వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డివైఎస్సార్ జిల్లా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొందడంతో చర్చి పాస్టర్లు జగన్‌ను ఆశ్వీరదించారు. కడప నుంచి పులివెందుల చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్‌తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి, దివంగత నేత వైఎస్‌ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. సాయంత్రం తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.