
రేపు వైఎస్ జగన్ పులివెందుల రాక
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 8వ తేదీ పులివెందుల రానున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 8, 9 తేదీలలో జిల్లాలో ఉంటారు. 8వ తేదీ ఉదయం ఇడుపులపాయ చేరుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొంటారు.
కుటుంబ సభ్యులతో వైఎస్‌ఆర్ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. మధ్యాహ్నం పులివెందుల క్యాంపు కార్యాలయంలో వేంపల్లి మండల నేతలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. గ్రామాల వారీగా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. అలాగే గ్రామస్థాయి నేతల సమస్యలను తెలుసుకోనున్నారు. 9వ తేదీ ఉదయం పులివెందుల కార్యాలయంలో ఉదయం సింహాద్రిపురం మండల నాయకులతో గ్రామాల వారీగా సమీక్ష చేపట్టనున్నారు. మధ్యాహ్నం లింగాల మండల నాయకులతో గ్రామాలవారీగా సమీక్ష చేపట్టనున్నారు.