జిల్లా కలెక్టర్, ఎస్పీలను కోరిన కౌన్సిలర్లు, ఎంపీటీసీలు
కడప కార్పొరేషన్:
జమ్మలమడుగు మున్సిపాలిటీకి, మండల పరిషత్‌కు ఎన్నిక పూర్తయ్యేవరకూ తమకు రక్షణ కల్పించాలని ఆ మున్సిపాలిటీకి చెందిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు కోరారు. ఆదివారం 9మంది కౌన్సిలర్లు, 22 మంది ఎంపీటీసీలు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ
జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ కె.సురేష్‌బాబు, జెడ్పీ ఛెర్మైన్ గూడూరు రవి, జమ్మలమడుగు, మైదుకూరు, కడప ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, రఘురామిరెడ్డి, అంజద్‌బాషాలతో కలిసి జిల్లా కలెక్టర్ కె. శశిధర్, ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్‌లను వారి బంగళాలలో కలిశారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 3, 4 తేదీలలో జమ్మలమడుగు మున్సిపాలిటీ ఎన్నికలో చోటు చేసుకొన్న సంఘటనలను వివరించారు. కౌన్సిలర్ జానీ ఉద్దేశపూర్వకంగానే ఎన్నికకు దూరమయ్యాడని చెప్పారు.
ఇదే అదనుగా భావించిన టీడీపీ నేత రామసుబ్బారెడ్డి 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ రెండు వేలమందితో వ చ్చి అల్లర్లు సృష్టించారని, నాటుబాంబులు కూడా విసిరారన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి తాము 11 మంది, టీడీపీ సభ్యులు 10 మంది ఎన్నికలో పాల్గొన్నారన్నారు. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగి కోరం ఉన్నప్పటికీ అధికారులు ఎన్నిక జరపలేదన్నారు. సాయంత్రం వరకూ నాన్చి 4వ తేదీకి వాయిదా వేశారన్నారు. 4వ తేదీ కూడా 3 వేలమంది టిడీపీ నాయకులు ఆర్‌అండ్‌బి బంగళా వద్దకు చేరుకొని విధ్వంసం సృష్టించారని తెలిపారు.
ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా కౌన్సిలర్ జానీని గోవాలో అదుపులోకి తీసుకున్నామని చెబుతూ సాయంత్రం 7 గంటల వరకూ ఆలస్యం చేశారన్నారు. ఎన్నిక నిర్వహించాల్సి వస్తుందని ఆర్టీవో బీపీ, షుగర్ అంటూ డ్రామా ఆడార ని ధ్వజమెత్తారు. ఈ నెల 13వ తేదీన ఎన్నిక నిర్వహిస్తామంటున్నారు, అప్పటి వరకూ మా కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు ఎవరు రక్షణ కల్పిస్తారని ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు.
మాకు రక్షణ కల్పించండి
Published Mon, Jul 7 2014 1:37 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM
Advertisement
Advertisement