న్యాయం గెలిచింది
ఎమ్మెల్యే ఆది
జమ్మలమడుగు: జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికలో చివరకు ధర్మం పలకడంతో న్యాయం గెలిచిందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మున్సిపల్ ైఛైర్‌పర్సన్ ఎన్నిక అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కై ఎన్నికను రెండు సార్లు వాయిదా వేయించారన్నారు. టీడీపీ నాయకులు పట్టణంలో బీభత్సం సృష్టించారన్నారు. గత రెండు నెలలనుంచి మున్సిపల్ కౌన్సిలర్లకు భద్రత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. చివరకు న్యాయం గెలిచి తమ సోదరి టి. తులసి ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం కూడా ప్రతిపక్ష పార్టీలు గెలుపొందిన మున్సిపాలిటీలకు నిష్పక్షపాతంగా నిధులు విడుదల చేయాలని కోరారు.
అలా కాకుండా ఉంటే అసెంబ్లీలో తమ వాణిని గట్టిగా వినిపించి పోరాటం చేస్తామన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీల చైర్మన్ పదవులతో పాటు, ఐదు మండలాలు, ఆరు జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకోవడాన్ని బట్టి ప్రజలందరూ తమవైపే ఉన్నారని వివరించారు.
భయాందోళనకు గురిచేశారు- ఎంపీ అవినాష్‌రెడ్డి
మున్సిపల్ ైఛైర్‌పర్సన్ ఎన్నిక కోసం ఈనెల 3వతేదీన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన తనపై కూడా టీడీపీ కార్యకర్తలు ,నాయకులు రాళ్లదాడి చేశారని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.
అలాగే కౌన్సిల్ హాల్‌లో కారం పొడి చల్లి భయోత్పాతం సృష్టించారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ అత్యధికంగా జెడ్పీటీసీ స్థానాలతోపాటు, మండలాలు, మున్సిపాలిటీల్లో విజయం సాధించిందని చెప్పారు. అయితే ఎర్రగుంట్లలో తమ పార్టీకి చెందిన 8 మంది కౌన్సిలర్లను అధికార పార్టీ నాయకులు బలవంతంగాతీసుకెళ్లారన్నారు. అయినప్పటికీ ఛైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవులను తామే గెలుచుకున్నామన్నారు. రాష్ట్రంలో టీడీపీ అరాచకాలు ఎక్కువయ్యాయని, దీనిపై కలిసికట్టుగా పోరాడుతామని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై జరుగుతున్న దాడులను రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.