CSI Church
-
కుటుంబంతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ (ఫొటోలు)
-
తల్లి విజయమ్మతో కలిసి క్రిస్మస్ జరుపుకున్న వైఎస్ జగన్
-
క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
సాక్షి, పులివెందుల: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ సహా కుటుంబ సభ్యులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా నేడు క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎస్ఐ చర్చిల్లో ప్రార్థనలు చేశారు. -
క్యాలెండర్ ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
-
రాష్ట్ర ప్రజలందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు: సీఎం జగన్
-
మెదక్ సీఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
మెదక్‌జోన్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఘనంగా ప్రార్థనలు జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. తెల్లవారు జామున 4.30 గంటలకు మొదటి ఆరాధనతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రెవరెండ్ బిషప్ సాల్మన్‌రాజ్ భక్తులకు దైవ సందేశం అందించి.. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు క్రీస్తు జననం మానవాళి అంతటికీ శుభదినం అన్నారు. భక్తులు ఏసు చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు భక్తులకు చర్చి దర్శనానికి అనుమతిచ్చారు. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులను ఆశీర్వదించేందుకు 15 మంది గురువులను అందుబాటులో ఉంచామని రెండో ఆరాధనలో దైవ సందేశమిచ్చిన చర్చి ప్రెసిబిటరీ ఇన్చార్జ్ జార్జ్ ఎబనైజర్రాజ్ తెలిపారు. ఈ ఉత్సవాలకు డయాసిస్ పరిధిలోని 13 జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. చర్చిలో ఆలపించిన భక్తిగీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ సందర్భంగా కల్వరి టెంపుల్‌కు భారీగా హాజరైన భక్తులు అన్ని మతాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యం: మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ అన్ని మతాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, అందులో భాగంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ గిఫ్టు ప్యాకెట్లు అందజేశారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మతాలను గౌరవిస్తూ రాష్ట్ర శ్రేయస్సును కోరుకుంటున్న సీఎం కేసీఆర్‌కు ఏసుప్రభువు ఆశీస్సులు ఉండాలన్నారు. రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలను దేశానికి అందించాలనే ఉదేశంతో బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారన్నారు. ఆమెతోపాటు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. -
కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ (ఫోటోలు)
-
పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు
సాక్షి, వైఎస్సార్ కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మూడో రోజున పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. అనంతరం చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ప్రజలందరూ క్రిస్మస్ పండుగను జరుపుకోనున్నారు. కాగా, క్రిస్మస్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలని ఆకాంక్షించారు సీఎం వైఎస్ జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైన మెదక్ చర్చి
మెదక్‌జోన్: మెదక్ జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చి క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైంది. చర్చి ప్రాంగణంలో శాంతాక్లాస్, క్రిస్మస్ట్రీ, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో విద్యుత్ కాంతుల్లో చర్చి వెలుగులీనుతోంది. చర్చిలో ప్రత్యేక ఆరాధనలకు తరలివచ్చే భక్తులకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటలకు మొదటి ఆరాధనను బిషప్ సాల్మన్‌రాజ్, రెండో ఆరాధనను ఉదయం 9.30 గంటలకు చర్చి ప్రెసిబెటరీ ఇన్‌చార్జి్జ జార్జ్ ఎబినేజర్ ప్రారంభిస్తారు. వేడుకలకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు ఇంగ్లండ్ దేశస్తులు కూడా వస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు. -
ప్రజలందరికీ మంచి జరగాలి
పులివెందుల: రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా శనివారం మూడో రోజు ఆయన వైఎస్సార్ జిల్లా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా అవ్వా తాతలు, అక్కచెల్లెమ్మలు, ప్రతి సోదరుడు, స్నేహితుడు, బంధువులు, కుటుంబ సభ్యులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం 9.15 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులలోని సీఎస్ఐ చర్చికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పాస్టర్ ఆనందరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తల్లి విజయమ్మతో కలిసి కేక్‌ను కట్ చేశారు. సీఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. అంతకు ముందు సీఎస్ఐ చర్చి న్యూ కాంప్లెక్స్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సీఎస్ఐ చర్చి పాస్టర్ ఆనందరావు వైఎస్ విజయమ్మ రచించిన ‘కీర్తనల జ్ఞాన అన్వయం’ గ్రంథాన్ని సంఘ సభ్యులకు పంపిణీ చేశారు. వైఎస్ విజయమ్మ తన జీవిత అనుభవసారంగా రచించిన ఈ గ్రంథంలోని అంశాలను అందరూ తెలుసుకుని నడుచుకోవాలని పాస్టర్ సూచించారు. క్రిస్మస్ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేక్ తినిపిస్తున్న మాతృమూర్తి వైఎస్ విజయమ్మ ఈ కార్యక్రమాల అనంతరం సీఎం జగన్ కడప విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి విజయవాడ బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్సార్ సోదరి విమలమ్మ, వైఎస్సార్ సోదరుడు రవీంద్రనాథరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి, వైఎస్ మధురెడ్డి, వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ మాధవి, డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పాల్గొన్నారు. -
100 ఎకరాల్లో ఆంగ్లేయులు నిర్మించిన చర్చీ.. తెలంగాణలో రెండో అతి పెద్దది
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చర్చీలు క్రిస్మస్ వేడుకల కోసం ముస్తాబయ్యాయి. సంబరాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు విద్యుత్ దీపాలతో అలంకరించారు. యేసు జన్మస్థలంగా భావించే పశువుల పాకలను ఆకట్టుకు నే విధంగా తీర్చిదిద్దారు. ప్రార్థనలు చేసేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని ప్రాచీన లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చికి భక్తుల తాకిడి అధికంగా ఉండనుంది. సాక్షి, లక్సెట్టిపేట(ఆదిలాబాద్): రాష్ట్రంలో మెదక్ తర్వాత అతిపెద్ద చర్చిగా చెప్పుకునే లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చి 86 వసంతాలు పూర్తి చేసుకున్నా నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ చర్చికి క్రిస్మస్కు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. ఆదిలాబాద్‌లోని చర్చిలో.. బ్రిటీష్ కాలంలో నిర్మాణం.. లక్సెట్టిపేట పట్టణానికి సమీపంలో వందెకరాలకు పైగా పచ్చటి పొలాలు, టేకు వనంలో మిషన్ కాంపౌండ్ ప్రాంతంలో ఆంగ్లేయులు ఈ చర్చిని నిర్మించారు. 1920లో ఇంగ్లాండ్‌కు చెందిన రేవ ఈడబ్ల్యూ లాంట్ లక్సెట్టిపేట పట్టణానికి వచ్చి, ఇక్కడే పదేళ్లపాటు మిషనరీ సంస్థలో పనిచేశాడు. 1930లో చర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 95 ఫీట్ల వైశాల్యంతో చర్చి నిర్మాణం, 70 ఫీట్ల వైశాల్యంతో ప్రాంగణం, 46 గొలుసులతో ఉన్న దిమ్మెలు, సుమారు 500 మందికి వసతి కల్పించేవిధంగా ఏర్పాట్లు చేశారు. దీని కోసం ఇంగ్లాండ్ నుంచి ప్లాన్ తెప్పించాడు. నిర్మాణ పనులు చూసే బాధ్యతను రెవ సీజీ అర్లికి అప్పగించారు. ఇంగ్లాండ్ నుంచి రంగురంగుల అద్దాలు, స్థానికంగా ఉన్న గూడెం గుట్ట, గువ్వల గుట్ట, చిన్నయ్య గుట్ల నుంచి రాళ్లు తెప్పించి, బొట్లకుంటలోని నీటిని చర్చి నిర్మాణానికి ఉపయోగించారు. ప్రత్యేకంగా మహారాష్ట్ర నుంచి శిల్పకళాకారులను రప్పించారు. 1935లో రెవ హెచ్ బర్డ్ చర్చి నిర్మాణం పూర్తి చేయించారు. అనంతరం మిషనరీగా వచ్చిన రేవ ఫాస్పూట్ సీఎస్ఐ చర్చిగా నామకరణం చేసి క్రిస్మస్ రోజున ప్రారంభించారు. అప్పటి నుంచి 1954 వరకు ఆంగ్లేయులే చర్చి ఫాదర్లుగా పనిచేశారు. ఫాదర్ నివాసం ఉండేందుకు రెండస్తుల విశాలమైన భవంతిని నిర్మించారు. ప్రస్తుతం పనిచేస్తున్న చర్చి ఫాదర్లు కూడా అందులోనే ఉంటారు. విద్యుత్‌కాంతుల్లో విజయనగరం చర్చి విజయనగరం చర్చికి 55 ఏళ్లు కౌటాల(సిర్పూర్): మండలంలోని విజయనగరం గ్రామంలోని కథోలిక చర్చికి ఘన చరిత్ర ఉంది. విజయనగరంలో 1966లో దీనిని స్థాపించారు. విశాలమైన ప్రాంతంలో చర్చితోపాటు ఎయిడైడ్ పాఠశాల, వసతి గృహం ఉన్నాయి. చర్చికి ప్రతి ఆదివారం 250 వరకు భక్తులు వచ్చి, ప్రార్థనలు నిర్వహిస్తారని ఫాదర్ మనోజ్ తెలిపారు. 30 ఏళ్ల క్రితం పాత భవనాన్ని తొలగించి, అదేస్థలంలో భారీ మందిరాన్ని నిర్మించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకంగా విద్యుత్‌కాంతులతో చర్చిని ముస్తాబు చేశారు. ఏర్పాట్లు చేస్తున్నాం క్రిస్మస్ రోజు లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చికి భక్తులు అధికంగా వస్తుంటారు. పండుగ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలు సంతోషంగా జరుపుకోవాలి. – కరుణాకర్‌రావు, సీఎస్ఐ చర్చి ఫాదర్, లక్సెట్టిపేట కలెక్టర్ చౌక్‌లో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ ట్రీ ముస్తాబైన యేసు మందిరాలు కైలాస్‌నగర్(ఆదిలాబాద్): జిల్లాకేంద్రంలోని కలెక్టర్ చౌక్ వద్ద గల హోలీ ఫ్యామిలీ కాథరల్ చర్చిలో యేసు జన్మస్థలం పశువుల పాకను అందంగా తీర్చిదిద్దారు. రాత్రి 12 గంటలకు యేసు జన్మను స్వాగతిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఖానపూర్లో గల ఇండియా మిషన్ చర్చి, రవీందర్‌నగర్‌లోని సీఎస్ఐ చర్చి, విద్యానగర్‌లోని బేస్ సేబా చర్చిలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా అలంకరణ వస్తువులు సాంటా క్లోస్ దుస్తులు, నక్షత్రాలు, రంగురంగుల వస్తువులు కొనుగోళ్లతో షాపింగ్ మాల్‌లు, జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు రద్దీగా మారాయి. ఆనందంగా గడుపుతాం క్రిస్మస్ రోజు తప్పకుండా అమ్మనాన్నతో కలిసి అందరం చర్చికి వెళ్తాం. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఆనందంగా గడుపుతాం. కొత్త బట్టలు వేసుకుని, ఇంటిని కూడా అందంగా ముస్తాబు చేస్తాం. – డి.ప్రేక్ష, టీచర్స్‌కాలనీ -
క్రిస్మన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, పులివెందుల : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే సీఎం సతీమణి వైఎస్ భారతి, వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ...‘క్రిస్మస్ తో పాటు వైకుంఠ ఏకాదశి కలిసి రావడం శుభదినం. ఇవాళ 30లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. పులివెందులలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోవడం బాధాకరం. పట్టాలు ఇవ్వొద్దని నిన్న ఎవరో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. ఏపీఐఐసీ భూములు పేదలకు ఇవ్వొద్దని హైకోర్టు స్టే ఇచ్చింది. ఏపీఐఐసీ భూముల్లో పరిశ్రమలు వస్తే అక్కడ పనిచేసే ప్రజలకు ఇళ్లు ఉండాలి. అందుకే అక్కడ పేదలకు ఇళ్లు ఇస్తున్నాం. కోర్టు స్టే ఇచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాం. మంచి పనులు చేస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారు. పులివెందుల ప్రజలకు కూడా త్వరలోనే ఇళ్ల పట్టాలు ఇస్తాం’ అని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి 11.20 గంటలకు బాకరాపురం హెలిప్యాడ్ నుంచి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి బయల్దేరి వెళతారు. (పేదలకు పట్టాభిషేకం) సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ వంటి క్రీస్తు సందేశాలు మనలను సన్మార్గంలో నడిపించాలని, రాష్ట్ర ప్రజలపై క్రీస్తు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.#MerryChristmas — YS Jagan Mohan Reddy (@ysjagan) December 25, 2020 -
కడప సీఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు
-
సీఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు
సాక్షి, పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొందడంతో చర్చి పాస్టర్లు జగన్‌ను ఆశ్వీరదించారు. కడప నుంచి పులివెందుల చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్‌తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి, దివంగత నేత వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. సాయంత్రం తిరిగి విజయవాడ చేరుకోనున్నారు. కాగా అంతకు ముందు తిరుపతి నుంచి కడప చేరుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద దర్గాను సందర్శించారు. ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, దర్గా పీఠాధిపతి ఘన స్వాగతం పలికారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : కడప సీఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు -
కుటుంబ సమేతంగా వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు
సాక్షి, పులివెందుల : పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సమేతంగా ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘పాదయాత్రకు బయలుదేరే ముందు మీ అందరి దీవెనలు కోసం వచ్చాను. మీరు చేసిన ప్రార్థనలు, చల్లని దీవెనల కారణంగానే ప్రజాసంకల్పయాత్ర విజయంతంగా పూర్తయింది. మీ ఆశీస్సులు నాకు, మా కుటుంబంపై ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. అంతకుముందు పులివెందులలో దారిపొడవునా వైఎస్ జగన్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సుదీర్ఘ ప్రజాసంల్పయాత్రను విజయవంతంగా ముగించుకుని వైఎస్ జగన్ శుక్రవారం పులివెందులలోని స్వగృహానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల, సతీమణి భారతి రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు. (దారిపొడవునా జనమే జనం) -
దేవుడు వైఎస్ జగన్ పక్షాన ఉన్నాడు
పులివెందుల: దేవుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పక్షాన ఉన్నాడని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. మంగళవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ జిల్లా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో వైఎస్ కుటుంబీకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ వైఎస్సార్ కుటుంబం తరపున ప్రజలందరికి క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. ఆయన బాటలోనే ప్రస్తుతం జగన్ పయనిస్తున్నారన్నారు. వైఎస్సార్‌పై సెక్రటేరియట్లో హత్యాయత్నం జరిగిన సమయంలో, నక్సలైట్లు బాంబు పెట్టిన సమయంలోనూ దేవుడే ఆయనను కాపాడారని ఆమె అన్నారు. నా జీవితంలో 52ఏళ్ల జీవితం ఒక ఎత్తయితే.. వైఎస్సార్ మరణం తర్వాత 9ఏళ్లు మరొక ఎత్తు అన్నారు. క్రిస్మస్ సందర్భంగా జీసెస్ చారిటీస్‌లో అనాథ పిల్లలతో కేక్ కట్ చేయిస్తున్న షర్మిల, రాజారెడ్డి, అంజలి ఈ 9ఏళ్లు అనేక కష్టాలతో గడిచిందన్నారు. ఎన్నో కుట్రలు, కేసులు, గొడవలతో ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్రెడ్డి వెనక్కి తగ్గలేదన్నారు. వైఎస్సార్‌లాగే ప్రజలకు సేవ చేయాలన్న తపన వైఎస్ జగన్‌లో కూడా నిండుగా ఉందన్నారు. 14 నెలలుగా పాదయాత్ర చేస్తున్న జగన్‌ను ప్రతి క్షణం దేవుడు తోడుగా ఉండి కాపాడుకుంటున్నారన్నారు. అంతేకాక వైఎస్ కుటుంబం కోసం దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారన్నారని, వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ విజయమ్మతోపాటు దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్సార్ సోదరులు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ రవీంద్రనాథరెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి, డాక్టర్ ఇసీ గంగిరెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తదితరులు పాస్టర్ బెనహర్ బాబు ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. కాగా స్థానిక జీసెస్ చారిటీస్‌లోని అనాథ ఆశ్రమంలో గల చర్చిలో వైఎస్ జగన్ సోదరి షర్మిలమ్మతోపాటు ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి అనాథ పిల్లలచే కేక్ కట్ చేయించి క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్నారు. -
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన విజయమ్మ
-
‘దేవుడు వైఎస్ జగన్ పక్షాన ఉన్నాడు’
సాక్షి, వైఎస్సార్: దేశవ్యాప్తంగా క్రిస్మస్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్సార్ జిల్లా పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, భారతి జార్జిరెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి పాల్గొన్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ కుటుంబం తరఫున ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. ‘దేవుడు నాకు మంచి భర్తను, కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి మంచి పరిపాలన ఇచ్చే శక్తిని ఇచ్చారు. దేవుని ఆశీర్వాదం వల్లే ఆయన కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయారు. ఆయన మరణించాక ఈ తొమ్మిదేళ్ల జీవితం నాకు ఒక ఎత్తు. ఇటీవల వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం నుంచి దేవుని కృపే ఆయన్ను కాపాడింది. దేవుడు వైఎస్ జగన్ పక్షాన ఉన్నాడు. వైఎస్సార్‌లాగే వైఎస్ జగన్‌తో కూడా ప్రజలకు మరింత సేవ చేయించుకోవాలని దేవుడు భావించి ఉంటాడు. పాదయాత్రలో వైఎస్ జగన్‌కు నిత్యం దేవుడు తోడుగా ఉండి కాపాడుతున్నాడు. రాబోయే రోజుల్లో దేవుడు వైఎస్ జగన్ లక్ష్యం నెరవేరుస్తాడ’ని అన్నారు. వైఎస్ జగన్ కోసం ప్రార్థిస్తున్న కోట్లాది మందికి కృతజ్ఞతలు తెలిపారు. -
క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన సీఎస్ఐ
సాక్షి, మెదక్ : క్రిస్మస్ వేడుకలకు మెదక్ సీఎస్ఐ (చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా) ముస్తాబైంది. యేసయ్య మహాదేవాలయం రంగురంగుల విద్యుద్దీపాలతో వెలుగులీనుతోంది. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు బిషప్ ఏసీ సాల్మన్‌రాజు తొలి ప్రార్థన ప్రారంభిస్తారు. అనంతరం దైవ సందేశాన్ని ఇస్తారు. తర్వాత పవిత్ర సిలువ ఊరేగింపు నిర్వహిస్తారు. 9.30 గంటలకు రెండో ఆరాధన జరుగుతుంది. చర్చిలో నిర్వహించే వేడుకలకు రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల వారు హాజరవుతారు. మరోవైపు చర్చికి ఆదివారం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. సుమారు రెండు లక్షల మంది వరకు వేడుకల్లో పాల్గొంటారని అంచనా. ఈ సందర్భంగా చర్చి వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 500 మందికిపైగా పోలీసులు బందోబస్తులో ఉన్నారు. -
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
-
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
పులివెందుల: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కుటుంబ సభ్యులు పులివెందుల సీఎస్ఐ చర్చ్‌లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. క్రైస్తవులకు ట్విట్టర్ ద్వారా వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగను అందరూ ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. Wishing you, your family and friends a Merry Christmas. — YS Jagan Mohan Reddy (@ysjagan) December 25, 2016 -
పులివెందుల చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
పులివెందుల చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు
-
చర్చి హుండీని పగులగొట్టిన దుండగులు
అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలోని చర్చిలో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు స్థానిక సీఎస్ఐ చర్చి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడున్న హుండీని ద్వంసం చేసి.. రూ.10వేల నగదును ఎత్తుకుపోయారు. శనివారం ఉదయం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అండగా ఉంటా
వైఎస్ఆర్ సీపీ అధినేత, ఏపీ శాసనసభాప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం పులివెందులలో బిజీబిజీగా గడిపారు. సీఎస్ఐ చర్చి ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజల కష్టాలను ఓపిగ్గా విన్నారు. పలు సమస్యలపై అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడారు. పలువురిని పరామర్శించారు. అధైర్యపడొద్దు అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ.. ఆత్మీయ కరచాలనం చేస్తూ ముందుకు కదిలారు.