సాక్షి, అనంతపురం : యల్లనూరు మండలంలో టీడీపీ అగడా లు రోజురోజుకు పెచ్చు మీరుతున్నాయి. బుధవారం రాత్రి 6 గంటలకు మండలంలోని అచ్చుతాపురానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ లక్ష్మిదేవమ్మకు చెందిన తోటలో 400 చీనీ చెట్లను గొడ్డళ్లతో నరికి వేశారు. తొమ్మిది గంటల సమయం లో కరెంట్ రావడంతో ఎంపీటీసీ లక్ష్మిదేవమ్మ భర్త ఆదినారాయణరెడ్డి చీనీ చెట్లుకు నీరు పెట్టడానికి వెళ్లి.. జరిగిన దారుణాన్ని గుర్తించారు. అక్కడ నరికి వేతకు గురై చిందరవందరగా పడి ఉన్న పచ్చని చీనీ చెట్లను చూసి హతాశులయ్యారు. దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించారు.
కంటి పాపల్లా కాపాడుకున్న చెట్లను నరికి వేయడానికి వారికి మనసెలా వచ్చిందంటూ రోదించడం మినహా ఏమీ చేయలేని నిస్సహా య స్థితిలో ఉండి పోయారు. పోలీసులుకు ఫిర్యాదు చేయడం తో వారు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశా రు. మండలంలో తమ ఆధిపత్యం నిరూపించుకోవడానికీ వైఎస్సాసీపీకి చెందిన కార్యకర్తల పచ్చని చెట్లను తెలుగు తమ్ముళ్లు తెగ నరుకుతున్నారు. గత నెల వెన్నపూసలపల్లికి చెందిన రాజేశ్వరిరెడ్డిపై దాడి చేసి తీవ్రంగా గాయపర ్చడమేగాక, అతని పొలంలోని పచ్చని చెట్ల పొదల్లో కిరోసిన్ పోసి వాటిని మొదళ్లను తుంచి వేశారు. ఆ వెంటనే పెద్ద మలేపల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు చెందిన చెట్లను గొడ్డళ్ల తో నరికి నేల మట్టం చేశారు.
ఈ సంఘటలనలతో భీతిల్లిన ప్రజలు, ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడుతుండగానే, టీడీపీ నాయకులు మరోసారి రెచ్చిపోయారు. యల్లనూరులో లాటరీ పద్ధతిలో మద్యం షాపు దక్కించుకున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు సుదర్శన్‌నాయుడు, అదే గ్రామంలో ప్రకాశం శె ట్టి భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. భవనాన్ని అద్దెకివ్వడా న్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు అక్కసుతో ఇంటికి వస్తున్న ప్రకాశం శెట్టిని దారిలో కాపు కాచి అతి కిరాతకంగా నరికి వేశా రు. ఆ భయానక సంఘటనతో మండల ప్రజలు, జిల్లా ప్రజ లు మరువకనే టీడీపీ గుండాలు మరొసారి పేట్రేగిపోయారు.
400 చీనీ చెట్లు నరికివేత
Published Thu, Jul 10 2014 1:47 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement