ప్రజలకు ఇచ్చిన హామీలను తీర్చడం ఒక్క వైఎస్ కుటుంబానికే సాధ్యమని వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు, ఆ పార్టీ కడప పార్లమెంటు అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమని ఆయన విమర్శిం చారు.
చక్రాయపేట, న్యూస్‌లైన్: ప్రజలకు ఇచ్చిన హామీలను తీర్చడం ఒక్క వైఎస్ కుటుంబానికే సాధ్యమని వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు, ఆ పార్టీ కడప పార్లమెంటు అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమని ఆయన విమర్శిం చారు.
గడపగడపకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని అద్దాలమర్రి,కుమారకాల్వ, ఎర్రబొమ్మనపల్లె,కె.రాజుపల్లె,కల్లూరుపల్లె, కె.ఎర్రగుడి,గ్రామాల్లో మండల ఇన్‌చార్జ్ వైఎస్ కొండారెడ్డితో పాటు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత కరెంటు, లక్షలాది పక్కా గృహాలు, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు.
వైఎస్‌ఆర్ పథకాలను రోశయ్య,కిరణ్ కుమార్‌రెడ్డిలు కోతలు పెట్టారని ధ్వజమెత్తారు. తన హయాంలో పేదల సంక్షేమాన్నే మరచిన చంద్రబాబు నేడు ఎలాగైనా సీఎం కావాలని నోటికి వచ్చిన హామీలన్నీ ఇస్తున్నారన్నారు. ఈయన తీరు చూస్తే ప్రజలు ‘ఎండలు ఎక్కువగా ఉన్నయ్ సార్’ అంటే మీకు బాధ కలుగకుండా ఎండలనూ రద్దు చేస్తాననే హామీ ఇచ్చేందుకూ వెనుకాడడని ఎద్దేవా చేశారు.
జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తే అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులకు ఎల్‌కేజీ నుంచి పీజీ వరకూ 500 నుంచి,1000 వరకు నెలనెలా బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు.డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, రైతులకు నాణ్యమైన విద్యుత్ 7 గంటలు ఇవ్వడం, తర్వాత దాన్ని 9గంటలకు పెంచడం జరుగుతుందన్నారు.
పింఛన్లు,పక్కా గృహాలు వంటి మంచి పథకాలు అమలు చేయాలంటే ప్రజలు జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బెల్లం ప్రవీణ్ కుమారెడ్డి,యూత్ కన్వీనర్ వెంకటసుబ్బయ్య, ఉద్యాన శాఖ మాజీ డెరైక్టర్ కర్నాటి నాగభూషణరెడ్డి,ఏపి ఆగ్రోస్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి,సీనియర్ నేతలు బెల్లం కృష్ణారెడ్డి,చెన్నారెడ్డి, మాజీ రెస్కో చేర్మెన్ శివప్రసాద్‌రెడ్డి,సింగిల్ విండో అధ్యక్షులు శేషారెడ్డి, సురేష్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.