రేపు వైఎస్ జగన్ రాక | Y.S jagan arrives to pulivendula | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్ జగన్ రాక

Published Fri, Dec 12 2014 2:55 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM

రేపు వైఎస్ జగన్ రాక - Sakshi

రేపు వైఎస్ జగన్ రాక

పులివెందుల: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పులివెందులకు వస్తారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ శుక్రవారం తిరుపతిలో జరిగే కార్యక్రమాలలో పాల్గొని శనివారం ఉదయం పులివెందులకు చేరుకుంటారన్నారు. శనివారం ఉదయం పులివెందులలోని సుభాకర్‌రెడ్డి ఫంక్షన్ హాలులో పెద్దజూటూరుకు చెందిన వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి తమ్ముని కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొంటారన్నారు.
 
 అనంతరం తొండూరు మండలం బోడివారిపల్లె గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి సింహాద్రిపురం మండలం ఆహోబిలం వెళ్లి సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. తర్వాత పులివెందుల క్యాంపు కార్యాలయం చేరుకుని పార్టీ నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. సాయంత్రం 5గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుని వెఎస్‌ఆర్ సీపీ నాయకుడు అంబటి కృష్ణారెడ్డి కుమారుడు ఏర్పాటు చేసిన శ్రేయన్ హాస్పిటల్‌ను ప్రారంభిస్తారని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement