ముస్తాబైన మెదక్‌ చర్చి | Christmas Special Celebrations In Medak Church | Sakshi
Sakshi News home page

ముస్తాబైన మెదక్‌ చర్చి

Published Wed, Dec 25 2019 9:17 AM | Last Updated on Wed, Dec 25 2019 9:17 AM

Christmas Special Celebrations In Medak Church - Sakshi

మెదక్‌ చర్చి 

కరుణామయుడి ఆలయం.. ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడం.. ఆనాటి కట్టడాలను కళ్లారచూస్తే తప్పా వర్ణించటం ఎవరితరం కాదు.. అదే మెదక్‌లోని ఏసయ్య కోవెల సీఎస్‌ఐ చర్చి. డిసెంబర్‌ 25న లోక రక్షకుడి అవతరణ వేడుకల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఏసయ్య మందిరంలో ప్రతి వస్తువు కళాత్మకమే.. ప్రతి కట్టడం ప్రత్యేకమే.. మహా దేవాలయం వీక్షణం నయనానందకరమే. రెవరెండ్‌ చార్లెస్‌ వాకర్‌ పాస్నెట్‌ ఆధ్వర్యంలో 1914 నుంచి 1924 వరకు చర్చి నిర్మాణం జరిగింది. డిసెంబర్‌ 25, 1924లో ప్రారంభించారు. 
  – మెదక్‌జోన్‌

ఆధ్యాత్మిక, కళాత్మకతల మేళవింపుతో చారిత్మాక సీఎస్‌ఐ చర్చి ప్రసిద్ధిగాంచింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాదేవాలయాన్ని సందర్శించిన వారెవరైనా నిర్మాణ సౌందర్యాన్ని తిలకించి పులకించి పోవాల్సిందే. చర్చిలో మూడు వైపులా కుడ్యాలపై కరుణామయుని చిత్రాలు అబ్బుర పరుస్తాయి. స్పెయిన్‌ గ్లాస్‌ పలకలపై చిత్రించిన క్రీస్తు జననం, శిలువ, పునరుత్థానం దృశ్యాలు కేవలం సూర్య కిరణాలతోనే తేజోవంతంగా ప్రకాశించడం వాటి ప్రత్యేకత. ఈ దృశ్యాలు తిలకించిన పర్యాటకులు మంత్ర ముగ్ధులు కావాల్సిందే. దేవదారు కర్రతో, పక్షిరాజు ఆకృతిలో తయారుచేసి పరిశుద్ధ గ్రంథ వేధిక మరో ఆకర్షణ. మహా దేవాలయంలో ప్రసంగ వేదికను బాల్‌స్టోన్‌తో రూపొందించారు. ఫరి్నచర్‌ కోసం రంగూన్‌ టేకు కర్రను, ఇతరత్రా ఆసనాలకు గులాబీ కర్రలను వినియోగించారు. ఈ చర్చి కట్టడాలను తిలకించిన పర్యాటకులు మళ్లీ మళ్లీ వస్తుండటం ఇక్కడి నిర్మాణ శైలి ప్రత్యేకత. 

చర్చి లోపల భాగాన ప్రత్యేక అలంకరణ

క రక్షకుడైన ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు జరిగే క్రిస్మస్‌ వేడుకలకు మెదక్‌ సీఎస్‌ఐ చర్చిని నిర్వాహకులు అందంగా అలంకరించారు. ఈ ఉత్సవాలకు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి సుమారు 10 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందుకోసం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

అనేక రకాల గిఫ్టులు 
ఏసయ్య జన్మ దినమైన క్రిస్మస్‌ పండగ డిసెంబర్‌ 25న జరగనుంది. కాగా క్రిస్మస్‌ సంప్రదాయాల్లో ప్రధానంగా ఏడు అంశాలు ప్రపంచ వ్యాప్తంగా అమలులో ఉన్నా యి. అందులో గిఫ్ట్‌లు ఇవ్వ డం ప్రత్యేకత. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా ఇళ్లకు వెళ్లి క్యారెల్స్‌ గీతాలు ఆలపించడం, ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం, బహుమతులు పంచుకోవడం, కేక్‌కట్‌ చేసుకోవడం ఆనవాయితి. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని జనరల్‌ స్టోర్స్, ఫ్యాన్సీ స్టోర్లలో విభిన్న రకాల బహుమతులు కొలువు దీరాయి. ఏసుక్రీస్తు, మేరిమాత రూపాలతో, శిలువ గుర్తులతో ఉన్న వాల్‌ హ్యాంగింగ్స్, రకరకాల ఫొటో ఫ్రేములు, క్రీస్తు బొమ్మతో ఉన్న గడియారాలు, శాంతాక్లాజ్‌ బొమ్మలు లభిస్తున్నాయి. క్రైస్తవుల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్స్‌ కూడా దొరుకుతున్నాయి. ఏసుక్రీస్తు జన్మవత్తాంతాన్ని, బోధన తెలిపే సీడీలు, డీవీడీలు లభిస్తున్నాయి. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా క్రైస్తవులు తమ సన్నిహితు లు, మిత్రులు, బంధువులకు అందజేసేందుకు వీటిని కొనుగోలు చేస్తున్నారు. క్రీస్తు శకం 300ల నుంచే బహుమతులు పంచే సంప్రదాయం ఉందని క్రైస్తవ మతపెద్దలు చెబుతున్నారు.

ఆధ్యాత్మిక, కళాత్మకతల మేళవింపుతో చారిత్మాక సీఎస్‌ఐ చర్చి ప్రసిద్ధిగాంచింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాదేవాలయాన్ని సందర్శించిన వారెవరైనా నిర్మాణ సౌందర్యాన్ని తిలకించి పులకించి పోవాల్సిందే. చర్చిలో మూడు వైపులా కుడ్యాలపై కరుణామయుని చిత్రాలు అబ్బుర పరుస్తాయి. స్పెయిన్‌ గ్లాస్‌ పలకలపై చిత్రించిన క్రీస్తు జననం, శిలువ, పునరుత్థానం దృశ్యాలు కేవలం సూర్య కిరణాలతోనే తేజోవంతంగా ప్రకాశించడం వాటి ప్రత్యేకత. ఈ దృశ్యాలు తిలకించిన పర్యాటకులు మంత్ర ముగ్ధులు కావాల్సిందే. దేవదారు కర్రతో, పక్షిరాజు ఆకృతిలో తయారుచేసి పరిశుద్ధ గ్రంథ వేధిక మరో ఆకర్షణ. మహా దేవాలయంలో ప్రసంగ వేదికను బాల్‌స్టోన్‌తో రూపొందించారు. ఫరి్నచర్‌ కోసం రంగూన్‌ టేకు కర్రను, ఇతరత్రా ఆసనాలకు గులాబీ కర్రలను వినియోగించారు. ఈ చర్చి కట్టడాలను తిలకించిన పర్యాటకులు మళ్లీ మళ్లీ వస్తుండటం ఇక్కడి నిర్మాణ శైలి ప్రత్యేకత. 

క్రిస్మస్‌ పర్వదినాన దేశ నలుమూలల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్‌ఐ చర్చికి వస్తారని, ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని చెప్పారు. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. వందలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు. అలాగే ఆలయం తరఫున వలెంటీర్లను సైతం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 25వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకే మొదటి ప్రార్థన ఉంటుందని తెలిపారు. 

కేక్‌ కట్‌చేసిన కలెక్టర్, ఎస్పీ  
క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం బిషప్‌ బంగ్లాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎస్పీ చందనాదీప్తితో కలిసి కలెక్టర్‌ ధర్మారెడ్డి కేక్‌కట్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలు కుల, మత, ప్రాంత బేధాలు వీడి ప్రేమతో నడుచుకోవాలని సూచించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకున్నప్పుడే ఏసుక్రీస్తు మార్గం అనుసరించిన వారౌతారని చెప్పారు. అనంతరం ఎస్పీ చందనాదీప్తి మాట్లాడుతూ క్రైస్తవ సోదర, సోదరీ మణులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. చర్చి సంఘం ద్వార సాధ్యమైనంత వరకు ఇతరులకు లబ్ధి చేకూర్చాలని కోరారు. చర్చ్‌బిషప్‌ సాల్మన్‌రాజ్‌ మాట్లాడుతూ,  దేవుడి దృష్టిలో ప్రతిఒక్కరూ సమానమేనని పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా అందరూ ప్రేమభావంగా నడుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నాగరాజు, డీఎస్పీ కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement