
సాక్షి, హైదరాబాద్ : కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడే అర్హత మంత్రి ఆది నారాయణరెడ్డికి లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. కడప స్టీల్ ప్లాంట్‌పై ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ నేతలు నాలుగేళ్లుగా ఇసుక, మట్టితో సహా అన్ని తినేశారని, తిన్నది అరగక దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు వెన్నుపోట్లు, బ్లాక్‌మెయిల్ రాజకీయలు తప్ప మరొకటి తెలియదని ఆరోపించారు. నాలుగేళ్లలో విభజన హామీలపై ఎప్పుడైనా మాట్లాడారా అని శ్రీనివాసులు ప్రశ్నించారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, హోదా కోసం వైఎస్సార్‌సీపీ నిరంతర పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment