతిలో ఛైర్మన్, వైస్ఛైర్మన్లను ఎన్నుకునేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.అనూహ్యంగా ఒకటో వార్డుకు చెందిన టీడీపీ కౌన్సిలర్ముల్లాజానీగైర్హాజరు కావడంతో టీడీపీ శ్రేణులుతమ కౌన్సిలర్‌ను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా ప్రిసైడింగ్ అధికారి ఎన్నిక 4వతేదీకి వాయిదావేశారు. అయితేకనిపించకుండా పోయిన కౌన్సిలర్ జానీ ప్రిసైడింగ్‌అధికారితో నేరుగా ఫోన్లో మాట్లాడి తనను ఎవరూకిడ్నాప్ చేయలేదని చెప్పారు. 4వతేదీ ఎన్నిక జరుగుతుందని అందరూ భావించారు. కోరం ఉన్నప్పటికీప్రిసైడింగ్ అధికారి తనకు ఆరోగ్యం సరిగా లేదని,తాను ఎన్నిక నిర్వహించలేనని చేతులు ఎత్తేయడంతోరెండో రోజుకూడా వాయిదాపడింది. దీంతో ఎన్నికల కమిషన్‌ఈనెల 13వతేదీన మున్సిపల్‌ై చెర్మన్, వైస్చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తామని ప్రకటించింది.అయితే ఒకటో వార్డుకు చెందిన కౌన్సిలర్‌ముల్లాజానీ ఓటును పరిగణలోనికి తీసుకోకూడదనిఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కోర్టును ఆశ్రయించారు.దీంతో కోర్టు జానీ ఓటును పరిగణలోనికి తీసుకోకూడదని తీర్పునిచ్చింది. అయితే శనివారం తిరిగి టీడీపీనాయకులు హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఈ తీర్పుపై స్టే విధించింది. ఒక వైపేమోప్రిసైడింగ్ అధికారి రామారావు తాము ముల్లా జానీఓటును పరిగణలోనికి తీసుకోమని చెప్పారు. తిరిగిఆ తీర్పుపై కోర్టు స్టే విధించడంతో అధికారులు ఏ విధంగానిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగామారింది.పకడ్బందీగా ఏర్పాట్లుఅధికార పార్టీ నేతలు, అధికారుల నిర్వాకంకారణంగా వాయిదా పడిన జమ్మలమడుగుమున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు ఆదివారం నిర్వహించనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈనెల 3వ తేదీన మున్సిపల్ ఛైర్మన్ , వైస్‌ఛైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ ప్రిసైడింగ్అధికారిగాఉన్న ఆర్డీఓ రఘునాథరెడ్డి చేతులెత్తేయడంతో వాయిదా పడ్డాయి. దీంతో ఎన్నికలకమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం తిరిగిమూడోసారి ఈ ఎన్నిక నిర్వహించనున్నారు.ప్రస్తుతం ప్రిసైడింగ్ అధికారిగా జిల్లాజాయింట్ కలెక్టర్ రామారావుతో పాటు,పరిశీలకునిగా ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్‌ను నియమించారు. వీరి పర్యవేక్షణలో పకడ్బందీగా ఎన్నిక నిర్వహించేందుకు కసరత్తుచేస్తున్నారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను రెండుసార్లు నిర్వహించిన సమయంలోనూ టీడీపీకిచెందిన నాయకులు, కార్యకర్తలు మున్సిపల్కార్యాలయంపై దాడి చేయడంతోపాటుపోలీసులపై రాళ్లు విసిరారు. ఈ సంఘటనలోకొంత మందికి గాయాలయ్యాయి. తిరిగిఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండామున్సిపల్ కార్యాలయం చుట్టూ బారికేడ్ల నిర్మాణంతో పాటు రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదలమధ్య ఉన్న రాళ్లను పొక్లెయిన్లతో తొలగించేకార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా కౌన్సిల్హాల్లో ఇరుపార్టీలకు చెందిన కౌన్సిలర్లు గొడవలకు దిగకుండా మధ్యలో టీడీపీ, వైఎస్సార్సీపీ, ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేక గ్యాలరీలనుఏర్పాటు చేశారు.జమ్మలమడుగులోనే ఎస్పీ, ఇన్చార్జి కలెక్టర్ఆదివారం జరిగే మున్సిపల్ ఛైర్మన్, వైస్ఛైర్మన్ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు ఇన్‌చార్జికలెక్టర్, ఎస్పీలు జమ్మలమడుగులో తిష్ట వేయనున్నారు. ఇప్పటికే రెండు సార్లు మున్సిపల్‌పాలక వర్గానికి సంబంధించిన ఎన్నికవాయిదా పడటంతో ఇకపై వాయిదా పడకుండా, ఎలాంటి గొడవలు జరగకుండాఉండేందుకు కలెక్టర్, ఎస్పీలు పట్టణంలోఉండి స్వయంగా ఎన్నికలు, శాంతిభద్రతలనుపర్యవేక్షించనున్నారు. -
400 చీనీ చెట్లు నరికివేత
సాక్షి, అనంతపురం : యల్లనూరు మండలంలో టీడీపీ అగడా లు రోజురోజుకు పెచ్చు మీరుతున్నాయి. బుధవారం రాత్రి 6 గంటలకు మండలంలోని అచ్చుతాపురానికి చెందిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీ లక్ష్మిదేవమ్మకు చెందిన తోటలో 400 చీనీ చెట్లను గొడ్డళ్లతో నరికి వేశారు. తొమ్మిది గంటల సమయం లో కరెంట్ రావడంతో ఎంపీటీసీ లక్ష్మిదేవమ్మ భర్త ఆదినారాయణరెడ్డి చీనీ చెట్లుకు నీరు పెట్టడానికి వెళ్లి.. జరిగిన దారుణాన్ని గుర్తించారు. అక్కడ నరికి వేతకు గురై చిందరవందరగా పడి ఉన్న పచ్చని చీనీ చెట్లను చూసి హతాశులయ్యారు. దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించారు. కంటి పాపల్లా కాపాడుకున్న చెట్లను నరికి వేయడానికి వారికి మనసెలా వచ్చిందంటూ రోదించడం మినహా ఏమీ చేయలేని నిస్సహా య స్థితిలో ఉండి పోయారు. పోలీసులుకు ఫిర్యాదు చేయడం తో వారు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశా రు. మండలంలో తమ ఆధిపత్యం నిరూపించుకోవడానికీ వైఎస్సాసీపీకి చెందిన కార్యకర్తల పచ్చని చెట్లను తెలుగు తమ్ముళ్లు తెగ నరుకుతున్నారు. గత నెల వెన్నపూసలపల్లికి చెందిన రాజేశ్వరిరెడ్డిపై దాడి చేసి తీవ్రంగా గాయపర ్చడమేగాక, అతని పొలంలోని పచ్చని చెట్ల పొదల్లో కిరోసిన్ పోసి వాటిని మొదళ్లను తుంచి వేశారు. ఆ వెంటనే పెద్ద మలేపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తకు చెందిన చెట్లను గొడ్డళ్ల తో నరికి నేల మట్టం చేశారు. ఈ సంఘటలనలతో భీతిల్లిన ప్రజలు, ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడుతుండగానే, టీడీపీ నాయకులు మరోసారి రెచ్చిపోయారు. యల్లనూరులో లాటరీ పద్ధతిలో మద్యం షాపు దక్కించుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు సుదర్శన్‌నాయుడు, అదే గ్రామంలో ప్రకాశం శె ట్టి భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. భవనాన్ని అద్దెకివ్వడా న్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు అక్కసుతో ఇంటికి వస్తున్న ప్రకాశం శెట్టిని దారిలో కాపు కాచి అతి కిరాతకంగా నరికి వేశా రు. ఆ భయానక సంఘటనతో మండల ప్రజలు, జిల్లా ప్రజ లు మరువకనే టీడీపీ గుండాలు మరొసారి పేట్రేగిపోయారు. -
మాకు రక్షణ కల్పించండి
జిల్లా కలెక్టర్, ఎస్పీలను కోరిన కౌన్సిలర్లు, ఎంపీటీసీలు కడప కార్పొరేషన్: జమ్మలమడుగు మున్సిపాలిటీకి, మండల పరిషత్‌కు ఎన్నిక పూర్తయ్యేవరకూ తమకు రక్షణ కల్పించాలని ఆ మున్సిపాలిటీకి చెందిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు కోరారు. ఆదివారం 9మంది కౌన్సిలర్లు, 22 మంది ఎంపీటీసీలు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ కె.సురేష్‌బాబు, జెడ్పీ ఛెర్మైన్ గూడూరు రవి, జమ్మలమడుగు, మైదుకూరు, కడప ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, రఘురామిరెడ్డి, అంజద్‌బాషాలతో కలిసి జిల్లా కలెక్టర్ కె. శశిధర్, ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్‌లను వారి బంగళాలలో కలిశారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 3, 4 తేదీలలో జమ్మలమడుగు మున్సిపాలిటీ ఎన్నికలో చోటు చేసుకొన్న సంఘటనలను వివరించారు. కౌన్సిలర్ జానీ ఉద్దేశపూర్వకంగానే ఎన్నికకు దూరమయ్యాడని చెప్పారు. ఇదే అదనుగా భావించిన టీడీపీ నేత రామసుబ్బారెడ్డి 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ రెండు వేలమందితో వ చ్చి అల్లర్లు సృష్టించారని, నాటుబాంబులు కూడా విసిరారన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి తాము 11 మంది, టీడీపీ సభ్యులు 10 మంది ఎన్నికలో పాల్గొన్నారన్నారు. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగి కోరం ఉన్నప్పటికీ అధికారులు ఎన్నిక జరపలేదన్నారు. సాయంత్రం వరకూ నాన్చి 4వ తేదీకి వాయిదా వేశారన్నారు. 4వ తేదీ కూడా 3 వేలమంది టిడీపీ నాయకులు ఆర్అండ్బి బంగళా వద్దకు చేరుకొని విధ్వంసం సృష్టించారని తెలిపారు. ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా కౌన్సిలర్ జానీని గోవాలో అదుపులోకి తీసుకున్నామని చెబుతూ సాయంత్రం 7 గంటల వరకూ ఆలస్యం చేశారన్నారు. ఎన్నిక నిర్వహించాల్సి వస్తుందని ఆర్టీవో బీపీ, షుగర్ అంటూ డ్రామా ఆడార ని ధ్వజమెత్తారు. ఈ నెల 13వ తేదీన ఎన్నిక నిర్వహిస్తామంటున్నారు, అప్పటి వరకూ మా కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు ఎవరు రక్షణ కల్పిస్తారని ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు. -
హరహరమహాదేవ..
శ్రీశైలం, న్యూస్‌లైన్ : హరహర మహాదేవ శంభోశంకర అంటూ శ్రీగిరి కొండలు మారుమోగుతున్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో శుక్రవారం దేవేరి భ్రామరీ సమేతంగా మల్లికార్జునస్వామి హంసవాహనంపై దర్శనమిచ్చారు. పంచాక్షరి ప్రణవనాదంతో ఇరుముడులను తలపై ఉంచుకుని శ్రీశైలం చేరుతున్న శివస్వాములు గ్రామోత్సవంలో దర్శనమిచ్చిన స్వామివార్లను చూసి తరించారు. అక్కమహదేవి అలంకార మండపంలో రాత్రి 7గంటలకు హంసవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక అలంకారపూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన వాహనపూజలకు దర్మకర్తలమండలి చైర్మన్ ఆల్తూరి ఆదినారాయణరెడ్డి, ఈవో చంద్రశేఖర ఆజాద్, ఆలయ ఏఈఓ రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు. మంగళవాయిద్యాలు మారుమ్రోగుతుండగా, భక్తులు పంచాక్షరినామ స్మరణ చేస్తున్న సమయాన హంసవాహనాధీశులైన స్వామివార్లను ఆలయప్రదక్షిణ చేయించి ఆలయప్రాకార ప్రధాన రాజగోపురం గుండా రథశాల వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత నారికేళాన్ని సమర్పించి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. పధాన పురవీధిలోని అంకాలమ్మగుడి, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు ఈ గ్రామోత్సవం జరిగింది. అక్కడి నుంచి నేరుగా స్వామిఅమ్మవార్ల ఆలయప్రాంగణం చేరుకుంది. వేలాది మంది భక్తులు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను కనులారా దర్శించుకుని కర్పూరనీరాజనాలనర్పించారు. కార్యక్రమంలో ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మనప్ ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు, ఈఈ రమేష్, హార్టికల్చరిస్ట్ ఏడీ ఈశ్వరరెడ్డి, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, నాగభూషణం, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. -
ఫలించిన వైఎస్ కృషి
జమ్మలమడుగు/కొండాపురం,న్యూస్‌లైన్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక అయిన గండికోట జలాశయంలోనికి నీరు తెచ్చి జిల్లాతోపాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని రైతులకు సాగు,తాగునీరు అందించేందుకు చేసిన కృషి నేటికి ఫలించిందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం గండికోటనుంచి మైలవరానికి రెండు టీఎంసీలనీరు విడుదల చేయాలంటూ ప్రభుత్వం నుంచి జీఓ రావడంతో ఎమ్మెల్యే ఆది చేత నీటిపారుదలశాఖాధికారులు నీటివిడుదల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మూడుగేట్లను స్వీచ్ఆన్చేసి ఎత్తించారు. అనంతరం ఆయన విలేకరులతోమాట్లాడుతూ జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో రైతులు వేసిన పంటలు ఎండిపోతుండటంతో రైతుల పంటలను కాపాడటానికి మైలవరం జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని కోరామన్నారు. అయితే వేసవిలో తాగునీటికోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం నీటిని నిల్వ ఉంచామని కలెక్టర్ వివరించారన్నారు. దీంతో ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి కృష్ణా జలాలను గండికోటకు రప్పించే ప్రయత్నం చేశామన్నారు. అందులో భాగంగానే గండికోటలో ఉన్న 2.98 టీఎంసీలో రెండు టీఎంసీల నీటిని మైలవరం జలాశయంలోకి విడుదల చేశామన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ముంపువాసులకు కొంత ఉపశమనం కలుగుతుందన్నారు. కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి తెచ్చుకునేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో ప్రభుత్వం త్వరగా ముంపువాసులకు నష్టపరిహారం చెల్లించి ఇళ్లను ఖాళీ చేయించాలన్నారు. ఇరిగేషన్ అధికారి కె.లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ మూడు గేట్లద్వారా రోజుకు 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్నారు. రెండు టీఎంసీల నీరు మరో 17రోజుల్లో మైలవరానికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఈ జీవనజ్యోతి, మార్కెట్‌యార్డు చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీ శివనాథరెడ్డి,ఎమ్మెల్యే సోదరుడు శివనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ తనయుడు భూపేష్‌రెడ్డి, అంకిరెడ్డి, వాసుదేవరెడ్డి, రేగడిపల్లె సర్పంచ్ పి.వి.నరసింహారెడ్డి, కొమెర్ల మోహన్‌రెడ్డి, గండ్లూరు నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.