సాక్షి, పులివెందుల : పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సమేతంగా ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘పాదయాత్రకు బయలుదేరే ముందు మీ అందరి దీవెనలు కోసం వచ్చాను. మీరు చేసిన ప్రార్థనలు, చల్లని దీవెనల కారణంగానే ప్రజాసంకల్పయాత్ర విజయంతంగా పూర్తయింది. మీ ఆశీస్సులు నాకు, మా కుటుంబంపై ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
అంతకుముందు పులివెందులలో దారిపొడవునా వైఎస్ జగన్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సుదీర్ఘ ప్రజాసంల్పయాత్రను విజయవంతంగా ముగించుకుని వైఎస్ జగన్ శుక్రవారం పులివెందులలోని స్వగృహానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల, సతీమణి భారతి రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు. (దారిపొడవునా జనమే జనం)
Comments
Please login to add a commentAdd a comment