బద్వేలు/కాశినాయన, న్యూస్‌లైన్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలు నెరవేరాలంటే ఆయన తనయుడు జగన్ మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని వైఎస్సార్‌సీపీ యువజన వభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని వరికుంట్ల గ్రామంలో గురువారం పార్టీ అభ్యర్థుల ప్రచారం ప్రారంభిస్తున్న సందర్భంగా భారీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి, గోవిందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సీఎం కిరణ్ అసమర్థతే కారణమన్నారు. బిల్లు శాసనసభకు వచ్చిన రోజే రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు.
సీమాంధ్రలోని కోట్లాది మంది రాష్ట్ర విభజనను వద్దని కోరుతున్నా చంద్రబాబు మాత్రం రెండు కళ్ల సిద్ధాంతాన్ని విడిచి పెట్టడం లేదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ ఒక్కడై సమైక్య ఉద్యమాన్ని భుజాన వేసుకుని విభజనను ఆపేందుకు తన శాయశక్తులా కృషి చేస్తున్నారని చెప్పారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు మాట్లాడుతూ మరో 70 రోజుల్లో రాష్ట్రంలో కొత్త పరిపాలన వస్తుందని, జగన్ సీఎం అవుతారని చెప్పారు. ఈ 70 రోజులు ప్రతి కార్యకర్త, నాయకులు సైనికుల్లా శ్రమించి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలకు సమాధి కట్టే సమయం ఆసన్నమైందన్నారు. పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు, మైదుకూరు మాజీ ఎమ్మల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ టిక్కెట్ జయరాములుకు దక్కిందంటే ఆయన గెలిచినట్లేనన్నారు. అభ్యర్థి జయరాములు మాట్లాడుతూ వైఎస్ ఆశయాల సాధనకు తన వంతు కృషి చేస్తానని, అలాగే నియోజకవర్గంలోని పలు సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. రాష్ట్ర మహిళా ఆర్థికాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ కృష్టమ్మ మాట్లాడుతూ వైఎస్ రుణం తీర్చుకోవాలంటే జగన్‌ను సీఎం చేయడమే మార్గమన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ విశ్వనాథరెడ్డి, సత్యనారాయణరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు రామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ పెద్ద రామయ్య, సర్పంచ్ నాగిరెడ్డి, ఉపసర్పంచ్ ఓబుల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
వైఎస్సార్ సీపీ ప్రచారం ప్రారంభిస్తున్న సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. తొలుత పోరుమామిళ్లలో పలువురు జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
బద్వేలు మున్సిపల్ ఛైర్మన్ మునెయ్య, వైస్ ఛైర్మన్ గురుమోహన్, కన్వీనర్లు గోపాల్‌రెడ్డి, కరీముల్లా, యోగానందరెడ్డి, ఇమాంహుస్సేన్, బాలమునిరెడ్డి, నాయకులు నాగార్జునరెడ్డి, అంకన గురివిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, బోడపాడు రామసుబ్బారెడ్డి, శ్రీరాములు, కరెంట్ రమణారెడ్డి, పంగా గురివిరెడ్డి, చిత్తా బ్రదర్స్, మాజీ ఎంపీపీలు సర్వసతమ్మ, ఈశ్వరమ్మ, నేతలు వసంతరాయలు, అల్లా పాల్గొన్నారు.
వైఎస్ పాలన మళ్లీ రావాలి
Published Fri, Feb 14 2014 2:36 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement