idupulaya paya
-
నేడు ఇడుపులపాయకు సీఎం వైఎస్ జగన్
-
8న ఇడుపులపాయకు సీఎం జగన్
సాక్షి, కడప : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 8వ తేదిన జిల్లాకు రానున్నారు. తన తండ్రి.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో ఆయన నివాళులు అర్పించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల విషయమై వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు బుధవారం అమరావతిలో చర్చించారు. డిప్యూటీ సీఎం అంజాద్బాష, ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, డాక్టర్ వెంకట సుబ్బయ్య, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కె.సురేష్‌బాబు పాల్గొన్నారు. ఫించన్ పథకాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు. అవ్వతాతలను ఆదుకునే నిమిత్తం వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఫించన్ పెంచుతామని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫించన్ మొత్తాన్ని రూ.2250 పెంచుతూ తొలి సంతకం చేశారు. దీనిని జూలై నెలలో అందించనున్నట్లు ప్రకటించారు. 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున వైఎస్సార్ ఫించన్ కానుక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. -
కుటుంబ సమేతంగా వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు
సాక్షి, పులివెందుల : పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సమేతంగా ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘పాదయాత్రకు బయలుదేరే ముందు మీ అందరి దీవెనలు కోసం వచ్చాను. మీరు చేసిన ప్రార్థనలు, చల్లని దీవెనల కారణంగానే ప్రజాసంకల్పయాత్ర విజయంతంగా పూర్తయింది. మీ ఆశీస్సులు నాకు, మా కుటుంబంపై ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. అంతకుముందు పులివెందులలో దారిపొడవునా వైఎస్ జగన్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సుదీర్ఘ ప్రజాసంల్పయాత్రను విజయవంతంగా ముగించుకుని వైఎస్ జగన్ శుక్రవారం పులివెందులలోని స్వగృహానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల, సతీమణి భారతి రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు. (దారిపొడవునా జనమే జనం) -
శ్రేణుల్లో స్ఫూర్తి
ఎన్నికల ముంగిట కార్యకర్తల్లో కదనోత్సాహం ఇడుపులపాయ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఇడుపులపాయ నుంచి సాక్షి ప్రతినిధులు: సార్వత్రిక ఎన్నికల ముంగిట పార్టీ శ్రేణుల్లో పోరాట పటిమను నింపుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో ప్లీనరీ (ప్రజా ప్రస్థానం) విజయవంతంగా ముగిసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి చెంత ఇడుపులపాయలో ఏర్పాటైన ప్రాంగణం జగన్నినాదాలతో మార్మోగింది. పార్టీ జెండాల రెపరెపలు, కార్యకర్తల కదనోత్సాహం నడుమ రానున్న ఎన్నికల్లో గెలుపు సాధించాలన్న దృఢ నిశ్చయంతో శ్రేణులన్నీ ప్రతిన బూనాయి. పార్టీ అగ్ర నేతల ప్రసంగాలు వారిలో స్ఫూర్తిని నింపి, కర్తవ్య బోధ చేశాయి. పార్టీ ఆవిర్భావం నుంచి పోరాటాలతో రాటుదేలిన పార్టీ కార్యకర్తలు ఇదే పటిమను ఎన్నికల వరకూ కొనసాగించాలని నేతలు పిలుపు నిచ్చారు. ఉత్సాహ భరిత వాతావరణంలో పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నిక, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే నేతల పట్టుదల, సంక్షేమ కార్యక్రమాల పునరుద్ధరణకు కంకణం కట్టుకోవడం ఈ ప్లీనరీలో ప్రధానాంశాలుగా నిలిచాయి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో మొత్తం 23 జిల్లాల నుంచి సుమారు పది వేల మంది ప్రతినిధులు, ముఖ్య నేతలు ప్లీనరీలో పాల్గొనడం విశేషం. ఆదివారం రోజంతా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం, నాలుగేళ్లుగా వివిధ ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలకు తూట్లు పొడవడంపై పార్టీ సాగిస్తున్న పోరుబాటపై తదితర అంశాలపై ప్లీనరీ క్షుణ్ణంగా సమీక్షించుకుంది. మొత్తమ్మీద ఎన్నికల సమయంలో జరిగిన ఈ ప్లీనరీ పార్టీ శ్రేణులను ఉత్తేజితులను చేసి, వారిని సమరోన్ముఖులను చేసేందుకు దోహదపడింది. ప్లీనరీ సాగిందిలా: పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉదయం 9.30 గంటలకు వైఎస్ సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగన్ వెంట వైఎస్ విజయమ్మ, షర్మిల ఉన్నారు. అక్కడ్నుంచి నేరుగా ప్లీనరీ ప్రాంగణానికి చేరుకునిపార్టీ జెండాను ఆవిష్కరించారు. తర్వాత ప్లీనరీ వేదికపైకి చేరుకుని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్లీనరీ ప్రారంభం కాగానే పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు శెట్టిపల్లి రఘురామిరెడ్డి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో పాటు ఇతర ప్రధాన నాయకులను వేదికపైకి ఆహ్వానించారు. తర్వాత ఇటీవల కాలంలో దివంగతులైన 33 మంది పార్టీ నాయకులు, శ్రేణులకు మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ నివాళులర్పిస్తూ తీర్మానం చేశారు. అధ్యక్షుడితో పాటు ప్లీనరీకి విచ్చేసిన ప్రజలు, కార్యకర్తలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. తర్వాత పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రారంభోపన్యాసం చేశారు. తర్వాత పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే కృష్ణదాస్ ప్రమాణం చేయించారు. పార్టీ పురోగతి కోసం నిధులను విరాళంగా ఇవ్వాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన పలువురు నేతలు విరాళాలను ప్రకటించారు. తర్వాత పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి జగన్ ఎన్నికైనట్లు పార్టీ సంస్థాగత ఎన్నికల కన్వీనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. అనంతరం షర్మిల, జగన్, నేతలు ప్రసంగించారు. తెలంగాణ నేతల సమైక్య నినాదం: ప్లీనరీలో పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ.. ‘‘సమైక్యవాదం తీసుకోవడంతో వైఎస్సార్సీపీ సీమాంధ్రకే పరిమితమైందని అంటున్నారు. కానీ, సమైక్యవాదులే తెలంగాణలో ఎక్కువగా ఉన్నారు. ఒక్కసారి జగన్ అడుగుపెడితే సీమాంధ్రలో ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలంగాణలో అదే విధంగా వస్తాయి. తెలంగాణ ఏర్పాటై.. అందులోని కొన్ని జిల్లాలు అభివృద్ధి చెందకపోతే వాటికి మళ్లీ ప్రత్యేక రాష్ట్రం కావాలంటే ఇస్తారా? ఇదే అభిప్రాయాన్ని తెలంగాణలో లక్షల గుండెలు చెబుతున్నాయి. అని అన్నారు. తెలంగాణ నుంచి ఎవరూ రాలేదని కూడా కొందరు అంటున్నారు. నేను వచ్చాను.. జనక్‌ప్రసాద్, పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డి, యడ్డా కృష్ణారెడ్డి, బాలమణెమ్మతో పాటు అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు వచ్చారు..’’ అని గట్టు రాంచంద్రరావు అనగానే... ప్లీనరీ వేదికపై ఉన్న తెలంగాణ నేతలు ఒక్కసారిగా లేచి నిలబడి.. ‘జై జగన్’ .. ‘జోహార్ వైఎస్సార్’ అంటూ నినదించారు. -
ఏకగ్రీవంగా ఎన్నికైన జగన్
బలపరుస్తూ మొత్తం 16 సెట్ల నామినేషన్లు ఇడుపులపాయ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఇడుపులపాయలో జరిగిన పార్టీ ప్లీనరీ (రెండో ప్రజా ప్రస్థానం)లో పార్టీ నేతల హర్షధ్వానాల మధ్య జగన్మోహన్రెడ్డి ఎన్నికైనట్లుగా సంస్థాగత ఎన్నికల కన్వీనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఆయన పేరు ప్రకటించగానే జై జగన్ నినాదాలు మార్మోగాయి. పార్టీ నియమావళి, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి మూడేళ్లకు ఒకసారి జరగాల్సిన సంస్థాగత ఎన్నికలను పురస్కరించుకుని ఈ ఎన్నికను నిర్వహించినట్లు ఉమ్మారెడ్డి వెల్లడించారు. జగన్‌ను అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలని మొత్తం 16 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. జగన్ సోదరి షర్మిల తొలిసెట్ నామినేషన్‌ను ప్రతిపాదించగా వైవీ సుబ్బారెడ్డి బలపరిచారు. మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కృష్ణారెడ్డి రెండో సెట్‌ను ప్రతిపాదించగా కొలిశెట్టి శివకుమార్ బలపర్చారు. టీఎస్ విజయచందర్ మూడో సెట్ నామినేషన్‌ను ప్రతిపాదించగా పీఎన్వీ ప్రసాద్ బలపర్చారు. వీరు కాక తెలంగాణ నుంచి బాల మణెమ్మ మరో సెట్ నామినేషన్‌ను ప్రతిపాదించగా ఎస్.రఘురామిరెడ్డి బలపర్చారు. పార్టీ సీనియర్ నేతలు కొణతాల రామకృష్ణ, జూపూడి ప్రభాకర్‌రావు, తెల్లం బాలరాజు, కాపు రామచంద్రారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డితో సహా పలువురు నేతలు జగన్‌ను బలపరుస్తూ నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించిన ఉమ్మారెడ్డి... సాయంత్రం 5 వరకూ నామినేషన్లను స్వీకరించారు. పోటీలో మరెవరూ లేక పోవడంతో ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అయ్యాక మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జగ న్ ఎన్నికను ప్రకటించారు. 2013 సెప్టెంబర్, అక్టోబర్‌లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశాల్లో 23 జిల్లాలకు, 12 మున్సిపల్ కార్పొరే షన్ నగరాలకు పార్టీ అధ్యక్షులు ఎన్నికైనట్లు పార్టీ సంస్థాగత కార్యక్రమాల రాష్ట్ర కో-ఆర్డినేటర్ పీఎన్వీ ప్రసాద్ వెల్లడించారు. జిల్లాల కొత్త అధ్యక్షులు వీరే.. ధర్మాన కృష్ణదాస్(శ్రీకాకుళం), పెన్మత్స సాంబశివరాజు (విజయనగరం), చెక్కాకుల వెంకట్రావు (విశాఖపట్నం), కుడుపూడి చిట్టబ్బాయ్ (తూర్పు గోదావరి), తెల్లం బాలరాజు (పశ్చిమ గోదావరి), ఎస్.ఉదయభాను(కృష్ణా), మర్రి రాజశేఖర్(గుంటూరు), ఎన్.బాలాజీ(ప్రకాశం), ఎం.మురళీధర్(నెల్లూరు), కె.నారాయణస్వామి (చిత్తూరు), కె.సురేష్‌బాబు(వైఎస్సార్), ఎం.శంకరనారాయణ (అనంతపురం), గౌరు వెంకటరెడ్డి(కర్నూలు), కె.వినాయకరెడ్డి (ఆదిలాబాద్), మధురెడ్డి (నిజామాబాద్), సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి (కరీంనగర్), బి.జగపతి(మెదక్), ఎం.సోమేశ్వరరావు (వరంగల్), పాయం వెంకటేశ్వర్లు(ఖమ్మం), ఇ.సి.శేఖర్ గౌడ్(రంగారెడ్డి), ఆదం విజయ్‌కుమార్ (హైదరాబాద్), గట్టు శ్రీకాంత్‌రెడ్డి (నల్లగొండ), ఎడ్మ క్రిష్ణారెడ్డి (మహబూబ్‌నగర్).