వేంపల్లె, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలో బుధవారం మధ్యాహ్నం వరకు బిజీబిజీగా గడిపారు. ఉదయం నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో చేయి చేయి కలిపి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్నం 12గంటలవరకు ప్రతి చిన్న కార్యకర్తతో కూడా వివరాలు అడుగుతూ సమస్యలను తెలుసుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో కలిసి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికలలోనూ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో వేంపల్లె మండలంలో మంచి మెజార్టీ సాధించారని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వేంపల్లె నాయకులను అభినందించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వేంపల్లె మండల ఎన్నికల పక్రియను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలోనే వేంపల్లె ఎంపీపీ అభ్యర్థి రవికుమార్‌రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి ఎన్నికలలో వచ్చిన మెజార్టీని తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని జగన్ అభినందించారు.కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీలను వైఎస్ జగన్‌కు పరిచయం చేశారు.
వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు నాయకులు :
గురువారం ఇడుపులపాయలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జిల్లాలోని పలువురు నాయకులు, కార్యకర్తలు కలుసుకున్నారు. కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, మైదుకూరు ఎమ్మెల్యే రఘునాథరెడ్డి, నిత్యానందరెడ్డి వైఎస్ జగన్‌ను కలిశారు. అలాగే చిత్తూరు జిల్లా కాణిపాకంకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున వైఎస్ జగన్‌ను కలిశారు. వారి బాగోగులను జగన్ అడిగి తెలుసుకున్నారు. అలాగే మండలాల కన్వీనర్లు చంద్ర ఓబుళరెడ్డి, రఘునాథరెడ్డి, బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వేంపల్లె ఎంపీపీ అభ్యర్థి రవికుమార్‌రెడ్డి, కె.వి.ప్రశాంత్‌రెడ్డి, ఎంపీటీసీలు గంగరాజు, కొత్తూరు రెడ్డయ్య, కటిక చంద్రశేఖర్, రాజ్‌కుమార్, హబీబుల్లా, సింగిల్ విండో అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి, రవి గౌడ్, ఏపీ ఆగ్రోస్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి, యూత్ కొండయ్య, చలపతి, మున్నీర్, రమేష్‌బాబు, సింగారెడ్డి జయచంద్రారెడ్డి, సల్మా, భారతి, ఝాన్సీ, సర్పంచ్‌లు ఆర్‌ఎల్‌వి ప్రసాద్‌రెడ్డి, రమేష్‌బాబు, మైనార్టీ నాయకులు మున్నీర్, షేక్షా, వార్డు మెంబర్లు మోహన్ పవర్, మణిగోపాల్‌రెడ్డి, శేషయ్య, హజీం, మల్లయ్య, కుర్రాకుల వెంకటేష్, మాజీ సర్పంచ్‌లు పాలేటిరెడ్డి, దర్బార్, బికారీ, అలవలపాడు శ్రీను, మాజీ ఎంపీపీ కొండయ్య, ఎంపీటీసీ సుశీల, మాజీ సర్పంచ్ రామాంజనేయరెడ్డి తదితరులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
ఇడుపులపాయలో బిజీబిజీ
Published Fri, May 23 2014 1:36 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement