ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి రక్తదానం చేయడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పులివెందుల : ప్రజల సమస్యలపట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేసే నాయకుడు వైఎస్ జగనన్న అని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బాకరాపురంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కేక్‌ను కట్ చేసి అభిమానులకు తినిపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నేత వైఎస్ జగనన్న అని, ప్రజలపట్ల ఆయనకున్న సేవాభావాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పేదలకు ప్రతి ఒక్కరు తమ చేతనైనంత సహాయం చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, కౌన్సిలర్లు, తొండూరు మండల నాయకుడు బండి రామమునిరెడ్డి, లింగాల కొండారెడ్డి, కసనూరు పరమేశ్వరరెడ్డి, ఎంపీటీసీ విశ్వనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ :
వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకొని కౌన్సిలర్ కోళ్ల భాస్కర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని అక్కడి సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, కౌన్సిలర్లు, అంబకపల్లె మురళి, ఓ.రసూల్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.