సిద్దిపేట అర్బన్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట సీఎస్‌ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు తెలంగాణ పండుగలకు ప్రాధాన్యత ఇవ్వకుండా చిన్నచూపు చూశాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తమ పార్టీ ఈ ప్రాంతంలో అన్ని వర్గాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. పండుగలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించడం పట్ల అందరు హర్షం ప్రకటిస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా చర్చ్‌ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు.
సిద్దిపేటలోని సీఎస్‌ఐ చర్చి ఆవరణను సీసీగా మలిచేందుకు త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చర్చి ఫాదర్ విజయ్‌రావు, డీఎస్పీ శ్రీధర్, నాయకులు మచ్చవేణుగోపాల్, మర్పల్లి శ్రీనివాస్‌గౌడ్, మల్లయ్య, రాంచందర్‌రావు, పాల సాయిరాం, లక్ష్మిరాజ్యం, పాండు పాల్గొన్నారు.
తెలంగాణ పండుగలకు ప్రభుత్వం పెద్దపీట
Published Thu, Dec 25 2014 11:11 PM | Last Updated on Thu, Sep 6 2018 3:03 PM
Advertisement