అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలోని చర్చిలో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు స్థానిక సీఎస్‌ఐ చర్చి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడున్న హుండీని ద్వంసం చేసి.. రూ.10వేల నగదును ఎత్తుకుపోయారు. శనివారం ఉదయం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.