
అండగా ఉంటా
వైఎస్‌ఆర్ సీపీ అధినేత, ఏపీ శాసనసభాప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం పులివెందులలో బిజీబిజీగా గడిపారు. సీఎస్‌ఐ చర్చి ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజల కష్టాలను ఓపిగ్గా విన్నారు. పలు సమస్యలపై అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడారు.
పలువురిని పరామర్శించారు. అధైర్యపడొద్దు అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ.. ఆత్మీయ కరచాలనం చేస్తూ ముందుకు కదిలారు.