సాక్షి, పులివెందుల : మూడేళ్ల స్పెషల్ అధికారుల పాలన అనంతరం శుక్రవారం మండలాధీశులు కొలువుదీరారు. ఎంపీపీ ఎన్నిక తర్వాత ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎన్ని అనైతిక కార్యకలాపాలకు పాల్పడినా.. జిల్లాలో అత్యధిక స్థానాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలో 50స్థానాలకుగానూ.. వైఎస్‌ఆర్ సీపీ 27 ఎంపీపీ స్థానాలను వశపరుచుకోగా.. టీడీపీకి కేవలం 16స్థానాలు మాత్రమే దక్కాయి. మరో 7మండలాల్లో ఎంపీటీసీలు హాజరుకాకపోవడంతో ఎంపీపీ స్థానాలకు సం బంధించి కోరంలేక వా యిదా పడ్డాయి. వాటికి సంబంధించి శనివారం ఆయా మండల కేంద్రాలలో ఎంపీపీ ఎన్నికను ప్రిసైడింగ్ అధికారులు నిర్వహించనున్నారు. కమలాపురం ఎంపీపీ, ఉపాధ్యక్ష, కోఆప్షన్ మెంబర్లకు సంబంధించి డిప్ తీయగా మూడు పదవులు టీడీపీకే దక్కాయి.
రాయచోటి సెగ్మెంట్‌లో క్లీన్‌స్వీప్
రాయచోటి సెగ్మెంట్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. నియోజకవర్గ పరిధిలో చిన్నమండెం, సంబేపల్లె, గాలివీడు, రామాపురం, రాయచోటి, ల క్కిరెడ్డిపల్లె మండలాలు ఉండగా.. అన్నింటిలోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎంపీపీలే ఎన్నికయ్యారు.
పులివెందుల సెగ్మెంట్‌లో 7మండలాలు ఉండగా.. 6మండలాల్లో వైఎస్‌ఆర్ సీపీ ఎంపీపీలను కైవసం చేసుకోగా.. ఒక్క మండలంలో కోరంలేక ఎన్నిక వాయిదా పడింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో కోరంలేక పెద్దముడియం, జమ్మలమడుగు, మైలవరం, ముద్దనూరు మండలాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
కొలువుదీరారు
Published Sat, Jul 5 2014 2:48 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement