మెదక్‌జోన్: మెదక్ జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్‌ఐ చర్చి క్రిస్‌మస్ వేడుకలకు సిద్ధమైంది. చర్చి ప్రాంగణంలో శాంతాక్లాస్, క్రిస్‌మస్‌ట్రీ, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో విద్యుత్ కాంతుల్లో చర్చి వెలుగులీనుతోంది. చర్చిలో ప్రత్యేక ఆరాధనలకు తరలివచ్చే భక్తులకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటలకు మొదటి ఆరాధనను బిషప్ సాల్మన్‌రాజ్, రెండో ఆరాధనను ఉదయం 9.30 గంటలకు చర్చి ప్రెసిబెటరీ ఇన్‌చార్జి్జ జార్జ్ ఎబినేజర్ ప్రారంభిస్తారు. వేడుకలకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు ఇంగ్లండ్ దేశస్తులు కూడా వస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment